తరచూ రైలు ప్రయాణం చేసేవారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) గురించి పరిచయం అక్కర్లేదు. రైలు టికెట్ల బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా ఐఆర్సీటీసీ మొబైల్ యాప్ (IRCTC Mobile App) ఉపయోగిస్తుంటారు. ఎక్కువగా రైలు ప్రయాణాలు చేసేవారికి టికెట్ బుకింగ్ ప్రాసెస్ తెలిసిందే. అయితే ఇటీవల ఐఆర్సీటీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్ పద్ధతిని కాస్త మార్చింది. ఇప్పుడు రైలు టికెట్లు బుక్ చేయాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా తమ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ వెరిఫై చేయాల్సింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ అయినా, ఐఆర్సీటీసీ యాప్ అయినా టికెట్ బుకింగ్ కోసం వెరిఫికేషన్ తప్పనిసరి.
వెరిఫికేషన్ పూర్తి చేయని ఐఆర్సీటీసీ యూజర్స్ రైలు టికెట్లు బుక్ చేయడం సాధ్యం కాదు. మరి ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్లో మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎలా వెరిఫై చేయాలో తెలుసుకోండి.
IRCTC Nepal Tour: హైదరాబాద్ నుంచి నేపాల్‌కు ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ
Step 1- ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి.
Step 2- యూజర్లు తమ వివరాలతో లాగిన్ కావాలి.
Step 3- వెరిఫికేషన్ విండో పైన క్లిక్ చేయాలి.
Step 4- మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 5- మీరు గతంలోనే ఈ వివరాలు ఎంటర్ చేసినట్టైతే అందులో ఏవైనా మార్పులు ఉంటే అప్డేట్ చేయాలి.
Step 6- మీ మొబైల్ ఐడీకి, ఇమెయిల్ ఐడీకి వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
వెరిఫికేషన్ పూర్తైన తర్వాత ఐఆర్సీటీసీ యూజర్లు రైలు టికెట్లు బుక్ చేయొచ్చు. అయితే రైల్వే ప్రయాణికులు తమ ఐఆర్సీటీసీ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేస్తే నెలకు 12 టికెట్లు బుక్ చేయొచ్చు. ఐఆర్సీటీసీ ప్లాట్ఫామ్లో రైలు టికెట్లు ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.
IRCTC Tour: హైదరాబాద్ నుంచి జగన్నాథ రథయాత్ర టూర్... ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివే
Step 1- ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి.
Step 2- యూజర్లు తమ వివరాలతో లాగిన్ కావాలి.
Step 3- ఆ తర్వాత ప్రయాణించాలనుకునే స్థలం, వెళ్లాలనుకునే ఊరి పేరు ఎంటర్ చేయాలి.
Step 4- ప్రయాణించే తేదీని సెలెక్ట్ చేయాలి.
Step 5- సెర్చ్ చేస్తే రైళ్ల జాబితా కనిపిస్తుంది.
Step 6- అందులో రిజర్వేషన్ స్టేటస్, ఖాళీగా ఉన్న సీట్లు, వెయిటింగ్ లిస్ట్ వివరాలు కనిపిస్తాయి.
Step 7- ప్రయాణించాలనుకునే రైలును సెలెక్ట్ చేసిన తర్వాత 'Book Now' పైన క్లిక్ చేయాలి.
Step 8- ప్రయాణికుల పేరు, వయస్సు, జెండర్, బెర్త్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
Step 9- చివరగా పేమెంట్ ప్రాసెస్ పూర్తి చేస్తే రైలు టికెట్లు బుక్ అవుతాయి.
రైలు టికెట్లు బుక్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీకి బుకింగ్ వివరాలు వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, Railways, Train tickets