Home /News /business /

Two PF accounts: రెండో ఈపీఎఫ్ అకౌంట్ తప్పనిసరి... వారికి మాత్రమే

Two PF accounts: రెండో ఈపీఎఫ్ అకౌంట్ తప్పనిసరి... వారికి మాత్రమే

Two PF accounts: రెండో ఈపీఎఫ్ అకౌంట్ తప్పనిసరి... వారికి మాత్రమే
(ప్రతీకాత్మక చిత్రం)

Two PF accounts: రెండో ఈపీఎఫ్ అకౌంట్ తప్పనిసరి... వారికి మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)

Two PF accounts | మీకు ఈపీఎఫ్ అకౌంట్ (EPF Account) ఉందా? ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ (EPF Savings) చేస్తున్నారా? ఈపీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తే రెండో అకౌంట్ మెయింటైన్ చేయాలి.

మీరు ఈపీఎఫ్‌లో ఎక్కువ డబ్బు దాచి... నిధులు ఆదా చేసుకుంటున్నారా? లేక ఆ ఆలోచన ఉందా? అయితే ఈ వార్త మీ కోసమే. 2021 బడ్జెట్‌లో చెప్పినట్లు ఒక్కో వ్యక్తికి రెండు ఈపీఎఫ్‌ ఖతాలు (EPF Accounts) రాబోతున్నాయి. అయితే అది కొంతమందికి మాత్రమే. ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (EPF), వాలంటరీ ప్రావిడెంట్‌ ఫండ్‌ (VPF) మొత్తం కలిపి ఏడాదికి రూ.2.5 లక్షలు మించి పొదుపు చేస్తే... వాళ్లు ట్యాక్స్‌ పరిధిలోకి (Income Tax) వస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) తాజాగా నోటిఫై చేసింది. పీఎఫ్‌లో కేంద్రం నిర్దేశించిన పరిమితికి మించి డబ్బులు సేవ్‌ చేస్తున్నట్లయితే వారికి రెండో పీఎఫ్‌ ఖాతా తెరుస్తారట.

సీబీడీటీ కొత్త నోటిఫికేషన్‌ ప్రకారం... పీఎఫ్‌ మొత్తం మీద పన్ను లెక్కింపు సులభతరంగా ఉండటానికి ఈ ఏర్పాటు చేస్తున్నారట. ఈ ఏడాది మార్చి 31లోపు పీఎఫ్‌ ఖాతాలో పడిన డబ్బు పన్నురహితంగా ఉంటుందట. ఆ తర్వాతి కాంట్రిబ్యూషన్స్‌ మీద రెండు పీఎఫ్‌ ఖాతాలపై విడివిడిగా వడ్డీ లెక్కిస్తారు.

Pension Scheme: నెలకు రూ.5,000 పెన్షన్ కావాలా? రోజూ రూ.7 పొదుపు చేస్తే చాలు

వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని సీబీడీటీ తెలిపింది. అంటే 2021-22లో పీఎఫ్‌ ఖాతాలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ సేవ్‌ చేసిన మొత్తంపై వచ్చే వడ్డీకి వినియోగదారుడు/ఉద్యోగి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వచ్చే ట్యాక్స్‌ రిట్నర్స్ ఫైలింగ్‌లో కూడా పొందుపరచాలట.

Bank Holidays in September: ఖాతాదారులకు అలర్ట్... సెప్టెంబర్‌లో బ్యాంకులకు 12 సెలవులు

ఈ రూ.2.5 లక్షల లెక్క కేవలం ప్రైవేటు ఉద్యోగులకే. ప్రభుత్వం ఉద్యోగులకు అయితే ఈ లిమిట్‌ రూ.5 లక్షలుగా నిర్ణయించారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు పీఎఫ్‌ ఖాతాలో ₹5 లక్షలకు మంచి సేవ్‌ చేస్తే... ఆ అధికంగా ఉండే మొత్తం మీద వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాలన్నమాట. అంటే వారికి కూడా రెండు అకౌంట్‌లు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్‌లో ఈ విషయం ప్రస్తావించినప్పుడు సరైన స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు ఇచ్చారు.

New Rules in September: సామాన్యులకు అలర్ట్... సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చే 11 కొత్త రూల్స్ ఇవే

అయితే దాచుకున్న పీఎఫ్‌ మొత్తం నుంచి ఆ ఏడాది విత్‌డ్రాను లెక్కలోకి తీసుకునే ఈ వడ్డీ కౌంట్‌ చేస్తారట. అంటే మీ పీఎఫ్‌ ఖతాలోనే అనుబంధంగా వేరే ఖాతా క్రియేట్‌ అవుతుంది. పన్ను వర్తించే పీఎఫ్‌ డబ్బును ఒక ఖతాలో చూపిస్తే... పన్ను వర్తించని డబ్బును వేరే ఖాతాలో చూపిస్తారట.
Published by:Santhosh Kumar S
First published:

Tags: EPFO, Income tax, Personal Finance

తదుపరి వార్తలు