హోమ్ /వార్తలు /బిజినెస్ /

PAN Card: వారి పాన్ కార్డ్ చెల్లదు... ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక

PAN Card: వారి పాన్ కార్డ్ చెల్లదు... ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక

PAN Card: వారి పాన్ కార్డ్ చెల్లదు... ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక
(ప్రతీకాత్మక చిత్రం)

PAN Card: వారి పాన్ కార్డ్ చెల్లదు... ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక (ప్రతీకాత్మక చిత్రం)

PAN Card | పాన్ కార్డ్ ఉన్నవారికి ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) హెచ్చరిక జారీ చేసింది. వారి పాన్ కార్డులు చెల్లవని తెలిపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

పాన్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్. ఆధార్ కార్డ్ లింక్ చేయని పాన్ కార్డ్ (PAN Card) చెల్లదని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. 2023 మార్చి 31 లోగా పాన్-ఆధార్ లింక్ (PAN Aadhaar Link) చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ కార్డ్ లింక్ చేయని పాన్ కార్డులు ఏవీ చెల్లవు. ఇప్పుడు ఆధార్ నెంబర్ లింక్ చేయాలన్నా రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం పాన్ కార్డులకు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి 2023 మార్చి 31 చివరి తేదీ అని, మినహాయింపు కేటగిరీలోకి రాని వారందరూ అప్పట్లోగా తమ పాన్-ఆధార్ లింక్ చేయాలని, ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు ఇనాపరేటీవ్‌గా అంటే చెల్లనివిగా మారతాయని, అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే పాన్-ఆధార్ లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేసింది.

పాన్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ చాలాకాలంగా కోరుతున్న సంగతి తెలిసిందే. అనేకసార్లు గడువు కూడా పొడిగించింది. చివరిసారి విధించిన గడువు 2022 మార్చి 31న ముగిసింది. ఆ తర్వాత కూడా రూ.500 జరిమానా చెల్లించి పాన్-ఆధార్ లింక్ చేసేందుకు అవకాశం ఇచ్చింది ఆదాయపు పన్ను శాఖ. ఈ గడువు కూడా జూన్ 30న ముగిసింది. ఇప్పుడు రూ.1,000 జరిమానా చెల్లించి పాన్-ఆధార్ లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ గడువు 2023 మార్చి 31న ముగుస్తుంది. ఆ తర్వాత ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులన్నీ ప్లాస్టిక్ కార్డులుగా మిగిలిపోతాయి. వాటికి ఏ విలువా ఉండదు. మరి రూ.1,000 జరిమానా చెల్లించి పాన్-ఆధార్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.

SBI Safety Tips: లోన్ యాప్స్‌తో జాగ్రత్త... ఈ 6 టిప్స్ పాటించమంటున్న ఎస్‌బీఐ

ముందుగా onlineservices.tin.egov-nsdl.com/etaxnew/tdsnontds.jsp వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

CHALLAN NO./ITNS 280 పైన క్లిక్ చేసి Proceed పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత కంపెనీలకు అయితే కార్పొరేట్ ట్యాక్స్, వ్యక్తిగతంగా అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Type of Payment సెక్షన్లో Other Receipts పైన క్లిక్ చేయాలి.

పాన్ కార్డ్ వివరాలు సెలెక్ట్ చేయాలి.

అసెస్‌మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసి అడ్రస్ పూర్తి చేయాలి.

ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేయాలి.

పేమెంట్ ప్రాసెస్ పూర్తైన తర్వాత మీరు చెల్లించిన ఫైన్ వివరాలు 4 నుంచి 5 వర్కింగ్ డేస్‌లో ఆదాయపు పన్ను శాఖ రికార్డ్స్‌లో అప్‌డేట్ అవుతుంది. ఆ తర్వాత ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పాన్, ఆధార్ లింక్ చేయాలి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోండి.

SBI: ఎస్‌బీఐ కస్టమర్లకు ఒక్క ఫోన్ కాల్‌తో 30 పైగా బ్యాంకింగ్ సేవలు

ముందుగా https://www.incometax.gov.in/iec/foportal ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో Link Aadhaar పైన క్లిక్ చేయాలి.

పాన్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Validate పైన క్లిక్ చేయాలి.

మీ పేమెంట్ వివరాలు వెరిఫై అయినట్టు మెసేజ్ కనిపిస్తుంది.

ఆ తర్వాత Continue పైన క్లిక్ చేయాలి.

ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మీ పేరు ఎంటర్ చేయాలి.

మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది.

ఓటీపీ ఎంటర్ చేసి Validate చేస్తే మీ పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ అవుతుంది.

First published:

Tags: Aadhaar Card, AADHAR, Income tax, PAN, PAN card

ఉత్తమ కథలు