ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) రూల్స్ గురించి ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లకు అంతంతమాత్రంగానే తెలుసు. పిల్లలకు కూడా పెన్షన్ లభిస్తుందన్న విషయం దాదాపు ఎవరికీ తెలియదు. EPS-95 ప్రకారం అనాథ పిల్లలకు (Orphan Children) కూడా పెన్షన్ లభిస్తుందని ఈపీఎఫ్ఓ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చాలామంది పిల్లలు అనాథలయ్యారు. తల్లిదండ్రుల్ని కోల్పోవడంతో ప్రస్తుతం ఆ పిల్లల పరిస్థితి, భవిష్యత్తు గందరగోళంగా మారింది. ఆర్థికంగా ఎలాంటి అండ లేకపోవడంతో ఆ పిల్లలకు జీవనాధారం లేదు. అలాంటి అనాథ పిల్లలకు ఈపీఎఫ్ఓ అదిరిపోయే శుభవార్త చెప్పింది. అనాథ పిల్లలకు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) కింద ఆర్థిక సహకారం లభిస్తుందని ఈపీఎఫ్ఓ ప్రకటించింది.
SBI Password Tips: బ్యాంక్ అకౌంట్ ఉందా? పాస్వర్డ్ ఇలా ఉండాలంటున్న ఎస్బీఐ
అయితే ఈపీఎస్ మెంబర్స్‌గా ఉన్నవారి పిల్లలకు మాత్రమే ఈపీఎఫ్ఓ నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది. ఇందుకు సంబంధించిన నియమనిబంధనల్ని వెల్లడిస్తూ ఈపీఎఫ్ఓ ట్వీట్ చేసింది. అనాథ పిల్లలకు లభించే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) బెనిఫిట్స్ గురించి వివరించింది. ఆ రూల్స్ గురించి ఓసారి తెలుసుకోండి.
Benefits payable to orphans under EPS'95.#EPFO #EPF #SocialSecurity #ईपीएफओ #ईपीएफ@byadavbjp @Rameswar_Teli @PMOIndia @LabourMinistry @PIB_India @PIBHindi @MIB_India @DDNewslive @mygovindia @wootaum pic.twitter.com/Qs6tgZgzEv
— EPFO (@socialepfo) November 15, 2021
వితంతులకు వచ్చే మంత్లీ పెన్షన్‌లో 75 శాతం అనాథ పిల్లలకు లభిస్తుంది. కనీసం రూ.750 నుంచి ఈ పెన్షన్ మొదలవుతుంది. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికీ నెలకు రూ.750 చొప్పున పెన్షన్ లభిస్తుంది. అనాథ పిల్లలు వారి వయస్సు 25 ఏళ్లు వచ్చే వరకు ఈ పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ పిల్లలకు అంగవైకల్యం, ఇతర శారీరక లోపాలు ఉంటే వారికి జీవితాంతం పెన్షన్ లభిస్తుంది.
Post Office Scheme: పోస్టాఫీసులో రూ.10,000 పెట్టుబడితో లక్షాధికారి అయ్యే అవకాశం
ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) విషయానికి వస్తే ఉద్యోగి వేతనం నుంచి కంపెనీ డబ్బులు తీసుకోదు. కంపెనీ కంట్రిబ్యూషన్ నుంచి కొంత భాగం ఈపీఎస్‌లోకి వెళ్తుంది. కొత్త రూల్ ప్రకారం రూ.15,000 బేసిక్ వేతనం వరకు ఈ సదుపాయం పొందొచ్చు. ఈ రూల్ ప్రకారం వేతనంలో 8.33 శాతం ఈపీఎస్‌లోకి వెళ్తుంది. అంటే రూ.15,000 బేసిక్ వేతనం ఉంటే ఈపీఎస్‌లో రూ.1,250 జమ అవుతుంది.
ఈపీఎఫ్ఓ పరిధిలో అనేక స్కీమ్స్ ఉన్నాయి. ఈపీఎఫ్ స్కీమ్ 1952. పెన్షన్ స్కీమ్ 1995 (EPS), ఇన్స్యూరెన్స్ స్కీమ్ 1976 (EDLI) లాంటి స్కీమ్స్ ఉన్నాయి. వీటిలో ఇన్స్యూరెన్స్ స్కీమ్ ద్వారా ఈపీఎఫ్ మెంబర్ మరణిస్తే నామినీకి రూ.7 లక్షల వరకు బీమా లభిస్తుంది. ఇక పెన్షన్ స్కీమ్ కింద ఈపీఎఫ్ మెంబర్ సర్వీసులో ఉండగా మరణిస్తే వారి జీవిత భాగస్వామికి నెలకు రూ.1,000 పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ పెన్షనర్ మరణిస్తే 50 శాతం పెన్షన్ వారి జీవిత భాగస్వామికి లభిస్తుంది. ఈ పెన్షన్ కాకుండా పిల్లలకు కూడా పెన్షన్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Pension Scheme, Pensioners, Personal Finance