Salary Hike: ఉద్యోగులకు అలర్ట్... వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం పెరుగుతుంది

Salary Hike: ఉద్యోగులకు అలర్ట్... వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతం పెరుగుతుంది (ప్రతీకాత్మక చిత్రం)

Salary Hike | వ్యాక్సిన్ తీసుకోని ఉద్యోగులకు వేతనాల పెంపు, ఇన్సెంటీవ్స్ ఆపాలని కంపెనీలు నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

  • Share this:
    కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నారా? ఇంకా తీసుకోలేదా? అయితే మీకు జీతం పెరగదు. అంతేకాదు... ఇన్సెంటీవ్స్, బోనస్ లాంటి బెనిఫిట్స్ కూడా ఉండవు. ఇదెక్కడి కొత్త రూల్ అనుకుంటున్నారా? ఈ పరిస్థితి రాబోతోంది. చాలావరకు కంపెనీలు తమ ఉద్యోగులకు వేతనాల పెంపు దగ్గర్నుంచి ఇన్సెంటీవ్స్ వరకు... ప్రతీ బెనిఫిట్‌కు కోవిడ్ 19 వ్యాక్సినేషన్‌కు లింక్ చేయబోతున్నట్టు ఎకనమిక్ టైమ్స్ కథనం పబ్లిష్ చేసింది. అంటే కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకే వేతనాలు పెరుగుతాయి. ఇన్సెంటీవ్స్ వస్తాయి. ఇలాంటి రూల్స్‌ను అమలు చేసేందుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నట్టు ఆ వార్త సారాంశం. వచ్చే మూడు నాలుగు నెలల్లో ఆఫీసులు తెరిచి సాధారణంగా కార్యకలాపాలు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్న కంపెనీలు... ఇందుకోసం తమ ఉద్యోగులు కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నాయి.

    "చట్టం ప్రకారం వ్యాక్సినేషన్ స్వచ్ఛందంగా తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవాలని ఒత్తిడి చేయడం ప్రాథమిక హక్కులకు విరుద్ధం అని ఇటీవల కోర్టులు చెప్పాయి. అయితే కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకోకుండా ఇతర ఉద్యోగులను రిస్కులో పెట్టేవారి విషయంలో కంపెనీలు కఠినంగా ఉండాలని భావిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకోనివారు కెరీర్ పురోగతిలో లేదా వేతనాల విషయంలో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని ఖైతాన్ అండ్ కో భాగస్వామి అన్షుల్ ప్రకాశ్ ఎకనమిక్ టైమ్స్‌కు తెలిపారు.

    7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు

    India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగానికి అప్లై చేశారా? ఫలితాలపై క్లారిటీ ఇచ్చిన ఇండియా పోస్ట్

    ఇప్పటికే పలు కంపెనీలు ఈసారి ఇంక్రిమెంట్ కావాలంటే వ్యాక్సిన్ తీసుకోవాలని తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. అంతేకాదు... వేతనంలో 5 శాతం వరకు ఇవ్వకుండా, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇస్తామన్న కండీషన్స్ పెడుతున్నాయి. ఆఫీసులు తిరిగి ప్రారంభించిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదన్న ఆలోచనతో కంపెనీలు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నాయి. చట్టం ప్రకారం వ్యాక్సినేషన్ తీసుకోవడం తప్పనిసరి కాకపోయినా ఉద్యోగులు కార్యాలయాలకు హాజరుకావడానికి ముందస్తు షరతుగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

    Insurance: ఈ స్కీమ్‌లో ఉన్నవారికి రూ.2,00,000... ఒక్క ఏడాదిలో రూ.4,698 కోట్లు చెల్లించిన కేంద్ర ప్రభుత్వం

    Top 10 Brands in India: ఈ సంస్థలో జాబ్ కావాలి... ఉద్యోగులు కోరుకుంటున్న టాప్ 10 బ్రాండ్స్ ఇవే

    వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నవారు పదవులు కోల్పోవడం, పెర్ఫామెన్స్ లింక్డ్ ఇన్సెంటీవ్స్ కోల్పోవడం లాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సేవారంగం, తయారీ రంగం, ఇతర క్లైంట్ సర్వీసుల్లో ఉన్న కంపెనీల్లో ఇలాంటి నిబంధనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు... వ్యాక్సిన్ తీసుకోనివారు వారానికి ఒకసారి ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ ఇవ్వాలన్న షరతు పెట్టాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక టాటా స్టీల్, ఐటీసీ, వేదాంత లాంటి పలు కంపెనీలు తమ ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకోవడం స్వచ్ఛందం అని చెబుతున్నా చాలావరకు కంపెనీలు తమ ఉద్యోగులు వ్యాక్సిన్ తీసుకోవడానికి కూడా డెడ్‌లైన్ విధిస్తున్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published: