ALERT FOR IPPB SAVINGS ACCOUNT HOLDERS INDIA POST PAYMENTS BANK IMPLEMENTING NEW CHARGES ON CASH DEPOSIT OVER RS 10000 FROM 2022 JANUARY 1 SS
Cash Deposit: ఇక ఆ బ్యాంకులో రూ.10,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే
Cash Deposit: ఇక ఆ బ్యాంకులో రూ.10,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయాలంటే ఛార్జీలు చెల్లించాల్సిందే
(ప్రతీకాత్మక చిత్రం)
Cash Deposit | బ్యాంకులో అకౌంట్ ఉన్నవారు డబ్బులు డిపాజిట్ చేయడం, డ్రా చేయడం (Cash Withdrawal) మామూలే. అయితే వీటికి కూడా ఛార్జీలు చెల్లించాలి. 2022 జనవరి 1 నుంచి ఓ బ్యాంకులో కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తున్నాయి.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. వచ్చే ఏడాది నుంచి క్యాష్ డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా ఛార్జీలు చెల్లించక తప్పదు. ఈ బ్యాంకు కస్టమర్లకు ఇచ్చిన లిమిట్ వరకు క్యాష్ డిపాజిట్ చేయొచ్చు లేదా విత్‌డ్రా చేయొచ్చు. లిమిట్ దాటితే మాత్రం ఛార్జీలు చెల్లించాలి. ఈ ఛార్జీలు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. 2022 జనవరి 1 నుంచి క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్ లావాదేవీలపై ఛార్జీలు ఉంటాయని IPPB తెలిపింది. అయితే వేర్వేరు అకౌంట్లు ఉన్నవారికి లిమిట్ కూడా వేర్వేరుగా ఉంటుంది. మరి మీ అకౌంట్‌కు ఎంత ఛార్జీలు చెల్లించాలో తెలుసుకోండి.
Basic Savings Account: బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి నెలకు నాలుగు సార్లు క్యాష్ విత్‌డ్రాయల్ ఉచితం. ఆ తర్వాత ఛార్జీలు చెల్లించాలి. డ్రా చేయాలనుకున్న మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి చెల్లించాలి. ఈ అకౌంట్ ఉన్నవారికి క్యాష్ డిపాజిట్ ఉచితం. ఎన్నిసార్లైనా నగదు డిపాజిట్ చేయొచ్చు. పైన చెప్పిన ఛార్జీలపై జీఎస్టీ లేదా సెస్ కూడా ఉంటుంది.
Savings and Current Accounts: ఇతర సేవింగ్స్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్‌కు నెలకు రూ.25,000 వరకు క్యాష్ విత్‌డ్రాయల్ ఉచితం. ఆ తర్వాత విత్‌డ్రా చేయాలనుకునే మొత్తంలో 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి ఛార్జీ చెల్లించాలి. ఇక ఈ అకౌంట్లలో నెలకు రూ.10,000 వరకు క్యాష్ డిపాజిట్ ఉచితం. ఆ తర్వాత డిపాజిట్ చేయాలనుకునే మొత్తానికి 0.50 శాతం లేదా కనీసం రూ.25 ప్రతీ లావాదేవీకి ఛార్జీ చెల్లించాలి.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ 2021 ఆగస్ట్ 1న డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను సవరించిన సంగతి తెలిసిందే. కస్టమర్ నుంచి ప్రతీ రిక్వెస్ట్‌కు రూ.20 చొప్పున ఛార్జీలు వసూలు చేస్తోంది IPPB. మరోవైపు 2021 జూలై 1న సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను కూడా సవరించింది. రూ.1,00,000 వరకు బ్యాలెన్స్ ఉన్నవారికి 2.5 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు బ్యాలెన్స్ ఉన్నవారికి 2.75 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ప్రతీ మూడు నెలలకు ఓసారి అకౌంట్లో జమ అవుతుంది.
ఇక మరోవైపు బ్యాంకింగ్ విత్ క్యూఆర్ కార్డ్ పేరుతో సేవింగ్స్ అకౌంట్‌కు వినూత్నమైన ఫీచర్ అందించింది IPPB. క్యూఆర్ కార్డ్ ఉన్నవారు తమ అకౌంట్ నెంబర్, పాస్వర్క్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కార్డ్ స్కాన్ చేసి బ్యాంకింగ్ లావాదేవీలు జరపొచ్చు. బయోమెట్రిక్స్ ద్వారా ఆథెంటికేషన్ చేయొచ్చు. IPPB అకౌంట్ నుంచి నెఫ్ట్, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.