ALERT FOR INDIA POST PAYMENTS BANK ACCOUNT HOLDERS AADHAAR ENABLED PAYMENT SYSTEM AEPS TRANSACTIONS WILL ATTRACT SERVICES CHARGES SS
Bank Charges: ఆ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్... జూన్ 15 నుంచి కొత్త ఛార్జీలు
Bank Charges: ఆ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్... జూన్ 15 నుంచి కొత్త ఛార్జీలు
(ప్రతీకాత్మక చిత్రం)
Bank Charges | ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా జరిపే లావాదేవీలకు సర్వీస్ ఛార్జీలను వసూలు చేయనుంది. నెలకు మూడు లావాదేవీలు ఉచితం.
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) కొత్త ఛార్జీలను ప్రకటించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) సర్వీస్ ఛార్జీలను ప్రకటించింది. AePS ట్రాన్సాక్షన్ ఛార్జీలు 2022 జూన్ 15 నుంచి అమల్లోకి వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశంలో అందరికీ బ్యాంకింగ్ సేవల్ని అందించేందుకు AePS వ్యవస్థను రూపొందించింది. ఆర్బీఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI), నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ, కొన్ని బ్యాంకులు, రీసెర్చ్ సంస్థలు సంయుక్తంగా కలిసి ఈ వ్యవస్థను రూపొందించడం విశేషం.
AePS అనేది బ్యాంక్ నేతృత్వంలోని మోడల్. ఆధార్ వివరాలను ఉపయోగించి ఏదైనా బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ ద్వారా PoS అంటే మైక్రో ఏటీఎం ద్వారా లావాదేవీలు చేయడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. కస్టమర్లు బ్యాంక్ పేరు, ఆధార్ నెంబర్, ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్తో లావాదేవీలు చేయొచ్చు. AePS ద్వారా క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్‌డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, ఆధార్ నుంచి ఆధార్‌కు ఫండ్ ట్రాన్స్ఫర్, ఆథెంటికేషన్, BHIM ఆధార్ పే, ఇకేవైసీ లాంటి సేవల్ని పొందొచ్చు.
ఈ సేవల్ని ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తాజాగా ఛార్జీలను ప్రకటించింది. ఒక నెలలొ మొదటి మూడు AePS ఇష్యూయర్ లావాదేవీలు ఉచితం. అందులో క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్, మినీ స్టేట్మెంట్ లాంటివన్నీ మూడు సార్లు ఉచితంగా లభిస్తాయి. ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత క్యాష్ విత్‌డ్రాయల్, క్యాష్ డిపాజిట్ కోసం ప్రతీ లావాదేవీకి రూ.20 + జీఎస్టీ చెల్లించాలి. ఇక మినీ స్టేట్మెంట్ కోసం ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.5+ జీఎస్టీ చెల్లించాలి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) ప్రకటించిన కొత్త ఛార్జీలు 2022 జూన్ 15 నుంచి అమలులోకి వస్తాయి.
ఇక ఐపీపీజీ అకౌంట్హోల్డర్లకు మార్చిలో కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ క్లోజ్ చేయాలంటే రూ.150+జీఎస్టీ చెల్లించాలి.కేవైసీ సరిగ్గా లేని అకౌంట్లను క్లోజ్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఐపీపీబీలో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినవారు 12 నెలల లోపు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. లేకపోతే అకౌంట్ క్లోజ్ చేయాలి. మరోవైపు తమ కస్టమర్లకు నెఫ్ట్, ఆర్టీజీఎస్ ట్రాన్సాక్షన్స్ సేవల్ని అందించేందుకు ఐపీపీజీ ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్‌తో సబ్మెంబర్షిప్ అగ్రిమెంట్ చేసుకుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.