హోమ్ /వార్తలు /బిజినెస్ /

OTP Scam: ఓటీపీ చెప్తే ఉన్నదంతా ఊడ్చేస్తారు... ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే?

OTP Scam: ఓటీపీ చెప్తే ఉన్నదంతా ఊడ్చేస్తారు... ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే?

OTP Scam: ఓటీపీ చెప్తే ఉన్నదంతా ఊడ్చేస్తారు... ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే?
(ప్రతీకాత్మక చిత్రం)

OTP Scam: ఓటీపీ చెప్తే ఉన్నదంతా ఊడ్చేస్తారు... ఈ స్కామ్ ఎలా జరుగుతుందంటే? (ప్రతీకాత్మక చిత్రం)

OTP Scam | ఆన్‌లైన్‌ షాపింగ్ (Online Shopping) సులువుగా ఉన్నా... కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మోసగాళ్ల బారిన పడక తప్పదు. కొత్తగా ఓటీపీ స్కామ్‌ కేసులు బయటపడుతున్నాయి. వీటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కొన్ని సంవత్సరాలుగా ఇండియాలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ (Online Shopping) వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎక్కువ మంది ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ట్రాఫిక్‌లు దాటుకుని ప్రయాణించి షాపింగ్‌లు చేసే తీరిక లేక ఎక్కువ మంది ఈ కామర్స్‌ సైట్‌లను ఆశ్రయిస్తున్నారు. ఆఫీసులో కూర్చుని కూడా ఆర్డర్‌లు ఇచ్చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌ కొనుగోలు సులువుగా ఉన్నా.. కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే మోసగాళ్ల బారిన పడక తప్పదు. కొత్తగా ఓటీపీ స్కామ్‌ (OTP Scam) కేసులు బయటపడుతున్నాయి. వీటిపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

OTP స్కామ్‌లు

ప్రస్తుతం అందరికీ వన్ టైం పాస్‌వర్డ్‌ (OTP) అంటే తెలిసే ఉంటుంది. OTP లేకుండా ఏ విధమైన ట్రాన్సాక్షన్ జరగడం లేదు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ షాపింగ్ ఆర్డర్లు పెరుగుతున్న కొద్దీ స్కామర్‌లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పద్ధతులు కనుగొంటున్నారు. అలాంటిదే ఈ OTP స్కామ్‌. అపరిచిత వ్యక్తులకు OTP షేర్‌ చేస్తే బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు మాయం అయిపోతాయి. ఏ ట్రాన్సాక్షన్‌కి సంబంధించిన ఓటీపీ వచ్చిందో తెలుసుకోకుండా, నిర్ధారించుకోకుండా ఎవ్వరికీ చెప్పకూడదు.

SBI Alert: ఎస్‌బీఐ కొత్త సర్వీస్... మీరూ వాడుకోండి ఇలా

తెలంగాణలోని సైబరాబాద్‌కి చెందిన సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు ఈ కొత్త తరహా OTP స్కామ్‌ల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉన్నప్పటికీ, వారి కుటుంబ సభ్యులు ఈ మోసాలకు చిక్కే అవకాశం ఉంది. అందుచేత అందరికీ OTP వంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్‌ చేయకూడదని అప్రమత్తంగా చేయాలి.

డెలివరీ OTP స్కామ్‌ ఎలా జరుగుతుంది?

ఈ డెలివరీ OTP స్కామ్‌లో.. ఈ కామర్స్ కంపెనీకి చెందిన వాడిలా డెలివరీ బాయ్ ఇంటికి వస్తాడు. ఆన్ లైన్‌లో ఆర్డర్ చేయనప్పటికీ ఆర్డర్ వచ్చిందని నమ్మిస్తాడు. ఆర్డర్ డెలివరీ చేయడానికి OTP చెప్పమని అడుగుతాడు. ఒకవేళ ఆర్డర్ చేయలేదు కాబట్టి వద్దు అని చెప్పినా.. ఆర్డర్ క్యాన్సిల్ చేయడానికి OTP చెప్పమని అడుగుతారు. OTP చెప్పే వరకు వదిలిపెట్టరు. ఒకవేళ ఈ కామర్స్ కంపెనీ నుంచి ఆర్డర్‌ వచ్చిందని నమ్మి OTP షేర్ చేస్తే, ఆ డెలివరీ బాయ్ రూపంలో ఉన్న స్కామర్‌ డబ్బులు దోచేస్తారు. షేర్‌ చేసిన OTP ఆ స్కామర్‌కి బ్యాంక్‌ వివరాలు అందిస్తుంది.

Missed Call Fraud: కలకలం రేపుతున్న మిస్డ్ కాల్ ఫ్రాడ్... నిర్లక్ష్యంగా ఉంటే నిలువునా దోచేస్తారు

జాగ్రత అవసరం

స్కామర్‌లు కుటుంబాల్లోని పెద్దలు, చదువుకోని వారికి డబ్బులు పే చెయ్యాలని ఒక లింకు పంపిస్తారు.. ఆ లింకు ద్వారా డబ్బులు పే చేయడానికి ప్రయత్నిస్తే.. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు అన్నీ స్కామర్‌కి చిక్కుతాయి. కుటుంబంలోని అందరికీ దీనిపై అవగాహన కల్పించాలి. డెలివరీ బాయ్‌లకు, ఏజెంట్‌లకు ఓటీపీ చెప్పేటప్పుడు నిర్ధారించుకోవాలి. నమ్మకం లేని, అస్సలు తెలియని వెబ్‌సైట్‌ లింక్‌లు ఓపెన్‌ చేయకూడదు.

మనం అనుమానించే విధంగా ఎటువంటి డెలివరీ రిక్వెస్ట్ వచ్చినా.. ఆ డెలివరీ బాయ్‌కి ఎటువంటి సమాచారం చెప్పకుండా.. వారు ఇంటిలోనికి రాకుండా జాగ్రత్త పడాలి. ఆన్‌లైన్‌ పేమెంట్లు చేసేటప్పుడు ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఉన్న క్రెడిట్ కార్డులు ఉపయోగించాలి. సెక్యూర్ పేమెంట్లను చేయాలి. ఎప్పటికప్పుడు కొత్త తరహా స్కాముల గురించి తెలుసుకుంటూ.. జాగ్రత్త పడాలి.

First published:

Tags: Banking, CYBER CRIME, CYBER FRAUD

ఉత్తమ కథలు