మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అకౌంట్ ఉందా? మీరు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ప్రత్యక్ష నగదు బదిలీ ప్రయోజనాలు పొందాలనుకుంటున్నారా? అయితే మీ ఆధార్ నెంబర్‌ను బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేయండి. ప్రభుత్వం పలు పథకాల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, సబ్సిడీలు ఇవ్వాలన్నా ఆధార్ నెంబర్లను ప్రామాణికంగా తీసుకుంటుంది. ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంకు అకౌంట్లకు డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన PM Kisan పథకం ద్వారా రైతులకు ఇలాగే ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.6,000 మూడు విడతల్లో జమ చేస్తోంది.
కరోనా వైరస్ సంక్షోభ కాలంలో కూడా పలు పథకాలకు ఈ విధంగానే నగదు బదిలీ చేసింది. అయితే బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి డబ్బులు జమ కాలేదు. దీంతో పథకం ప్రయోజనాలను కోల్పోయారు. సబ్సిడీలు, నగదు బదిలీ ప్రయోజనాలు పొందేందుకు ఖాతాదారులంతా తమ ఆధార్ నెంబర్లను బ్యాంకు అకౌంట్లతో అనుసంధానించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ట్విట్టర్ ద్వారా కోరుతోంది. బ్యాంకు అకౌంట్లకు ఆధార్ కార్డ్ సీడింగ్ చేసినవారికే ప్రభుత్వం నుంచి సబ్సిడీ, నగదు బదిలీ పొందడం సాధ్యమవుతుందని తెలిపింది.
ESIC Benefits: ఈఎస్ఐ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్... ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు కొత్త రూల్స్
Gold Loan Interest Rates: బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా? లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బ్యాంకు అకౌంట్లకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరికేమీ కాదు. కానీ ప్రభుత్వ పథకాలు పొందాలంటే మాత్రం ఇది తప్పనిసరి. ఎస్బీఐ కస్టమర్లు ఆధార్ నెంబర్‌ను బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేయడం చాలా సులువు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఆధార్ నెంబర్ అకౌంట్‌కు లింక్ చేయొచ్చు. లేదా ఏటీఎంలో కూడా లింక్ చేయొచ్చు. ఎస్బీఐ వెబ్సైట్ యాప్ ద్వారా కూడా ఆధార్ నెంబర్ అకౌంట్‌కు లింక్ చేయడం సులువే. మరి ఏ పద్ధతి ద్వారా ఎలా బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయాలో తెలుసుకోండి.
SBI Annuity Scheme: ప్రతీ నెల అకౌంట్లోకి డబ్బులు కావాలా? ఈ స్కీమ్ మీకోసమే
Gas Cylinder Discount: గ్యాస్ సిలిండర్‌పై డిస్కౌంట్... పొందండి ఇలా
SBI Website: ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ https://www.sbi.co.in/ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో Link your AADHAAR Number with your bank account పైన క్లిక్ చేయండి. మీ అకౌంట్ వివరాలు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో స్టేటస్ మీ మొబైల్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది.
SBI Internet Banking: ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్ https://www.onlinesbi.com/ ఓపెన్ చేయాలి. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. My Accounts సెక్షన్లో Link your Aadhaar number పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత అకౌంట్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. చివరగా సబ్మిట్ చేస్తే అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.
SBI Anywhere App: ఎస్బీఐ ఎనీవేర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత Requests పైన క్లిక్ చేయాలి. అందులో Aadhaar సెలెక్ట్ చేసిన తర్వాత Aadhaar Linking పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత CIF సెలెక్ట్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నియమనిబంధనల్ని అంగీకరించాలి. చివరగా సబ్మిట్ క్లిక్ చేయాలి.
SBI ADWM: ఎస్బీఐ ఏటీఎం సెంటర్లో ఈ మెషీన్ చూశారా? ఇలా వాడుకోండి
mAadhaar App: ఆధార్ కార్డు ఉందా? 35 సేవలకు ఎంఆధార్ యాప్ చాలు... ముఖ్యమైనవి ఇవే
SBI ATM: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలో మీ ఏటీఎం కార్డు స్వైప్ చేయాలి. పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మెనూలో Service-Registrations పైన క్లిక్ చేయాలి. మెనూలో ఆధార్ రిజిస్ట్రేషన్ పైన సెలెక్ట్ చేయాలి. అకౌంట్ టైప్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. మరోసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
SBI Branch: మీకు దగ్గర్లోని ఎస్బీఐ బ్రాంచ్‌కు వెళ్లాలి. అకౌంట్‌కు ఆధార్ లింకింగ్ కోసం దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి. దరఖాస్తు ఫామ్‌కు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ జతచేయాలి. వెరిఫికేషన్ తర్వాత మీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.