• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • ALERT FOR ROYAL ENFIELD OWNERS COMPANY RECALLS OVER 2 LAKH BIKES KNOW WHY SS GH

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొన్నవారికి అలర్ట్... బైకుల్ని వెనక్కి తీసుకుంటున్న కంపెనీ

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ కొన్నవారికి అలర్ట్... బైకుల్ని వెనక్కి తీసుకుంటున్న కంపెనీ (ప్రతీకాత్మక చిత్రం)

Royal Enfield | రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్లో సమస్యలు తలెత్తడంతో రెండు లక్షలకు పైగా బైకుల్ని వెనక్కి పిలిపిస్తోంది కంపెనీ.

  • Share this:
జనవరి నుంచి ఏప్రిల్‌ మధ్య రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లు కొన్నారా? అయితే ఓసారి వాటిని చెక్‌ చేసుకోవడం బెటర్‌. ఎందుకంటే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ తమ బైక్‌లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా‌ సహా వివిధ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి దాదాపు 2,36,966 బైక్‌లను వెనక్కి పిలుస్తున్నట్లు ప్రకటించింది. అందులో క్లాసిక్‌ 350, బుల్లెట్350‌, మెటియోర్‌ 350 బైకులు ఉన్నాయి. ఇండియా, థాయ్‌ లాండ్‌, మలేసియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నుంచి ఈ బైక్‌లు వెనక్కి తీసుకుంటున్నారు. ఇగ్నిషన్‌ కాయిల్‌లో సమస్యలు తలెత్తడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. ఈ సమస్య వల్ల ఏకంగా ఇంజిన్‌ మిస్‌ ఫైర్‌ అయ్యే అవకాశం ఉంది. దాని వల్ల బండి పర్‌ఫార్మెన్స్‌లో తేడా కనిపిస్తుంది. దాంతోపాటు ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్య్యూట్‌ కూడా అయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే ఇది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతందని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ చెబుతోంది.

Money Transfer: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? 14 గంటలు ఆ సేవలు బంద్

EPF Withdrawal: కరోనాతో మరణించినవారి ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డ్రా చేయండిలా

రాయల్ ఎన్‌ఫీల్డ్ జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడవంతో ఇటీవల తయారు చేసి, మార్కెట్‌లోకి పంపిన లాసిక్‌ 350, బుల్లెట్350‌, మెటియోర్‌ 350 బైకులను వెనక్కి తీసుకుంటున్నారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య తయారు చేసిన బైక్‌ల్లోనే ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఈ లెక్కన జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు అమ్మిన వాహనాల్లోనే ఈ సమస్య వస్తుంది. అయితే ఈ సమయంలో అమ్మిన అన్ని వాహనాలకు సమస్య రాదని, కొన్నే ఇబ్బందులు పడతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో ముందస్తు జాగ్రత్తగా అన్ని వాహనాలను వెనక్కి తీసుకుంటున్నట్లు సంస్థ చెబుతోంది.

Gold Hallmarking: హాల్‌మార్కింగ్ అంటే ఏంటీ? ఎలా గుర్తించాలి? తెలుసుకోండి

SBI Zero Balance Account: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయండిలా

వెనక్కి తీసుకున్న వాహనాలను పరిశీలించి, అవసరమైన పార్టును రీప్లేస్‌ చేస్తామని చెబుతోంది రాయల్‌ ఎన్‌ఫీల్డ్. అయితే పది శాతం వాహనాలకు మాత్రమే ఈ రీప్లేస్‌మెంట్‌ అవసరమవుతుంది. ఇలాంటి ఇబ్బంది ఉన్న వాహనాల ఓనర్లను రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ టీమ్ కాంటాక్ట్‌ అవుతుంది. లేకపోతే వినియోగదారులు కూడా డీలర్ షిప్‌ను కాంటాక్ట్‌ చేయొచ్చు. దీని కోసం వెబ్‌సైట్‌లో ఓ హాట్‌లైన్‌ నెంబరు కూడా ఇచ్చారు. మీరు ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌‌ 350, బుల్లెట్350‌, మెటియోర్‌ 350 బైక్‌లు కొనుగోలు చేసి ఉంటే... వెంటనే డీలర్‌ను సంప్రదించి చెక్‌ చేయిచుకోండి. గతంలోనూ ఇలాంటి సమస్యలతో కొన్ని సంస్థలు బైక్‌లను వెనక్కి తీసుకున్నాయి. అయితే ఎక్కువ టెస్టులు చేసి బైక్‌లు విడుదల చేసే ఈ సంస్థలు ఇలాంటి సమస్యను ఎలా మిస్‌ అయ్యాయని కస్టమర్లు చర్చించుకుంటున్నారు.
Published by:Santhosh Kumar S
First published: