స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే కస్టమర్లకు అలర్ట్. ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే విషయంలో కీలక మార్పు తీసుకొచ్చింది బ్యాంకు. ఇకపై ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బీఐ ఏటీఎంలల్లో ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. అంటే ఎవరి కార్డు స్వైప్ చేస్తారో వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తేనే మెషీన్లో నుంచి డబ్బులు వస్తాయి. ఓటీపీ లేకపోతే డబ్బులు డ్రా చేయడం సాధ్యం కాదు. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి చేసింది ఎస్బీఐ. ఇకపై మీరు ఎస్బీఐ ఏటీఎంలో ఎప్పుడైనా సరే రూ.10,000 కన్నా ఎక్కువ నగదు తీసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే.
Gold Loan Vs Personal Loan: లోన్ తీసుకునే ముందు ఈ లెక్కలు మర్చిపోవద్దు
Flipkart: గుడ్ న్యూస్... 70,000 ఉద్యోగాలు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్... ఇంటర్, డిగ్రీ అర్హత
ఏటీఎం కేంద్రాల దగ్గర మోసాలు, కార్డు క్లోనింగ్ లాంటి ఫ్రాడ్స్ తగ్గించేందుకు ఈ కొత్త సెక్యూరిటీ సిస్టమ్ అమలు చేస్తోంది ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను తీసుకురావడం ఇది కొత్త కాదు. ఈ ఏడాది జనవరిలోనే ఈ విధానం అమలులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు రాత్రి సమయంలో చేసే విత్‌డ్రాయల్స్‌కే ఓటీపీ విధానం వర్తించేది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు డబ్బులు డ్రా చేసే కస్టమర్లు ఓటీపీ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండేది. మళ్లీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఓటీపీ లేకుండానే డబ్బులు డ్రా చేసుకునేవారు కస్టమర్లు. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 18 నుంచి అమలులోకి రానుంది. కస్టమర్లు తమ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలి.
Jio IPL Plans: స్మార్ట్‌ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలా? జియో క్రికెట్ ప్లాన్స్ ఇవే
Credit Score: అలర్ట్... ఈ 5 తప్పులు చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌కు ముప్పు
మీరు ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ముందుగా ఏటీఎంలో మీ కార్డు స్వైప్ చేయాలి. రూ.10,000 కన్నా ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఏటీఎం స్క్రీన్ పైన ఓటీపీ విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. మీరు సరైన ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి. రూ.10,000 లోపు డ్రా చేయాలంటే ఓటీపీ అవసరం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ATM, Bank, Banking, Personal Finance, Sbi, State bank of india