హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? నవంబర్ 30 లోగా ఈ పనిచేయండి

EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? నవంబర్ 30 లోగా ఈ పనిచేయండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

EPF Account | మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే అలర్ట్. ప్రతీ నెల లాగే ఇకపై కూడా మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో (EPF Account) డబ్బులు జమ కావాలంటే నవంబర్ 30 లోగా మీ యూఏఎన్‌, ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి. ఎలా చేయాలో తెలుసుకోండి.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. మీరు మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌కు (UAN) మీ ఆధార్ నెంబర్‌ను లింక్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. యూఏఎన్, ఆధార్ నెంబర్ లింక్ చేయాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) చాలా రోజులుగా అలర్ట్ చేస్తోంది. గతంలో 2021 సెప్టెంబర్ 1 లోగా ఉన్న గడువును 2021 నవంబర్ 30 వరకు పొడిగించింది. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారు నవంబర్ 30 లోగా తమ ఆధార్ నెంబర్‌ను యూఏఎన్‌తో లింక్ చేయడం తప్పనిసరి. 2021 డిసెంబర్ 1 నుంచి సంస్థలు యూఏఎన్, ఆధార్ లింకింగ్ పూర్తి చేసిన ఉద్యోగులకు సంబంధించిన ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్స్ (ECR) మాత్రమే ఫైల్ చేయాలని ఈపీఎఫ్ఓ కోరింది.

Free Insurance: మీకు డెబిట్, క్రెడిట్ కార్డ్ ఉందా? ఉచితంగా ఇన్స్యూరెన్స్ పొందొచ్చు ఇలా

అంటే యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి ఈపీఎఫ్ అకౌంట్‌లో యజమాని వాటా జమ కాదు. నవంబర్ 30 లోగా యూఏఎన్, ఆధార్ లింక్ చేసినవారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే మీరు మీ ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అయ్యే యజమాని వాటా ఎప్పట్లాగే పొందాలనుకుంటే ఈ నెలాఖరు లోగా యూఏఎన్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకోండి.

PAN Card Update: పాన్ కార్డుపై ఉన్న ఫోటో నచ్చలేదా? సింపుల్‌గా మార్చేయండి ఇలా

EPF Aadhaar Linking: యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా


Step 1- ఈపీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ ఓపెన్ చేయాలి.

Step 2- యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

Step 3- ఆ తర్వాత Manage ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 4- డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ క్లిక్ చేయాలి.

Step 5- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Aadhaar సెలెక్ట్ చేయాలి.

Step 6- ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పేరు, నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 7- ఆ తర్వాత Save పైన క్లిక్ చేయాలి. ఓసారి వివరాలు సరిచూసుకోవాలి.

Step 8- మీ వివరాలు యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది.

Step 9- అప్రూవ్ అయిన తర్వాత Verified అని కనిపిస్తుంది.

EPFO New Rule: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్... ఇక ఏడాదిలో ఎప్పుడైనా...

EPF Aadhaar Linking: యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి


Step 1- మీ యూఏఎన్‌తో ఆధార్ నెంబర్ లింక్ అయిందో లేదో చెక్ చేయడానికి పైన చెప్పిన విధంగా లాగిన్ కావాలి.

Step 2- ఆ తర్వాత Manage ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 3- డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ క్లిక్ చేయాలి.

Step 4- Currently Active KYC సెక్షన్‌లో మీ ఆధార్ నెంబర్ ఉందో లేదో చూడాలి.

Step 5- Statusలో Approved అని ఉంటే మీ యూఏఎన్, ఆధార్ నెంబర్ లింక్ అయినట్టు.

Step 6- ఇలాగే బ్యాంక్ అకౌంట్, పాన్ నెంబర్ స్టేటస్ కూడా చెక్ చేయొచ్చు.

First published:

Tags: Aadhaar card, EPFO, Personal Finance

ఉత్తమ కథలు