కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Scheme) ద్వారా రైతులకు ఏటా రూ.6,000 పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకంలో మోసాలు జరగకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అర్హులైన రైతులకు మాత్రమే ఈ సాయం అందేలా చూస్తోంది. అందులో బాగంగా ఇకేవైసీ (PM Kisan eKYC) తప్పనిసరి చేసింది. రైతులు 2022 జూలై 31 లోగా ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇక దీంతో పాటు మరో రూల్ కూడా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా బెనిఫిట్స్ పొందాలంటే మరో డాక్యుమెంట్ తప్పనిసరి చేస్తోంది.
ప్రభుత్వం రూపొందించే ఏ పథకానికైనా కొన్ని అర్హతలు ఉంటాయి. ఆ అర్హతలు ఉంటేనే పథకానికి ఎంపికవుతారు. పీఎం కిసాన్ స్కీమ్‌లో చిన్నకారు, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం లభిస్తుంది. అయితే కొందరు రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ వర్తించదు. ఆ రైతుల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. రైతులు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇక తప్పనిసరిగా తమ రేషన్ కార్డ్ నెంబర్స్ కూడా ఇవ్వాలి. రేషన్ కార్డ్ నెంబర్స్ ఇచ్చిన రైతుల దరఖాస్తుల్నే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.
Loan in 30 seconds: అర నిమిషంలో పర్సనల్ లోన్... వాట్సప్‌లో Hi అని టైప్ చేయండి చాలు
అర్హులైన రైతులను గుర్తించడంతో పాటు మోసాలను అడ్డుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతులు రిజిస్ట్రేషన్ సమయంలో రేషన్ కార్డ్ నెంబర్ వెల్లడించడంతో పాటు జిరాక్స్ కాపీని పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రైతులు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసేప్పుడు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి, రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ అప్లోడ్ చేయడంతో పాటు ఇకేవైసీ కూడా చేయాల్సి ఉంటుంది. భూమి వివరాలు, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, ఇతర డాక్యుమెంట్స్ హార్డ్ కాపీస్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే చాలు.
Pension Scheme: నెలకు రూ.5,000 పొదుపు చేస్తే ప్రతీ నెలా రూ.1,00,000 పెన్షన్... స్కీమ్ వివరాలివే
రైతులు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత వారికి అన్ని అర్హతలు ఉంటే పీఎం కిసాన్ స్కీమ్‌కు ఎంపిక చేస్తారు. వారికి ప్రతీ ఏటా రూ.6,000 చొప్పున పెట్టుబడి సాయం అందుతుంది. నాలుగు నెలలకు ఓసారి రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. కాబట్టి రైతులు రిజిస్ట్రేషన్ సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
కేంద్ర ప్రభుత్వం 2018 డిసెంబర్ నుంచి పీఎం కిసాన్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఇప్పటి వరకు 11 ఇన్స్టాల్మెంట్స్లో నిధులు విడుదలయ్యాయి. జూలై తర్వాత 12వ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ కానుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Personal Finance, PM KISAN, PM Kisan Scheme, Pradhan Mantri Kisan Samman Nidhi, Ration card