హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tokenization: డెబిట్, క్రెడిట్ కార్డ్‌హోల్డర్లకి అలర్ట్.. టోకెనైజ్ చేయాల్సిందే.. అందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..!

Tokenization: డెబిట్, క్రెడిట్ కార్డ్‌హోల్డర్లకి అలర్ట్.. టోకెనైజ్ చేయాల్సిందే.. అందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..!

Tokenization

Tokenization

Tokenization: క్రెడిట్, డెబిట్ కార్డ్ డేటాను సెప్టెంబర్ 30, 2022 నాటికి యూనిక్ టోకెన్‌లతో భర్తీ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. హై లెవెల్ సెక్యూరిటీ అయిన టోకెనైజేషన్ కార్డ్ హోల్డర్‌ల పేమెంట్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్ల (Cyber Criminals) దాడులు చాలా అధికమవుతున్నాయి. వీరు క్రెడిట్/డెబిట్ కార్డు (Credit Card/Debit Card) డీటెయిల్స్ తెలివిగా తస్కరిస్తూ డబ్బులు కాజేస్తున్నారు. వీటికి పరిష్కారంగా ఆన్‌లైన్ యాప్‌ ట్రాన్సాక్షన్స్, పాయింట్ ఆఫ్ సేల్ వద్ద క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు అందించడానికి బదులు యూనిక్ టోకెన్ ఉపయోగించేలా టోకెనైజేషన్‌ (Tokenization) సిస్టమ్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకొచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డ్ డేటాను సెప్టెంబర్ 30, 2022 నాటికి యూనిక్ టోకెన్‌లతో భర్తీ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. హై లెవెల్ సెక్యూరిటీ అయిన టోకెనైజేషన్ కార్డ్ హోల్డర్‌ల పేమెంట్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరుస్తుంది. అలానే కస్టమర్లు సురక్షితమైన లావాదేవీలు చేయడంలో సహాయపడేందుకు కార్డ్ వివరాలు ఎన్‌క్రిప్టెడ్ టోకెన్‌గా స్టోర్ అవుతాయి.

ఈ టోకెన్లు కస్టమర్ వివరాలను ఎవరికీ కనిపించకుండా చెల్లింపులు జరుపుతాయి. ఒరిజినల్ కార్డ్ డేటాను ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ టోకెన్‌తో భర్తీ చేయడాన్ని ఆర్‌బీఐ తప్పనిసరి చేసింది. అలానే డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని కార్డ్ జారీ చేసేవారు లేదా నెట్‌వర్క్‌లు కాకుండా మరే ఇతర సంస్థ స్టోర్ చేయకూడదు. ఇప్పటికే స్టోర్ చేసిన డేటాను తొలగించాలి.

ఆర్‌బీఐ ప్రకారం, టోకెనైజేషన్ అనేది 'టోకెన్' అని పిలిచే ఆల్టర్నేటివ్ కోడ్‌తో వాస్తవ కార్డ్ వివరాలను భర్తీ చేయడం. కార్డ్, టోకెన్ అభ్యర్థన మేరకు ఇది ప్రత్యేకంగా ఉంటుంది. టోకెనైజేషన్ సిస్టమ్ పూర్తిగా ఉచితం. దేశీయ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే టోకెనైజేషన్ వర్తిస్తుంది. డెబిట్, క్రెడిట్ కార్డ్ టోకెనైజేషన్ రూల్ సెప్టెంబర్ 30 నుంచి అమలులోకి వస్తుంది. కాబట్టి అంతకుముందే కార్డును టోకెనైజ్ చేసుకోవాలి. అది ఏలాగో ఇప్పుడు చూద్దాం.

* టోకెన్‌లను రూపొందించడం ఎలా..?

స్టెప్ 1: ఏదైనా కొనుగోలు చేయడానికి, అలానే పేమెంట్ ట్రాన్సాక్షన్ ప్రారంభించడానికి, ఏదైనా ఒక ఈ-కామర్స్ వెబ్‌సైట్ లేదా యాప్‌కి వెళ్లాలి.

స్టెప్ 2: మీ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ అవుట్ చేస్తున్నప్పుడు మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ వివరాలను ఎప్పట్లాగానే ఎంటర్ చేయాలి.

స్టెప్ 3: ఆపై "RBI మార్గదర్శకాల ప్రకారం మీ కార్డ్‌ని టోకెనైజ్ చేయండి" లేదా "సెక్యూర్ యువర్ కార్డు యాజ్ పర్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ (Secure your card as per RBI guidelines)" ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 4: ఇప్పుడు టోకెన్‌ను రూపొందించడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్సక్షన్స్ పూర్తి చేయడానికి, మీ బ్యాంక్ మీ మొబైల్ ఫోన్ లేదా ఈమెయిల్‌కు పంపిన OTPని ఎంటర్ చేయాలి.

ఇది కూడా చదవండి : కొంపదీసి లిమిట్‌కు మించి క్యాష్ పేమెంట్ చేస్తున్నారా..? అయితే ఇబ్బందులు తప్పవు

స్టెప్ 5: ఇప్పుడు టోకెన్‌ క్రియేట్ అయిపోతుంది. ఆపై వెబ్‌సైట్/యాప్‌లో మీ కార్డ్ వివరాలన్నీ కూడా టోకెన్‌తో భర్తీ అవుతాయి.

స్టెప్ 6: మళ్లీ అదే యాప్/సైట్‌లో పేమెంట్ చేస్తున్నప్పుడు మీ కార్డ్‌ను ఈజీగా గుర్తించేందుకు.. మీరు సేవ్ చేసిన కార్డ్‌లోని చివరి నాలుగు అంకెలు కనిపిస్తాయి. అంటే మీ కార్డ్ టోకెనైజ్ అయిందని అర్థం.

* ఏవైనా రిస్క్స్ ఉన్నాయా?

కొత్త ప్రక్రియ సురక్షితమైనదని రిజర్వ్ బ్యాంక్ పేర్కొన్నా.. ఇందులో కొన్ని ఇతర భద్రతా ప్రమాదాలు ఉండవచ్చు. అలానే టోకెనైజేషన్‌ను అమలు చేస్తే ప్రాసెసింగ్ లావాదేవీలు మరింత క్లిష్టంగా, సమగ్రంగా మారతాయి. అప్పుడు ఐటీ నిర్మాణంలో సంక్లిష్టత ఏర్పడొచ్చు.

First published:

Tags: Credit card, Debit card, Rbi, Transactions

ఉత్తమ కథలు