Bank Account: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఏప్రిల్ 1 నుంచి పాస్‌బుక్, చెక్ బుక్ పనిచేయవు

Bank Account: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఏప్రిల్ 1 నుంచి పాస్‌బుక్, చెక్ బుక్ పనిచేయవు (ప్రతీకాత్మక చిత్రం)

Banks Merger | కేంద్ర ప్రభుత్వం 8 బ్యాంకుల్ని విలీనం చేసి 3 బ్యాంకులుగా మార్చిన సంగతి తెలిసిందే. పాత బ్యాంకులో అకౌంట్ ఉన్న కస్టమర్లు ఏప్రిల్ 1 నుంచి జరగబోయే మార్పుల్ని తెలుసుకోవడం అవసరం.

  • Share this:
    బ్యాంకులో అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి భారీగా మార్పులు రాబోతున్నాయి. బ్యాంకుల విలీనం కారణంగా పాత బ్యాంకుల కస్టమర్లు పూర్తిగా కొత్త బ్యాంకులోకి మారుతున్నారు. కాబట్టి పాత బ్యాంకులకు చెందిన పాస్‌బుక్స్, చెక్ బుక్స్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ ఏవీ పనిచేయవు. కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంకుల్ని, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను, ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకును విలీనం చేసిన సంగతి తెలిసిందే. దీంతో 8 ప్రభుత్వ రంగ బ్యాంకులు కాస్తా 3 బ్యాంకులుగా మారాయి. విజయా బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ ఇక లేనట్టే. కాబట్టి ఈ బ్యాంకుల్లో అకౌంట్స్ ఉన్న కస్టమర్స్ తమ ఖాతాల విషయంలో మార్పులను గుర్తించాల్సిన అవసరం ఉంది.

    Gas Cylinder Discount: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? డిస్కౌంట్... పొందండి ఇలా

    SBI Scheme: ఎస్‌బీఐ అందిస్తున్న ఈ స్కీమ్ మార్చి 31 వరకే... ఇందులో చేరితే లాభాలు ఇవే

    పాత బ్యాంకులకు చెందిన చెక్ బుక్స్, పాస్ బుక్స్ ఉంటే 2021 ఏప్రిల్ 1 నుంచి పనిచేయవు. అవి 2021 మార్చి 31 వరకు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. వాటి స్థానంలో కొత్తవి తీసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు సిండికేట్, కెనెరా బ్యాంక్ పాస్‌బుక్, చెక్ బుక్స్ 2021 జూన్ 30 వరకు పనిచేస్తాయి. ఈ మార్పులకు సంబంధించి ఇప్పటికే ఎస్ఎంఎస్, ఇమెయిల్ ద్వారా కస్టమర్లకు సమాచారం ఇస్తున్నాయి బ్యాంకులు. కస్టమర్లు ఏప్రిల్ 1 తర్వాత కొత్త పాస్ బుక్, కొత్త చెక్ బుక్ తీసుకోవాలి. దీంతో పాటు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, ఎంఐసీఆర్ కోడ్, బ్రాంచ్ అడ్రస్ లాంటి వివరాలు తెలుసుకోవాలి.

    Vi New Plans: వొడాఫోన్ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితం

    Rail Motor Car: ఈ రైలులో 14 సీట్లే ఉంటాయి... ఎలా ఉందో చూడండి

    కొత్త అకౌంట్ నెంబర్ తీసుకున్న తర్వాత మొబైల్ నెంబర్, అడ్రస్, నామినీ లాంటి వివరాలు అప్‌డేట్ చేయాలి. తమ అకౌంట్‌పై ఎలాంటి ఛార్జీలు ఉంటాయో కనుక్కోవాలి. కొత్త పాస్ బుక్ తర్వాత వేర్వేరు చెల్లింపుల కోసం మీరు గతంలో ఇచ్చిన అకౌంట్ నెంబర్ అప్‌డేట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్ అకౌంట్స్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీ, ఇన్‌కమ్ ట్యాక్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, పీఎఫ్ అకౌంట్‌లో అకౌంట్ నెంబర్ మార్చాలి.
    Published by:Santhosh Kumar S
    First published: