ALERT FOR PUNJAB NATIONAL BANK CUSTOMERS SAVINGS ACCOUNT CHEQUE RULES AND CHARGES CHANGED WILL COME INTO EFFECT FROM MAY 29 SS
Bank Account: ఆ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్... సేవింగ్స్ అకౌంట్, చెక్ రూల్స్ మారాయి
Bank Account: ఆ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్... సేవింగ్స్ అకౌంట్, చెక్ రూల్స్ మారాయి
(ప్రతీకాత్మక చిత్రం)
Bank Account | పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సేవింగ్స్ అకౌంట్, చెక్ బుక్స్, లాకర్స్ విషయంలో పలు మార్పుల్ని చేసింది. కొత్త ఛార్జీలను ప్రకటించింది. కొత్త రూల్స్ మే 29 నుంచి అమలులోకి వస్తాయి.
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) పలు రకాల ఛార్జీలను పెంచింది. ఉచిత లావాదేవీల లిమిట్లో కూడా మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ మే 29 నుంచి అమలులోకి వస్తాయి. దీంతో పాటు ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ 0.40 శాతం పెంచి 6.90 శాతం చేసినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేట్‌ను 40 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే. దీంతో బ్యాంకు కూడా వడ్డీ రేటును 0.40 శాతం పెంచింది. సేవింగ్స్ అకౌంట్, ఇతర అకౌంట్లలో ఉచిత లావాదేవీల సంఖ్యలో మార్పులు ఉన్నాయి. మరి ఏ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉన్నాయో తెలుసుకోండి.
Savings Account: పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచింది. లిమిట్ దాటిన తర్వాత వసూలు చేసే ఛార్జీలు కూడా పెరిగాయి. గతంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉచిత ట్రాన్సాక్షన్స్ లిమిట్ 40 ఉండగా, ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.2 చొప్పున ఛార్జీ వసూలు చేసేది. ఇకపై 50 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.10 చొప్పున ఛార్జీ చెల్లించాలి.
Cheque Returning Charges: చెక్ రిటర్నింగ్ ఛార్జీల విషయంలో కొత్త శ్లాబ్ ప్రతిపాదించింది. రూ.1,00,000 నుంచి రూ.10,00,000 వరకు ఔట్వర్డ్ ట్రాన్సాక్షన్స్‌పై రూ.250 ఛార్జీలు చెల్లించాలి. రూ.10,00,000 కన్నా ఎక్కువైతే ప్రతీ లావాదేవీకి రూ.500 చొప్పున చెల్లించాలి.
Cheque Book Issuance: పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు ఇచ్చే చెక్ బుక్‌లో ఇకపై 25 కాకుండా 20 చెక్స్ మాత్రమే ఉంటాయి.
Locker Charges: లాకర్ ఛార్జీలు ఆలస్యం చేస్తే యాన్యువల్ రెంట్లో 25 శాతం పెనాల్టీ చెల్లించాలి. ఒక ఏడాది నుంచి మూడేళ్ల వరకు జాప్యం చేస్తే యాన్యువల్ రెంట్లో 50 శాతం చెల్లించాలి. మూడేళ్ల కన్నా ఎక్కువ ఆలస్యం చేస్తే బ్యాంకు ఆ లాకర్‌ను పగలగొట్టి తెరుస్తుంది. అయితే ఐదేళ్ల లాకర్ రెంట్ ఒకేసారి చెల్లించే అవకాశం ఇస్తోంది. పలు మెట్రో శాఖలలో 25 శాతం ప్రీమియం రెంట్ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ లాకర్ హోల్డర్ అడ్వాన్స్‌గా అద్దె చెల్లించిన ఐదేళ్ల వ్యవధి ముగిసేలోపు లాకర్‌ను సరెండర్ చేస్తే, యాన్యువల్ కార్డ్ రేట్ ప్రకారం లాకర్ అద్దె వసూలు చేస్తారు.
Other Charges: ఇక కరెంట్, క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్, ఇతర అకౌంట్లలో రోజూ రూ.1,00,000 వరకు లావాదేవీలపై ఛార్జీలు ఉండవు. రూ.1,00,000 కన్నా ఎక్కువ లావాదేవీలపై ప్రతీ రూ.1,000 కి రూ.10 చొప్పున ఛార్జీలు చెల్లించాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.