• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • ALERT FOR SBI BASIC SAVINGS BANK DEPOSIT ACCOUNT HOLDERS STATE BANK OF INDIA TO IMPLEMENT NEW CASH WITHDRAWAL AND CHEQUE BOOK CHARGES FROM 2021 JULY 1 SS

SBI Charges: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు

SBI Charges: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్... జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు (ప్రతీకాత్మక చిత్రం)

SBI Charges | ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందా? జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఆ ఛార్జీల వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు 2021 జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. క్యాష్ విత్‌డ్రాయల్, చెక్ బుక్ ఛార్జీల్లో మార్పులు రానున్నాయి. ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ హోల్డర్లకు ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడం, చెక్‌బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. ఎస్‌బీఐలో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న రూల్ ఉండదు. ఇతర అకౌంట్లలో అయితే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

    ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+జీఎస్‌టీ వర్తిస్తుంది. అంటే ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసే అవకాశం ఉంటుంది.

    Bank Account: కస్టమర్లకు అలర్ట్... ఈ బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ పనిచేయవు

    Credit Card: ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే 71 లీటర్ల పెట్రోల్ ఉచితం

    ఇక ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ హోల్డర్లకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్ చెక్ బుక్ ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత మరో 10 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.40+జీఎస్‌టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+జీఎస్‌టీ చెల్లించాలి. 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి. సీనియర్ సిటజన్లకు చెక్ బుక్‌పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు. ఇక ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లల్లో ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ హోల్డర్ల జరిపే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు.

    Bank Charges: మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఈ ఛార్జీల గురించి తెలుసా?

    EPF Withdrawal: పీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?

    ఆర్థికంగా వెనకబడిన వారికి బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ డిపాజిట్- BSBD అకౌంట్ రూపొందించింది. తక్కువ ఆదాయం ఉన్నవారికి ఈ అకౌంట్ కాబట్టి మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ వర్తించవు. ఈ అకౌంట్ ఓపెన్ చేసినవారికి ఉచితంగా ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ లభిస్తుంది. అకౌంట్ ఆపరేట్ చేయకపోయినా, ఇనాపరేటీవ్‌గా ఉన్న అకౌంట్‌ని తిరిగి యాక్టీవ్ చేయాలన్నా ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ సేవలు ఉచితం. ఏ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో అయినా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: