బంగారు నగలు (Gold Jewellery) కొంటున్నారా? అయితే అలర్ట్. కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. ఏ నగలు కనిపిస్తే ఆ నగలు కొంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చు. అందుకే కొత్తగా అమలులోకి వచ్చిన రూల్స్ గురించి తెలుసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (HUID) ఉన్న బంగారు నగలు మాత్రమే కొనాలి. ప్రతీ నగ పైనా HUID ఉంటుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నగలపై HUID తప్పనిసరి చేసింది. ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ భిన్నంగా ఉన్నట్టు నగలపై HUID కూడా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్‌లో హాల్‌మార్క్ ఉన్న నగలు లభిస్తున్నాయి. హాల్‌మార్క్‌తో పాటు ఇకపై HUID కూడా తప్పనిసరి అన్న విషయం గుర్తుంచుకోండి.
బంగారు నగలపై కనిపించే హాల్‌మార్క్ గోల్డ్ స్వచ్ఛతకు హామీ లాంటిది. నగలపై ఉండే హాల్‌మార్క్‌లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) లోగో ఉంటుంది. దాంతో పాటు బంగారం స్వచ్ఛత ఎంత, ఏ కేంద్రంలో హాల్‌మార్క్ వేశారు అన్న ముద్రలు కూడా ఉంటాయి. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ గోల్డ్ స్వచ్ఛమైన బంగారం. స్వచ్ఛమైన బంగారం బిస్కెట్, కాయిన్ రూపంలో మాత్రమే ఉంటుంది.
Money Rules: మీ డబ్బుపై ప్రభావం చూపే 7 మార్పులు... నేటి నుంచే అమలు
నగలు తయారు చేయాలంటే స్వచ్ఛమైన బంగారంలో కొంత ఇతర లోహాలు కలిపి నగలు తయారు చేస్తారు. ఇతర లోహాలు కలిపే శాతాన్ని బట్టి నగల స్వచ్ఛతను నిర్ణయిస్తారు. ఎక్కువగా 22క్యారెట్ ఆభరణాలు అమ్ముడుపోతాయి. దీన్నే 916 బంగారం అంటారు. అంటే అందులో బంగారం 91.6 శాతం ఉందని అర్థం. మిగతా మొత్తం ఇతర లోహాలను కలుపుతారు. 18 క్యారెట్ బంగారు నగలు కూడా అమ్ముడుపోతుంటాయి. అయితే నగల్లో స్వచ్ఛత ఎంతో పక్కాగా తెలియాలంటే హాల్‌మార్క్ తప్పనిసరి.
కొత్త నిబంధనల ప్రకారం నగలపై హాల్‌మార్క్‌తో పాటు HUID కూడా ఉంటుంది. హాల్‌మార్కింగ్ గుర్తుల్లో మార్పులు చేసి కొత్త ముద్రల్ని అమలులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. నగలపై మూడు గుర్తులు ఉంటాయి. మొదటి సంకేతం BIS హాల్‌మార్క్. ఇది త్రిభుజాకార గుర్తులా ఉంటుంది. రెండో సంకేతం నగల్లో బంగారం స్వచ్ఛత గురించి తెలియజేసేది. 18K, 22K అని ముద్ర ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న నగల్లో ఈ రెండు ముద్రలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు హాల్‌మార్క్ ముద్ర వేసిన సెంటర్ లోగో, నగల షాపు పేరు కూడా ఆభరణాలపై ఉంటుంది.
Medicine Prices: ప్యారాసిటమాల్ నుంచి కండోమ్ వరకు... వీటి ధరలు పెరిగాయి
తాజాగా HUID తప్పనిసరి అయింది. ఇది ఆరు డిజిట్స్ గల ఆల్ఫాన్యూమరిక్ కోడ్. ఇందులో అక్షరాలు, అంకెలు కలిపి ఉంటాయి. ఈ కోడ్ భిన్నంగా ఉంటుంది. అంటే ప్రతీ నగపై కొత్త కోడ్ ఉంటుంది. ఒకే కోడ్‌తో రెండు ఆభరణాలు కనిపించవు. ట్రాకింగ్ కోసం ఈ కోడ్ ఉపయోగపడుతుంది. ఈ కోడ్ ద్వారా ఆ ఆభరణం ఏ షాప్‌కి చెందినదో సులువుగా గుర్తించవచ్చు. HUID 2021 జూలై 1న అమలులోకి వచ్చింది. మొదట ఇది స్వచ్ఛందంగా ఉండేది. ఇప్పుడు HUID లోగో తప్పనిసరి అయింది.
మరి ఇప్పటికే హాల్‌మార్క్ నగలు కొన్నవారి పరిస్థితి ఏంటీ? వాటిపై HUID ఉండదు కదా అని డౌట్ రావొచ్చు. పాత విధానం ప్రకారం హాల్‌మార్క్ ముద్రించిన నగలు చెల్లుతాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి కొనే నగలకు మాత్రం HUID తప్పనిసరి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రూల్స్ 2018 ప్రకారం, వినియోగదారుడు కొనుగోలు చేసిన హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలపై ముద్రించిన స్వచ్ఛత కన్నా, నగల స్వచ్ఛత తక్కువ ఉంటే, సదరు కస్టమర్ పరిహారం కోసం కంప్లైంట్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold jewellery, Gold Prices