హోమ్ /వార్తలు /business /

PF Account: పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్

PF Account: పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్

PF Account | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లో ఇకపై ఎంతంటే అంత జమచేయడానికి వీల్లేదు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ (New Tax Rules) అమల్లోకి రానున్నాయి. ఆ రూల్స్ గురించి తెలుసుకోండి.

PF Account | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లో ఇకపై ఎంతంటే అంత జమచేయడానికి వీల్లేదు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ (New Tax Rules) అమల్లోకి రానున్నాయి. ఆ రూల్స్ గురించి తెలుసుకోండి.

PF Account | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లో ఇకపై ఎంతంటే అంత జమచేయడానికి వీల్లేదు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ (New Tax Rules) అమల్లోకి రానున్నాయి. ఆ రూల్స్ గురించి తెలుసుకోండి.

  మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉందా? ప్రతీ నెలా మీ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తుంటారా? అయితే అలర్ట్. ఏప్రిల్ 1 నుంచి కొత్త ట్యాక్స్ రూల్స్ (Tax Rules) అమల్లోకి రానున్నాయి. ఈపీఎఫ్ అకౌంట్‌లో రూ.2,50,000 కన్నా ఎక్కువ జమ చేస్తే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఈ లిమిట్ రూ.5,00,000 వరకు ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం రూల్స్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి పీఎఫ్ అకౌంట్ రెండు భాగాలుగా విడుపోనుంది. అందులో ట్యాక్సబుల్, నాన్ ట్యాక్సబుల్ సెక్షన్స్ ఉంటాయి. నాన్ ట్యాక్సబుల్ సెక్షన్‌లో జమ చేసే డబ్బులకు ట్యాక్స్ ఉండదు. అయితే ఈపీఎఫ్ అకౌంట్‌లో వార్షికంగా జమ చేసే మొత్తం రూ.2,50,000 దాటితే నాన్ ట్యాక్సబుల్ సెక్షన్‌లోకి వెళ్తుంది. ఆ మొత్తానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

  సాధారణ ఉద్యోగులు పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేస్తే, ప్రభుత్వ ఉద్యోగులు జనరల్ పీఎఫ్ కంట్రిబ్యూషన్ చేస్తారు. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగులు కానివారు రూ.5,00,000 పీఎఫ్ అకౌంట్‌లో జమ చేశారనుకుందాం. అందులో రూ.2,50,000 నాన్ ట్యాక్సబుల్ సెక్షన్‌లో జమ అవుతుంది. మిగతా రూ.2,50,000 ట్యాక్సబుల్ సెక్షన్‌లోకి వెళ్తుంది. ఈ మొత్తానికి పన్నులు చెల్లించాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగి రూ.6,00,000 ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తే రూ.5,00,000 నాన్ ట్యాక్సబుల్ సెక్షన్‌లోకి, రూ.1,00,000 ట్యాక్సబుల్ సెక్షన్‌లోకి వెళ్తుంది. ఈపీఎఫ్ అకౌంట్‌లో కంట్రిబ్యూషన్‌కు సంబంధించి 2022 ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ అమలులోకి వస్తుంది.

  Paytm: పేటీఎం నుంచి కొత్త ఫీచర్... మీరూ వాడుకోండి ఇలా

  ఎక్కువ ఆదాయం పొందుతున్నవారు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రయోజనం పొందుతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అమలు చేస్తోంది. అయితే ఈ కొత్త ట్యాక్స్ రూల్స్ కేవలం 1 శాతం కన్నా తక్కువ మందినే ప్రభావితం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈపీఎఫ్ అకౌంట్‌లో వార్షికంగా రూ.2,50,000 కన్నా ఎక్కువగా జమచేసే మొత్తంపై పన్ను వసూలు చేసేందుకు ఆదాయపు పన్ను చట్టం 1962 లో సెక్షన్ 9డీ ని కొత్తగా చేర్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

  Aadhaar Card: ఆధార్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్... మీ దగ్గరున్న ఇలాంటి కార్డులు చెల్లవు

  ఓ సంస్థలు రూ.15,000 కన్నా ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగుల సంఖ్య 20 కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఉద్యోగులకు ఈపీఎఫ్ అకౌంట్ తప్పనిసరి. ఉద్యోగి బేసిక్ వేతనంలో 12 శాతం, యజమాని వాటా 12 శాతం కలిపి మొత్తం 24 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయాల్సి ఉంటుంది. ఈపీఫ్ అకౌంట్‌లో జమ చేసిన మొత్తానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రతీ ఏటా వడ్డీ ఇస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈపీఎఫ్ఓ అతితక్కువ వడ్డీ రేటును ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 40 ఏళ్లతో పోలిస్తే ఇదే అతితక్కువ వడ్డీ. 1977-78 సంవత్సరంలో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8 శాతం ఉండేది. 2019-2020, 2020-2021 సంవత్సరాల్లో 8.5 శాతం వడ్డీ చెల్లించింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీ ప్రకటించింది.

  First published:

  ఉత్తమ కథలు