హోమ్ /వార్తలు /బిజినెస్ /

Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? కొత్త రూల్స్ తెలుసుకోండి

Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? కొత్త రూల్స్ తెలుసుకోండి

Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? కొత్త రూల్స్ తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? కొత్త రూల్స్ తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Account | పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account) ఉన్నవారికి కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. నగదు విత్‌డ్రా చేసేవారికి ఈ రూల్స్ వర్తిస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పోస్ట్ ఆఫీసులో అకౌంట్ (Post Office Account) ఉన్నవారికి అలర్ట్. ఇటీవల కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ క్యాష్ విత్‌డ్రాయల్ రూల్స్ (Cash Withdrawal Rules) మార్చింది. రూ.10,000 లేదా అంతకన్నా ఎక్కువ విలువైన నగదు విత్‌డ్రా చేస్తే ఈ రూల్స్ వర్తిస్తాయి. ఆగస్ట్ 25న కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్‌లల్లో సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.10,000 లేదా అంతకన్నా ఎక్కువ నగదు విత్‌డ్రా చేయాలంటే వెరిఫికేషన్ తప్పనిసరి. బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవడం కోసం పోస్ట్ ఆఫీసుల్లో ఈ వెరిఫికే,న్ పద్ధతిని తీసుకొచ్చింది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్.

సింగిల్ హ్యాండ్ పోస్టాఫీసుల్లో రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు తీసుకుంటే వెరిఫికేషన్ ఉండదని, బ్రాంచ్ పోస్టాఫీసుల్లో విత్‌డ్రాలకు మాత్రమే వెరిఫికేషన్ ఉంటుందని సర్క్యులర్‌లో వివరించింది కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ. అన్ని నివారణ చర్యలు, తనిఖీలు నిర్వహించి మోసాలను జరగకుండా మొదట్లోనే అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయడం సర్కిల్ హెడ్స్ ప్రత్యేక బాధ్యతని, స్థానిక పరిస్థితుల దృష్ట్యా అవసరమైతే మరిన్ని ప్రత్యేక తనిఖీలు చేయడానికి వారికి స్వేచ్ఛ ఉందని తెలిపింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లల్లో మోసాలు తగ్గించడంలో భాగంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ సూచించింది.

Laptop Offer: ఈ ల్యాప్‌టాప్‌పై రూ.17,000 డిస్కౌంట్... విద్యార్థులు, ఉద్యోగులకు మంచి ఛాన్స్

ఇక ఇటీవల కస్టమర్లకు విత్‌డ్రాయల్స్ లిమిట్‌ను కూడా పెంచింది ఇండియా పోస్ట్. కొత్త మార్పు ప్రకారం గ్రామీణ డాక్ సేవా బ్రాంచ్‌లో ఒక రోజులో రూ.20,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. గతంలో ఈ లిమిట్ కేవలం రూ.5,000 మాత్రమే ఉండేది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ను ఎవరైనా తెరవొచ్చు. కనీసం రూ.500 చెల్లించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇద్దరు వ్యక్తులు కలిసి జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. మైనర్ల పేరు మీదా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సింగిల్ అకౌంట్‌ను జాయింట్ అకౌంట్‌గా కూడా మార్చొచ్చు.

Aadhaar Card Update: మీ ఆధార్‌లో ఈ వివరాలున్నాయా? అప్‌డేట్ చేయండిలా

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నవారికి చెక్ బుక్, ఏటీఎం కార్డ్, మొబైల్ బ్యాంకింగ్, ఇబ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్‌లో గరిష్టంగా ఎంతైనా పొదుపు చేయొచ్చు. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి 4 శాతం వడ్డీ లభిస్తుందన్న విషయం తెలిసిందే. బ్యాంకులో ఇంతకన్నా తక్కువ వడ్డీ వస్తుంది. సేవింగ్స్ అకౌంట్‌లో వచ్చే వడ్డీపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA ప్రకారం పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.10,000 పన్ను మినహాయింపు పొందవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: India post, Personal Finance, Post office, Post office scheme

ఉత్తమ కథలు