హోమ్ /వార్తలు /బిజినెస్ /

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం
(ప్రతీకాత్మక చిత్రం)

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్... వడ్డీ చెల్లింపుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం (ప్రతీకాత్మక చిత్రం)

EPFO | మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇంకా వడ్డీ రాలేదా? వడ్డీ ఎలా చెల్లించనుందో ఈపీఎఫ్ఓ వివరించింది. మీ అకౌంట్‌లోకి వడ్డీ ఎలా చెల్లిస్తుందో తెలుసుకోండి.

  ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్ ఉన్నవారికి అలర్ట్. ఖాతాదారుల అకౌంట్‌లోకి వడ్డీ చెల్లింపుపై కీలక నిర్ణయం తీసుకుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO. ఖాతాదారుల అకౌంట్‌లోకి 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన వడ్డీని రెండు విడతల్లో చెల్లించాలని నిర్ణయించింది. మొదట ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్‌లోకి 8.15 శాతం వడ్డీని చెల్లించనుంది. మిగిలిన 0.35 శాతం వడ్డీని డిసెంబర్‌లో చెల్లించనుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ ఖాతాదారులకు 8.50 శాతం వడ్డీ చెల్లిస్తామని గతంలోనే ఈపీఎఫ్ఓ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మొత్తం వడ్డీ ఒకేసారి కాకుండా రెండు విడతల్లో చెల్లించనుంది.

  Student PAN Card: విద్యార్థులకు పాన్ కార్డ్... తీసుకుంటే ప్రయోజనాలివే

  EPFO KYC: ఈపీఎఫ్ అకౌంట్‌లో తప్పులున్నాయా? ఆన్‌లైన్‌లో సరిచేయండిలా

  2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన 8.5 శాతం వడ్డీ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన లేదు. ప్రస్తుత పరిస్థితుల వల్ల రెండు వాయిదాల్లో వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు బాగాలేనందువల్ల మా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోలేకపోతున్నాం. అందుకే ఈ కొత్త ఫార్ములా ప్రకారం వడ్డీ చెల్లిస్తాం.

  విర్జేష్ ఉపాధ్యాయ్, ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ

  ఈటీఎఫ్ అమ్మకాలు, డివిడెండ్స్ ద్వారా రూ.3500 కోట్ల నుంచి రూ.4000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని లెక్కలేశారు. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా మార్చిలో ఈపీఎఫ్ఓ లాభాలు పడిపోయాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీ చెల్లిస్తే ఈపీఎఫ్ఓ దగ్గర రూ.700 కోట్లు మిగులు ఉంటుంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఈ లెక్కలు చూస్తే మిగులు రూ.349 కోట్లు ఉండేది. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో అంటే ఏప్రిల్ నుంచి ఆగస్ట్ మధ్య 94 లక్షలకు పైగా క్లెయిమ్స్ సెటిల్ చేసింది ఈపీఎఫ్ఓ. సుమారు రూ.35,000 కోట్లకు పైనే బదిలీ చేసింది.

  Post Office Account: అకౌంట్‌లో ఈ మార్పులు చేస్తేనే ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తుంది


  Smartphone: నడుస్తూ స్మార్ట్‌ఫోన్ వాడటం నిషేధం... ఈ రూల్ ఎక్కడో తెలుసా

  2019-20 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ ఇస్తున్న వడ్డీ 8.5 శాతం. అయితే గత ఏడేళ్లలో చూస్తే ఇది చాలా తక్కువ. అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరం కన్నా 15 బేసిస్ పాయింట్స్ తక్కువ. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2016-17 సంవత్సరంలో 8.65 శాతం, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో 8.75 శాతం, 2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం వడ్డీ చెల్లించింది ఈపీఎఫ్ఓ. అంటే 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఉన్న వడ్డీనే ఇప్పుడూ చెల్లిస్తోంది. ప్రస్తుతం ఈపీఎఫ్ఓలో 6 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Business, BUSINESS NEWS, EPFO, Personal Finance

  ఉత్తమ కథలు