ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయడం తప్పనిసరి. ఈపీఎఫ్ అకౌంట్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి 2021 జూన్ 1 గడువు అని గతంలోనే ప్రకటించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్-EPFO. కానీ యాజమాన్యాలు ఉద్యోగుల పీఎఫ్ జమ చేయడంలో ఇబ్బందులు రావడంతో ఈ గడువును 2021 సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది. అంటే సెప్టెంబర్ 1 లోగా ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ లింక్ చేయాల్సిందే. ఉద్యోగులు తమ ఆధార్ నెంబర్‌ను ఈపీఎఫ్ అకౌంట్‌కు లింక్ చేసేలా యాజమాన్యాలు అప్రమత్తం చేయాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది. సెప్టెంబర్ డెడ్‌లైన్ లోగా లింకింగ్ ప్రాసెస్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
PF Withdrawal Rule: ఈపీఎఫ్ కొత్త రూల్స్... ఒక్క రోజులో రూ.1,00,000 క్లెయిమ్ సెటిల్
LIC Policy: రోజూ రూ.29 పొదుపు చేస్తే రూ.4,00,000 మీవే... మహిళల కోసం ఎల్ఐసీ స్పెషల్ పాలసీ
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈపీఎఫ్ అకౌంట్లకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేసింది ఈపీఎఫ్ఓ. గతేడాది పార్లమెంట్లో ఆమోదం పొందిన సోషల్ సెక్యూరిటీ కోడ్ ప్రకారం ఈపీఎఫ్ లబ్ధిదారుల ఆధార్ నెంబర్లు కోరింది కేంద్ర కార్మిక శాఖ. దీంతో ఈపీఎఫ్ఓ ఆధార్ నెంబర్ల లింకింగ్ తప్పనిసరి చేసింది. ఇప్పటికే తమ ఆధార్ నెంబర్లను ఈపీఎఫ్ అకౌంట్లకు లింక్ చేసినవారు మళ్లీ లింక్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఆధార్ నెంబర్లు లింక్ చేయనివారు మాత్రమే సెప్టెంబర్ 1 లోగా ఈపీఎఫ్ అకౌంట్లకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి.
IRCTC Contest: ట్రైన్ జర్నీ ఇష్టమా? అయితే రూ.1,00,000 గెలుచుకోండి ఇలా
SBI New Feature: మీరు ఎస్బీఐ కస్టమరా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే
ఈపీఎఫ్ ఖాతాదారులు ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.
యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
ఆ తర్వాత Manage ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో Aadhaar సెలెక్ట్ చేయాలి.
ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పేరు, నెంబర్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత Save పైన క్లిక్ చేయాలి.
ఓసారి వివరాలు సరిచూసుకోవాలి.
మీ వివరాలు యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది.
అప్రూవ్ అయిన తర్వాత Verified అని కనిపిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance