ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ప్రస్తుతం పెన్షన్ కోసం ఉన్న సాలరీ లిమిట్‌ను (Salary Limit) రూ.15,000 నుంచి రూ.21,000 కి పెంచే ఆలోచనలో ఉంది ఈపీఎఫ్ఓ. వేతన పరిమితి పెంచాలనే ఆలోచనకు ఉన్నత స్థాయి కమిటీ మద్దతు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2014లో సాలరీ లిమిట్‌ను రూ.15,000 చేసింది. అంతకన్నా ముందు బేసిక్ వేతనం కేవలం రూ.6,500 మాత్రమే ఉండేది. త్వరలో ఈ లిమిట్‌ను రూ.21,000 చేసే అవకాశం ఉంది. అయితే దీనికి ప్రభుత్వ ఆమోదం లభించాలి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే 75 లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరగనుంది.
కేంద్ర ప్రభుత్వం బేసిక్ వేతనంలో 1.16 శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. కాబట్టి రూ.6,750 కోట్ల అదనపు కేటాయింపులు చేయాల్సి ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. ఈపీఎఫ్ఓకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆమోదం వేసిన తర్వాత బేసిక్ వేతనం రూ.21,000 ఉన్నవారంతా ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్‌గా చేరేందుకు అర్హులు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఈ విధానం అమలుపై యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపాదించిన పెంపును అమలుచేయడానికి కొంత సమయం కావాలని అడిగారు.
IRCTC Meghalaya Tour: హైదరాబాద్ నుంచి మేఘాలయకు ఐఆర్సీటీసీ టూర్... ప్యాకేజీ వివరాలివే
ప్రస్తుత ఈపీఎఫ్ఓ నియమనిబంధనల ప్రకారం 20 మందికి పైగా ఉద్యోగులు ఉన్న ప్రతీ కంపెనీ ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ కావాలి. రూ.15,000 లోపు ఉద్యోగులందర్నీ ఈపీఎఫ్ స్కీమ్‌లో చేర్చాలి. ఈపీఎఫ్ఓ లిమిట్ పెంచితే రూ.21,000 లోపు బేసిక్ వేతనం ఉన్నవారంతా ఈపీఎఫ్ స్కీమ్‌లో చేరొచ్చు. ఎక్కువ మంది రిటైర్మెంట్ స్కీమ్‌లో చేరడానికి అవకాశం లభిస్తుంది.
ఇప్పటికే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) సోషల్ సెక్యూరిటీ స్కీమ్ లిమిట్ రూ.21,000 ఉంది. దీనికి సమాంతరంగా ఈపీఎఫ్ స్కీమ్ కూడా ఉంటుంది. అయితే ఈపీఎఫ్ స్కీమ్‌లో చేరడానికి సాలరీ లిమిట్‌ను ఎప్పట్లోగా పెంచుతారన్న స్పష్టత లేదు.
Old Currency Notes: పాత కరెన్సీ నోట్లు ఉన్నవారికి అలర్ట్... ఆర్బీఐ కీలక సూచనలు
ఈపీఎఫ్ స్కీమ్‌లో ఉద్యోగులు చేరితే ఉద్యోగి వేతనం నుంచి 12 శాతం, యజమాని వాటా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. యజమాని వాటాలో 8.33 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లో, మిగిలిన 3.67 శాతం ఈపీఎఫ్ స్కీమ్‌లో జమ అవుతుంది. యజమాని వాటాలో 0.50 శాతం ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌లో, 0.50 శాతం అడ్మినిస్ట్రేటీవ్ ఛార్జీల రూపంలో జమ అవుతాయి.
ఈపీఎఫ్ స్కీమ్‌లో సబ్స్క్రైబర్లు జమ చేసే మొత్తానికి ఈపీఎఫ్ఓ ప్రతీ ఏటా వడ్డీ ఇస్తుంది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్ఓ 8.1 శాతం వడ్డీ ప్రకటించింది. అంతకుముందు 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో 8.5 శాతం వడ్డీ ఇచ్చింది ఈపీఎఫ్ఓ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EPFO, Personal Finance