PAN Card: అలర్ట్... ఈ 18 ట్రాన్సాక్షన్స్‌కు పాన్ కార్డ్ తప్పనిసరి

PAN Card: అలర్ట్... ఈ 18 ట్రాన్సాక్షన్స్‌కు పాన్ కార్డ్ తప్పనిసరి (ప్రతీకాత్మక చిత్రం)

PAN Card | పాన్ కార్డు ఉన్నవారికి అలర్ట్. మీరు జరిపే ఈ 18 లావాదేవీలకు తప్పనిసరిగా పాన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లావాదేవీలు ఏవో తెలుసుకోండి.

  • Share this:
    మీరు ఎక్కువగా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంటారా? భారీ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా? అయితే మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ కార్డ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు జరపడానికి పాన్ కార్డ్ ముఖ్యమైన డాక్యుమెంట్ అన్న సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ పాన్ కార్డ్ చాలా సందర్భాల్లో అవసరం అవుతుంది. పెద్ద స్థాయిలో లావాదేవీలు జరపాలంటే పాన్ నెంబర్ ఉండాల్సిందే. లేకపోతే ఆ లావాదేవీలు జరపలేరు. పన్ను చెల్లింపులు, ఆదాయపు పన్ను రిటర్న్స్, కొనుగోళ్లు... ఇలా చాలా సందర్భాల్లో పాన్ నెంబర్ అవసరం. ఆదాయపు పన్ను చట్టంలోని 114బీ రూల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కన్స్యూలర్ ఆఫీసులు తప్ప అందరూ పాన్ కార్డు ఇవ్వాల్సిందే. మరి ఏఏ లావాదేవీల్లో పాన్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటుందో తెలుసుకోండి.

    1. టూవీలర్ తప్ప మోటార్ వెహికిల్, ఇతర వాహనాల కొనుగోలు లేదా అమ్మకం.

    2. కో-ఆపరేటీవ్ బ్యాంక్, బ్యాంకింగ్ కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేయడం.

    3. క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ అప్లికేషన్.

    4. డిపాజిటరీ, పార్టిసిపెంట్, కస్టోడియన్ ఆఫ్ సెక్యూరిటీస్ లేదా సెబీ గుర్తింపు పొందిన సంస్థల నుంచి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం.

    PAN Aadhaar Link Status: గతంలో పాన్, ఆధార్ లింక్ చేశారా? ఓసారి స్టేటస్ చెక్ చేయండి ఇలా

    PAN Card: మీ పాన్ కార్డుపై ఉన్న 10 డిజిట్స్‌కి అర్థం తెలుసా?

    5. హోటల్ లేదా రెస్టారెంట్‌లో ఒకేసారి రూ.50,000 కన్నా ఎక్కువ నగదు చెల్లింపులు.

    6. విదేశీ ప్రయాణాలకు రూ.50,000 నగదు చెల్లింపులు లేదా ఫారిన్ కరెన్సీతో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు.

    7. రూ.50,000 కన్నా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొన్నప్పుడు.

    8. రూ.50,000 కన్నా ఎక్కువగా డిబెంచర్స్ లేదా బాండ్స్ కొనడానికి ఏదైనా కంపెనీకి, ఇన్‌స్టిట్యూషన్‌కు చెల్లింపులు చేసినప్పుడు.

    9. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI జారీ చేసిన బాండ్స్ కొనడానికి రూ.50,000 కన్నా ఎక్కువ చెల్లింపులు చేసినప్పుడు.

    e-PAN Card: ఇ-పాన్ కార్డ్ 10 నిమిషాల్లో తీసుకోవచ్చు... ఈ స్టెప్స్ ఫాలో అవండి

    Aadhaar Card Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... ఈ రెండు సేవలు లభించవు

    10. ఏదైనా బ్యాంకులో ఒక రోజులో రూ.50,000 కన్నా ఎక్కువ నగదు డిపాజిట్ చేసినప్పుడు లేదా 2016 నవంబర్ 9 నుంచి 2016 డిసెంబర్ 30 మధ్య మొత్తం రూ.2,50,000 నగదు జమ చేసినప్పుడు.

    11. ఒక రోజులో రూ.50,000 కన్నా ఎక్కువ బ్యాంక్ డ్రాఫ్ట్స్, పే ఆర్డర్స్, బ్యాంకర్స్ చెక్ తీసుకోవడానికి చెల్లింపులు చేసినప్పుడు.

    12. బ్యాంకు, కో-ఆపరేటీవ్ బ్యాంక్, పోస్ట్ ఆఫీసులో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ, కంపెనీస్ యాక్ట్ 2016 సెక్షన్ 406 లో ప్రస్తావించిన నిధిలో ఒకేసారి రూ.50,000 లేదా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,00,000 ఎక్కువ టైమ్ డిపాజిట్ చేసినప్పుడు.

    13. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 కన్నా ఎక్కువ నగదు, బ్యాంక్ డ్రాఫ్ట్, పే ఆర్డర్, బ్యాంకర్స్ చెక్ ద్వారా చెల్లింపులు జరిపినప్పుడు.

    14. లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.50,000 కన్నా ఎక్కువ పేమెంట్ చేసినప్పుడు.

    Aadhaar Card: ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా ఉందా? ఇలా మార్చేయండి

    Aadhaar Number: ఆధార్ నెంబర్ సరైనదేనా? వెరిఫై చేయండి ఇలా

    15. రూ.1,00,000 కన్నా ఎక్కువ షేర్లు కాకుండా ఇతర సెక్యూరిటీస్ కొనడానికి లేదా అమ్మడానికి ఒప్పందం చేసుకున్నప్పుడు.

    16. గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్‌ఛేంజ్ నుంచి లిస్టింగ్‌లో లేని కంపెనీకి చెందిన షేర్లు రూ.1,00,000 కన్నా ఎక్కువ కొనేందుకు లేదా అమ్మేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు.

    17. రూ.10,00,000 కన్నా ఎక్కువ లేదా స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకం.

    18. వస్తువులు లేదా సేవల కోసం రూ.2,00,000 కన్నా ఎక్కువ చెల్లింపులు జరిపినప్పుడు.

    పైన వెల్లడించిన జాబితాలో 3, 5, 6, 9, 11, 13, 18 పాయింట్స్‌లో నాన్ రెసిడెంట్ పాన్ కార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆదాయం లేని ఇక మైనర్లు తమ తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పాన్ కార్డ్ ఇవ్వొచ్చు. ఇక పాన్ కార్డ్ లేనివాళ్లు పైన వెల్లడించిన లావాదేవీలు జరిపినట్టైతే ఆదాయపు పన్ను శాఖ నోటీస్ లేదా విచారణ ఎదుర్కోకుండా ఉండేందుకు ఫామ్ నెంబర్ 60 లో డిక్లరేషన్ ఇవ్వొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: