త్వరలోనే ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం 2022 మార్చి లోగా ఎల్ఐసీ ఐపీఓ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. అందుకోసం పాలసీహోల్డర్లను కూడా అప్రమత్తం చేస్తోంది ఎల్ఐసీ. ఐపీఓలో ఇన్వెస్ట్ చేసేందుకు ఎల్ఐసీ పాలసీహోల్డర్లు తమ పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయాలని కోరుతోంది. ఎల్ఐసీ పాలసీహోల్డర్లు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం తప్పనిసరి. డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్ ఉండాలి.
అయితే ఎల్ఐసీ పాలసీ హోల్డర్లకు ఐపీఓలో 10 శాతం వాటా ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు వారికి కేటాయించిన కోటాలో ఐపీఓకు అప్లై చేయాలనుకుంటే ఎల్ఐసీ దగ్గర వారి పాన్ నెంబర్ అప్‌డేట్ అయి ఉండాలి. అందుకే ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు తమ పాన్ నెంబర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
LIC Policy: రోజూ రూ.200 దాచుకుంటే రూ.28 లక్షల రిటర్న్స్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే
ఎల్ఐసీ పాలసీహోల్డర్లు తమ పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేసేలా ఎల్ఐసీ భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఎల్ఐసీ ఇండియా పోర్టల్‌లో ఆన్‌లైన్‌లోనే పాన్ కార్డ్ వివరాలు అప్‌డేట్ చేయొచ్చని చెబుతోంది. ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్‌లో పాన్ నెంబర్, పాలసీ నెంబర్, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేసి వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. ఒకవేళ ఆన్‌లైన్‌లో పాన్ నెంబర్ అప్‌డేట్ చేయలేకపోతున్నవారు ఏజెంట్‌ను సంప్రదించాలి. మరి ఆన్‌లైన్‌లో ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.
LIC Policy: రోజూ రూ.41 మీవి కాదనుకుంటే రూ.63 లక్షల రిటర్న్స్ పొందొచ్చు
Step 1- ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు ముందుగా https://licindia.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- Online Services సెక్షన్‌లో Online PAN Registration పైన క్లిక్ చేయాలి. లేదా నేరుగా ఇక్కడ క్లిక్ చేయండి.
Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Step 4- ఆ తర్వాత Proceed పైన క్లిక్ చేయాలి.
Step 5- ఆ తర్వాత పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
Step 6- జెండర్ సెలెక్ట్ చేయాలి.
Step 7- ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 8- మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 9- పాన్ కార్డుపై ఉన్నట్టుగా పూర్తి పేరును ఎంటర్ చేయాలి.
Step 10- మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 11- మీ పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 12- ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి Get OTP పైన క్లిక్ చేయాలి.
Step 13- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Step 14- వివరాలన్నీ సరిచూసుకొని ఓటీపీ ఎంటర్ చేయాలి.
మీ ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ అయిన తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. మీ ఎల్ఐసీ పాలసీకి పాన్ నెంబర్ లింక్ చేసిన తర్వాత మీరు త్వరలో రాబోయే ఎల్ఐసీ ఐపీఓలో అప్లై చేయాలనుకుంటే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎల్ఐసీ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనుకునేముందు కంపెనీ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IPO, LIC, Personal Finance