National Pension System: నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ స్కీమ్‌లో మార్పులు... ఈ విషయాలు తెలుసుకోండి

National Pension System: నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ స్కీమ్‌లో మార్పులు... ఈ విషయాలు తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

National Pension System rules | నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ స్కీమ్‌లో (NPS Scheme) ఉన్నవారికి అలర్ట్. ఈ స్కీమ్ రూల్స్ మారాయి. ఎంట్రీ నిబంధనలు, ఎగ్జిట్ ప్రాసెస్, ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ లాంటి వాటి విషయాల్లో కొత్త రూల్స్ వచ్చాయి. మరి ఈ రూల్స్ ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

  • Share this:
పదవీ విరమణ తరువాత ఆర్థిక ప్రయోజనాల కోసం చాలా మంది నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS) అనే పెట్టుబడి పథకాన్ని ఎంచుకుంటుంటారు. ఈ పెట్టుబడి పథకాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు కూడా ఎంచుకోవచ్చు. ఈ స్కీమ్‌ను పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ (PFRDA) నియంత్రిస్తుంది. సెప్టెంబర్ 25, 2021 నాటికి 18.28 లక్షల ప్రైవేట్ వ్యక్తులు ఈ పథకంలో చేరారు. తక్కువ నష్టభయంతో కూడిన ఈ పథకం పన్ను ప్రయోజనాలతో పాటు పదవీ విరమణ తర్వాత అధిక రాబడి అందిస్తుంది. అయితే ఇటీవల కాలంలో ఎన్‌పీఎస్ నిబంధనలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

ప్రభుత్వ రంగ ఎన్‌పీఎస్ చందాదారులకు ఆన్‌లైన్ ఎగ్జిట్ ప్రక్రియ పొడిగింపు


పీఎఫ్ఆర్‌డీఏ ఇటీవల ఆన్‌లైన్, పేపర్‌లెస్ ఎగ్జిట్ ప్రక్రియ (exit process)ను ప్రభుత్వ రంగ చందాదారులకు పొడిగించింది. ఇప్పటికే ఉన్న ఫిజికల్ ఎగ్జిట్ మోడ్‌కు ఇది అదనం. "చందాదారుల ఆసక్తిని పెంచే ప్రయత్నంలో ఇప్పటికే ఉన్న మార్గదర్శకాల ప్రకారం ఆన్‌లైన్ ఎగ్జిట్‌ను తక్షణ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ తో అనుసంధానం చేస్తున్నాం. ఎన్‌పీఎస్ పరిధిలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్వయంప్రతిపత్తి (autonomous bodies) సంస్థల ఉద్యోగులకు కూడా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది" అని అక్టోబర్ 4, 2021న పీఎఫ్ఆర్‌డీఏ ప్రకటించింది.

Mutual Fund: ప్రతీ నెలా కొంత పొదుపు చేస్తే రూ.51 లక్షల రిటర్న్స్

న్యూ ఎంట్రీ రూల్


మునుపటి రూల్స్ ప్రకారం 65 ఏళ్ల కంటే వయసు పైబడినవారు ఎన్‌పీఎస్‌ ఖాతాను తెరవడానికి అనుమతి లేదు. కానీ ఇప్పుడు పీఎఫ్ఆర్‌డీఏ రెగ్యులేటరీ.. ఖాతాదారుల వయసును 65 నుంచి 70 ఏళ్లకు పొడిగించింది. ప్రస్తుతం 18-70 మధ్య ఏళ్ల వయసు గల ఎవరైనా ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవొచ్చు. న్యూ ఎంట్రీ రూల్ ప్రకారం, ఎన్‌పీఎస్‌ ఖాతా నుంచి ఇప్పటికే ఉపసంహరించిన చందాదారులు మళ్లీ తిరిగి తమ ఖాతాలను తెరవవచ్చు.

ఎన్‌పీఎస్‌ ఖాతాను 75 ఏళ్ల వరకు వాయిదా వేయొచ్చు


ఎన్‌పీఎస్‌ చందాదారులు 75 ఏళ్ల వరకు తమ ఖాతాను వాయిదా వేయడానికి రెగ్యులేటరీ సంస్థ అనుమతించింది.

IMPS Transaction: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి అలర్ట్... లిమిట్ పెంచిన ఆర్‌బీఐ

ఆస్తి కేటాయింపు నిబంధనలు


65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరిన చందాదారులు ఆటో, యాక్టివ్ ఛాయిస్ కింద వ‌రుస‌గా గ‌రిష్ఠంగా 15%, 50% ఈక్విటీ ఎక్స్‌పోజ‌ర్‌తో.. పెన్షన్ ఫండ్ అండ్ అసెట్ అలొకేషన్ (Pension Fund and Asset allocation) ఆప్షన్ ఎంచుకోవచ్చు. పీఎఫ్ఆర్‌డీఏ రూల్స్ ప్రకారం.. ఆటో ఛాయిస్ కింద గరిష్టంగా 15%, యాక్టివ్ ఛాయిస్ కింద గరిష్టంగా 50% ఈక్విటీ ఎక్స్‌పోజర్‌తో పీఎఫ్, అసెట్ కేటాయింపుల‌ను ఎంచుకోవడం సాధ్యమవుతుంది. పెన్షన్ ఫండ్ సంవత్సరానికి ఒకసారి మార్చవచ్చు.. కాగా అసెట్ అలొకేషన్ ఏడాదికి రెండుసార్లు మార్చవచ్చు.

Aadhaar Card Fraud: ఆధార్‌ కార్డు విషయంలో వెంటనే ఈ పనిచేయకపోతే మోసపోతారు జాగ్రత్త

కొత్త నిష్క్రమణ నియమాలు


65 ఏళ్ల తర్వాత ఎన్‌పీఎస్‌లో చేరిన కొత్త చందాదారులకు క‌నీస లాక్‌-ఇన్ వ్య‌వ‌ధి 3 సంవ‌త్స‌రాలుగా నిర్ణయించారు. నిష్క్రమణకు గరిష్ట వయస్సు 75 సంవత్సరాలు ఉండాలి. చందాదారులు కార్పస్‌లోని 60% వరకు ఒకేసారి ప‌న్ను ర‌హిత ఉప‌సంహ‌ర‌ణ చేయ‌వ‌చ్చు. మిగిలిన 40% యాన్యుటీ (annuity) ని కొనుగోలు చేయడానికి వారు ఉపయోగించాల్సి ఉంటుంది. మీ డబ్బు 5 ల‌క్ష‌ల‌కు త‌క్కువ ఉంటే.. పెన్ష‌న్ సంప‌ద‌ను మొత్తం ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు.

న్యూ ప్రీమెచ్యూర్ ఎగ్జిట్ రూల్


మీరు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) నుంచి మూడేళ్ల కంటే ముందుగానే నిష్క్రమించాలని భావిస్తే.. మీరు మీ డబ్బులో 20% వ‌ర‌కు మాత్రమే ప‌న్ను ర‌హిత విత్‌డ్రా చేయగలరు. మిగతా మొత్తంతో మీరు యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ 80:20 విత్‌డ్రా రూల్ 18-60 ఏళ్ల మధ్య ఎన్‌పీఎస్‌లో చేరిన ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగ చందాదారులకు వర్తిస్తుంది. అయితే, ప్రభుత్వేతర వ్యక్తులు 10 ఏళ్లు చందాదారుడిగా ఉండాలి.
Published by:Santhosh Kumar S
First published: