ఎస్‌బీఐ ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.20,000 మాత్రమే

ఎందుకంటే క్లాసిక్, మ్యాస్ట్రో కార్డులపై మాత్రమే రూ.40,000 విత్‌డ్రా లిమిట్ ఉండేది. అది ఇకపై రూ.20,000 మాత్రమే. ఎక్కువ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే ఎస్‌బీఐ గోల్డ్, ప్లాటినమ్ డెబిట్ కార్డులపై ఎలాంటి పరిమితి లేదు. ఎస్‌బీఐ గోల్డ్ కార్డుపై విత్‌డ్రా లిమిట్ రూ.50,000, ప్లాటినమ్ కార్డుపై రూ.1,00,000 వరకు విత్‌డ్రా లిమిట్ ఉంటుంది.

news18-telugu
Updated: October 31, 2018, 9:52 AM IST
ఎస్‌బీఐ ఏటీఎం విత్‌డ్రా లిమిట్ రూ.20,000 మాత్రమే
ఎస్‌బీఐ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్: తగ్గిన ఏటీఎం విత్‌డ్రా లిమిట్
  • Share this:
మీ దగ్గర ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? తరచూ ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుంటారా? అయితే ఇది మీకు బ్యాడ్ న్యూసే. ఏటీఎంలో విత్‌డ్రా లిమిట్ తగ్గింది. బుధవారం(అక్టోబర్ 31) నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇక ఏటీఎంలో ఒక రోజులో రూ.20,000 కన్నా ఎక్కువ డ్రా చేసుకోలేరు. ఇంతకుముందు రోజూ రూ.40,000 వరకు ఏటీఎంలో డ్రా చేసుకునే అవకాశముండేది. అయితే ఇటీవల ఏటీఎంల దగ్గర మోసాలు పెరిగిపోతున్నాయన్న ఫిర్యాదులు, మరోవైపు ప్రజలు డిజిటల్, క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ అలవాటు చేసుకోవాలన్న కారణాలతో విత్‌డ్రా లిమిట్ తగ్గించింది ఎస్‌బీఐ.

ఒకవేళ మీకు ఎక్కువ విత్‌డ్రా లిమిట్ కావాలనుకుంటే మాత్రం ఎస్‌బీఐ గోల్డ్, ప్లాటినమ్ డెబిట్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే క్లాసిక్, మ్యాస్ట్రో కార్డులపై మాత్రమే రూ.40,000 విత్‌డ్రా లిమిట్ ఉండేది. అది ఇకపై రూ.20,000 మాత్రమే. ఎక్కువ విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే ఎస్‌బీఐ గోల్డ్, ప్లాటినమ్ డెబిట్ కార్డులపై ఎలాంటి పరిమితి లేదు. ఎస్‌బీఐ గోల్డ్ కార్డుపై విత్‌డ్రా లిమిట్ రూ.50,000, ప్లాటినమ్ కార్డుపై రూ.1,00,000 వరకు విత్‌డ్రా లిమిట్ ఉంటుంది. సో... మీ దగ్గర క్లాసిక్, మ్యాస్ట్రో కార్డులుంటే క్యాష్ విత్‌డ్రాకు ఇబ్బందులు తప్పవు.

ఇవి కూడా చదవండి:

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? ఇది మీకోసమే!చిప్ లేదా... ఎస్‌బీఐ కార్డు మార్చుకోవాల్సిందే!

Video: ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌: నెంబర్ ఎలా రిజిస్టర్ చేయించాలి?
First published: October 31, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...