హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF PAN Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ నష్టం తప్పదు

EPF PAN Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ నష్టం తప్పదు

EPF PAN Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ నష్టం తప్పదు
(ప్రతీకాత్మక చిత్రం)

EPF PAN Link: ఈపీఎఫ్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేయకపోతే ఈ నష్టం తప్పదు (ప్రతీకాత్మక చిత్రం)

EPF PAN Link | ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారు తమ పాన్ నెంబర్ (PAN Number) లింక్ చేయకపోతే డబుల్ ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది. ఇటీవలే ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది.

మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉందా? మీ ఈపీఎఫ్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేశారా? పాన్ కార్డును ఆధార్ నెంబర్‌తో లింక్ (PAN Aadhaar Linking) చేయాలన్న విషయం పాన్ కార్డ్ హోల్డర్లకు తెలుసు. కానీ ఈపీఎఫ్ అకౌంట్‌కు కూడా పాన్ నెంబర్ లింక్ చేయాలి. లేకపోతే కొన్ని చిక్కులు తప్పవు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ అమలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన గైడ్‌లైన్స్ కూడా ఇటీవల విడుదల చేసింది. ఈ గైడ్‌లైన్స్ ప్రకారం ఫైనల్ సెటిల్మెంట్ లేదా ట్రాన్స్‌ఫర్స్ సమయంలో కాకుండా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్‌లో వడ్డీ జమ అయినప్పుడు ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) వర్తిస్తుంది.

ఈపీఎఫ్ అకౌంట్‌లో పీఎఫ్ కంట్రిబ్యూషన్ ప్రైవేట్ ఉద్యోగులకు వార్షికంగా రూ.2,50,000 లోపు ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.5,00,000 వరకు లిమిట్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఈపీఎప్ అకౌంట్‌లో జమ చేస్తే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. టీడీఎస్‌ని ఉద్యోగి నుంచి వసూలు చేస్తుంది ఈపీఎఫ్ఓ. అయితే ప్రతీ ఒక్కరూ తమ పీఎఫ్ వడ్డీపై టీడీఎస్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈపీఎఫ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం రూ.5,000 వరకు టీడీఎస్ ఉంటే ఎలాంటి మినహాయింపులు ఉండవు. కానీ దానిపై పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది.

LIC Policy: ఎల్ఐసీ నుంచి సూపర్ పాలసీ... రోజూ రూ.29 చొప్పున జమ చేస్తే రూ.4 లక్షలు మీవే

ఈపీఎఫ్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేస్తే టీడీఎస్ తగ్గుతుంది. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ తమ పాన్ నెంబర్ లింక్ చేస్తే 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. లేకపోతే 20 శాతం టీడీఎస్ చెల్లించాలి. అంటే పాన్ నెంబర్ అప్‌డేట్ చేయకపోతే డబుల్ టీడీఎస్ చెల్లించాలన్న విషయం గుర్తుంచుకోవాలి. మరి మీ పీఎఫ్ అకౌంట్‌కు పాన్ నెంబర్ ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి.

Money Saving Tips: నెలకు రూ.1,000 పొదుపు చేసినా కోటీశ్వరులు కావొచ్చు ఇలా

ఈపీఎఫ్ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేయండిలా


Step 1- ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ఓపెన్ చేయాలి.

Step 2- మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

Step 3- లాగిన్ అయిన తర్వాత Manage సెక్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత KYC పైన క్లిక్ చేయాలి.

Step 5- మీ వ్యక్తిగత సమాచారం అప్‌డేట్ చేసే పేజీ ఓపెన్ అవుతుంది.

Step 6- మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్ లాంటి వివరాలు అప్‌డేట్ చేయొచ్చు.

Step 7- పాన్ సెక్షన్‌లో మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 8- మీ పాన్ కార్డుపై ఉన్నట్టుగా పేరు ఎంటర్ చేయాలి.

Step 9- ఐటీ డిపార్ట్‌మెంట్ రికార్డుల ప్రకారం మీ పేరు, నెంబర్ మ్యాచ్ అయితే ఆటోమెటిక్‌గా పాన్ వెరిఫై అవుతుంది.

Step 10- వెరిఫికేషన్ పూర్తైతే మీ పాన్ నెంబర్ పీఎఫ్ అకౌంట్‌కు లింక్ అయినట్టే.

First published:

Tags: EPFO, PAN card, Personal Finance

ఉత్తమ కథలు