హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM KISAN: రైతులకు అలర్ట్... వారికి మాత్రమే పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్

PM KISAN: రైతులకు అలర్ట్... వారికి మాత్రమే పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్

PM KISAN: రైతులకు అలర్ట్... వారికి మాత్రమే పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్
(ప్రతీకాత్మక చిత్రం)

PM KISAN: రైతులకు అలర్ట్... వారికి మాత్రమే పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ (ప్రతీకాత్మక చిత్రం)

PM KISAN Scheme | ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఉన్న రైతులకు అలర్ట్. పీఎం కిసాన్ స్కీమ్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM KISAN 11th Installment) మీ అకౌంట్‌లో జమ కావాలంటే వెంటనే ఇకేవైసీ పూర్తి చేయాలి.

పీఎం కిసాన్ పథకం 11వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan Installment) కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే 11వ ఇన్‌స్టాల్‌మెంట్ విడుదల చేయనుంది. అయితే ఈసారి రైతులందరికీ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ (11th Installment) లభించదు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి వాయిదాను జూలైలోగా విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ డబ్బులు పొందాలనుకుంటే రైతులు తప్పనిసరిగా ఇకేవైసీ చేయించాలి. ఈ విషయాన్ని పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో వెల్లడించింది ప్రభుత్వం. 2022 మే 31 లోగా పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ తప్పనిసరిగా ఇకేవైసీ పూర్తి చేయాలి. ఇకేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే ఈసారి పీఎం కిసాన్ డబ్బులు లభిస్తాయి.

ఇప్పటికే లక్షలాది మంది రైతులు ఇకేవైసీ ప్రక్రియ పూర్తి చేశారు. ఆ రైతులు స్టేటస్ చెక్ చేయొచ్చు. స్టేటస్‌లో ‘FTO is generated and Payment confirmation is pending’ అని కనిపిస్తే వెరిఫికేషన్ పూర్తైనట్టే. కాబట్టి వారికి పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ లభిస్తుంది. ఇకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇందుకోసం https://pmkisan.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Farmers Corner సెక్షన్‌లో Beneficiary Status పైన క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేయాలి. పైన చెప్పిన విధంగా స్టేటస్ ఉంటే ఇన్‌స్టాల్‌మెంట్ రైతుల అకౌంట్‌లో జమ అవుతుంది.

Credit Card Rules: ఆ విషయంలో ఆలస్యం జరిగితే రోజూ రూ.500 చెల్లించనున్న బ్యాంకులు

ఇక ఇప్పటివరకు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తిచేయని రైతులు తప్పనిసరిగా ఈ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఇకేవైసీ పూర్తి చేస్తేనే వారికి నెక్స్‌ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వస్తుంది. ప్రస్తుతం పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in/ లో ఇ-కేవైసీ నిలిచిపోయింది. రైతులు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ ద్వారా ఇ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇ-కేవైసీ అప్‌డేట్ చేసే అవకాశం లేదు కాబట్టి రైతులు కామన్ సర్వీస్ సెంటర్‌లో 2022 మే 31 లోగా ఇ-కేవైసీ చేయించాలి.

LIC Policy: ఈ పాలసీతో ప్రీమియం తక్కువ... బెనిఫిట్స్ ఎక్కువ

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2018లో ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ ఏటా మూడు విడతల్లో రూ.2,000 చొప్పున మొత్తం రూ.6,000 సాయాన్ని అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతీ ఏటా ఏప్రిల్ నుంచి జూలై మధ్య మొదటి వాయిదా, ఆగస్ట్ నుంచి నవంబర్ మధ్య రెండో వాయిదా, డిసెంబర్ నుంచి మార్చి మధ్య మూడో వాయిదా చెల్లిస్తోంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 10 ఇన్‌స్టాల‌్‌మెంట్స్ వచ్చాయి. 11వ ఇన్‌స్టాల్‌మెంట్ జూలైలోగా రానుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Farmer, PM KISAN, PM Kisan Scheme, Pradhan Mantri Kisan Samman Nidhi

ఉత్తమ కథలు