హోమ్ /వార్తలు /బిజినెస్ /

Common ITR Form: CBDT నుంచి త్వరలో కామన్‌ ఐటీఆర్‌ ఫారమ్‌.. ట్యాక్స్ ఫైలింగ్‌ను ఎలా సులభతరం చేస్తుందంటే..

Common ITR Form: CBDT నుంచి త్వరలో కామన్‌ ఐటీఆర్‌ ఫారమ్‌.. ట్యాక్స్ ఫైలింగ్‌ను ఎలా సులభతరం చేస్తుందంటే..

Common ITR Form: CBDT నుంచి త్వరలో కామన్‌ ఐటీఆర్‌ ఫారమ్‌.. ట్యాక్స్ ఫైలింగ్‌ను ఎలా సులభతరం చేస్తుందంటే..

Common ITR Form: CBDT నుంచి త్వరలో కామన్‌ ఐటీఆర్‌ ఫారమ్‌.. ట్యాక్స్ ఫైలింగ్‌ను ఎలా సులభతరం చేస్తుందంటే..

ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు సోర్స్, లెవల్‌, ఇన్‌కం నేచర్‌ వంటి అంశాలపై ఆధారపడి ITR-1 నుంచి ITR-7 వరకు ఏడు ఫారమ్‌లను ఎంచుకోవాలి. అయితే ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) కామన్‌ ITR ఫారమ్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

మన దేశంలో వ్యక్తులు, సంస్థల ఆదాయం నిర్ణీత పరిమితి దాటితే, పన్నులు చెల్లించాలనే రూల్ ఉంది. అయితే ట్యాక్స్ పరిధిలోకి వచ్చేవారు కొంతమందే తమంతట తాముగా ITR ఫైల్‌ చేస్తారు. చాలా మంది నిపుణుల సలహాలు తీసుకుంటుంటారు. ఎందుకంటే ఆదాయ పన్ను రిటర్న్(ITR) దాఖలు చేసేటప్పుడు ప్రాథమికంగా పాటించాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా పన్ను దాఖలు చేసే వ్యక్తికి వర్తించే సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. ప్రస్తుతం పన్ను చెల్లింపుదారులు సోర్స్, లెవల్‌, ఇన్‌కం నేచర్‌ వంటి అంశాలపై ఆధారపడి ITR-1 నుంచి ITR-7 వరకు ఏడు ఫారమ్‌లను ఎంచుకోవాలి. అయితే ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(CBDT) కామన్‌ ITR ఫారమ్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.

ITR ఫారమ్‌లలో క్రమం తప్పకుండా మార్పులు చేయడం సరికాదని చాలా మంది నిపుణులు నమ్ముతారు. పన్ను దాఖలు ప్రక్రియలో తరచుగా మార్పులు చేస్తే పన్ను చెల్లింపుదారులకు అసౌకర్యం కలుగుతుందని భావిస్తారు. ప్రత్యేకించి సర్వీస్ ప్రొవైడర్ల సహాయం తీసుకోని వారు, కొత్త ప్రక్రియను కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం తలెత్తుతుందని కొందరు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో, కొత్తగా కామన్‌ ఐటీఆర్‌ ఫారమ్‌ తీసుకురావడంపై వాటాదారులు, సాధారణ ప్రజల నుంచి CBDT అభిప్రాయాలను ఆహ్వానిస్తోంది.

అదనపు ఇబ్బందులు

సరైన ITR ఫారమ్‌ను ఎంచుకున్న తర్వాత, అవసరమైన సమాచారాన్ని సరైన విధంగా ఎంటర్‌ చేయడం కూడా చాలా ముఖ్యం. ఇందుకు చాలా మంది పన్ను చెల్లింపుదారులకు చాలా శ్రమ, సమయం తీసుకుంటారు. CBDT సర్క్యులర్ ప్రకారం.. ప్రస్తుత ITRలు నిర్దేశిత ఫారమ్‌ల రూపంలో ఉంటాయి. పన్ను చెల్లింపుదారు తప్పనిసరిగా అన్ని షెడ్యూల్స్ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఐటీఆర్‌లను ఫైల్ చేయడానికి పట్టే సమయాన్ని పెంచుతుందని, ఇబ్బందులను సృష్టిస్తుందని పేర్కొంది.

NPS Subscribers: ఎన్‌పీఎస్‌ సబ్‌స్క్రైబర్లకు అలర్ట్.. వాటిలో 75 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసే అవకాశం..

కామన్‌ ITR ఫారమ్ తీసుకురావడానికి కారణం

అన్ని ITR ఫారమ్‌లను కామన్‌ ITR ఫారమ్‌ భర్తీ చేయదు. కొన్ని ITR ఫారమ్‌లు కొనసాగుతాయి. ITR-7 మినహా ప్రస్తుతం ఉన్న అన్ని ఆదాయ రిటర్న్‌లను విలీనం చేసి, కామన్‌ ITRని ప్రవేశపెట్టాలని CBDT ప్రపోజల్‌ తీసుకొచ్చింది. అయితే ప్రస్తుత ఐటీఆర్-1, ఐటీఆర్-4 తర్వాత కూడా కొనసాగుతాయి. Vialto పార్టనర్స్ ఇండియా భాగస్వామి కులదీప్ కుమార్ మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ.. ITR-1, ITR-4 చాలా సులభమైన రూపాలని చెప్పారు. అయితే ITR 7 అనేది ట్రస్ట్‌ల కోసం ఉద్దేశించిందని, వీటిని చాలా తక్కువగా దాఖలు చేస్తారని తెలిపారు.

 ITR-2, 3 ఎవరికి అవసరం?

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఒకటి కంటే ఎక్కువ సోర్సెస్‌ నుంచి ఆదాయం అందుకుంటుంటే లేదా విదేశీ ఆదాయాన్ని ఆర్జిస్తే లేదా విదేశీ ఆస్తిని కలిగి ఉంటే ITR-2ని ఉపయోగించాలి. ఏదైనా కంపెనీలో డైరెక్టర్‌షిప్ కలిగి ఉంటే లేదా జాబితా చేయని ఈక్విటీ షేర్లను కలిగి ఉంటే ITR-2 వర్తిస్తుంది. ITR-3ని శాలరీ పొందని నిపుణులు, వ్యాపారవేత్తలు ఉపయోగించాలి. ITR-2కి అర్హత కలిగిన అన్ని ఆదాయ హెడ్‌లు ITR-3కి కూడా చెల్లుబాటు అవుతాయి. ITR-5, 6లను రిటర్న్‌లను ఫైల్ చేయడానికి లిమిటెడ్‌ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్స్‌(LLP), వ్యాపారాలు ఉపయోగిస్తాయి.

కామన్‌ ఐటీఆర్‌ ఫారమ్‌లో 40 ప్రశ్నలు

కామన్‌ ఫారంలో పన్ను దాఖలు చేసేవారు 'అవును' లేదా 'కాదు' అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తదనుగుణంగా అదనపు సమాచారం సేకరిస్తారు. కామన్‌ ITR ఫారమ్‌లో 40 కంటే ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. ఐటీఆర్ ఫారమ్‌లు సవరించడం ఇదే మొదటిసారి కాదు.

First published:

Tags: Income tax, ITR Filing, Taxes

ఉత్తమ కథలు