హోమ్ /వార్తలు /బిజినెస్ /

PF New Rule: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31 లోగా ఈ పనిచేయకపోతే నష్టం తప్పదు

PF New Rule: ఈపీఎఫ్ ఖాతాదారులు డిసెంబర్ 31 లోగా ఈ పనిచేయకపోతే నష్టం తప్పదు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

PF New Rule | ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. డిసెంబర్ 31 లోగా నామినీ వివరాలు అప్‌డేట్ చేయకపోతే పలు రకాల బెనిఫిట్స్ కోల్పోయే అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ (EPFO) అందించే అన్ని బెనిఫిట్స్ పొందాలంటే తప్పనిసరిగా మీ నామినీ వివరాలు అప్‌డేట్ చేయండి.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారికి అలర్ట్. ఈపీఎఫ్ ఖాతాదారులు తప్పనిసరిగా తమ నామినీ వివరాలను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలి. ఈ పనిచేయడానికి 2021 డిసెంబర్ 31 చివరి తేదీ. నామినీ వివరాలు అప్‌డేట్ చేయకపోతే ఈపీఎఫ్ఓ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కోల్పోవాల్సి ఉంటుంది. అందుకే ఈపీఎఫ్ ఖాతాదారులు వెంటనే తమ నామినీ వివరాలను ఈపీఎఫ్ అకౌంట్‌లో యాడ్ చేయాలి. ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ బెనిఫిట్స్‌తో పాటు ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా వస్తాయని ఉద్యోగులకు తెలిసిందే. అయితే వాటిని నామినీకి అందించాలంటే నామినీ వివరాలు ఈపీఎఫ్ఓకు వెల్లడించడం తప్పనిసరి.

ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ లభిస్తుంది. వారి మరణానంతరం నామినీలు కూడా పెన్షన్ పొందే సదుపాయం ఉంది. దీంతో పాటు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ (EDLI) స్కీమ్ ద్వారా ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు రూ.7 లక్షల వరకు ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా నామినీకి లభించేవే. పీఎఫ్ అకౌంట్‌లో దాచుకున్న డబ్బులు, ప్రతీ నెలా లభించే పెన్షన్, ఈపీఎఫ్ ఖాతాదారులు మరణిస్తే వచ్చే ఇన్స్యూరెన్స్ లాంటివాటన్నింటికీ నామినీ వివరాలు కావాల్సిందే. అందుకే నామినీ వివరాలు అప్‌డేట్ చేయాలని కోరుతోంది ఈపీఎఫ్ఓ.

Business Idea: రూ.10,000 పెట్టుబడితో ఇంట్లోనే వ్యాపారం... రూ.30,000 వరకు ఆదాయం

ఈపీఎఫ్ఓ మెంబర్స్ పోర్టల్‌లో ఈపీఎఫ్ ఖాతాదారులు తమ నామినీ వివరాలు యాడ్ చేయొచ్చు. లేదా అప్‌డేట్ చేయొచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్ హోల్డర్లు యూఏఎన్‌కు తమ ఆధార్ నెంబర్‌ను లింక్ చేయాలి. దీంతో పాటు ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ యాక్టీవ్‌లో ఉండాలి. మరి ఈపీఎఫ్ఓ మెంబర్స్ పోర్టల్‌లో ఇ-నామినేషన్ ఎలా ఫైల్ చేయాలో అంటే నామినీ వివరాలు ఎలా యాడ్ చేయాలో తెలుసుకోండి.

PAN Card: పాన్ కార్డులో ఈ వివరాలు లేవా? అయితే అది నకిలీ కార్డే

EPF e-nomination: ఈపీఎఫ్ ఇ-నామినేషన్ ఫైల్ చేయండి ఇలా


Step 1- ముందుగా https://www.epfindia.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో Service ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

Step 3- అందులో For Employees ఆప్షన్ క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత Member UAN/ Online Service (OCS/OTP) ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 5- యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

Step 6- ఆ తర్వాత Manage Tab పైన క్లిక్ చేయాలి.

Step 7- E-nomination ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 8- ఫ్యామిలీ డిక్లరేషన్ ఆప్షన్ దగ్గర Yes ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

Step 9- Add Family Details క్లిక్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి. నామినీగా ఒకరికన్నా ఎక్కువ మందిని యాడ్ చేయొచ్చు.

Step 10- ఎవరికి ఎంత వాటా ఇవ్వాలో పర్సెంటేజ్ ఎంటర్ చేయాలి.

Step 11- ఆ తర్వాత Save EPF Nomination పైన క్లిక్ చేయాలి.

Step 12- తర్వాతి పేజీలో E-sign జనరేట్ చేయాలి.

Step 13- మీ ఆధార్ నెంబర్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 14- ఓటీపీ ఎంటర్ చేస్తే నామినీ వివరాలు అప్‌డేట్ అవుతాయి.

First published:

Tags: EPFO, Insurance, PF account

ఉత్తమ కథలు