• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • ALERT FOR CUSTOMERS RTGS SERVICES WILL NOT AVAILABLE FOR 14 HOURS ON APRIL 18 DUE TO UPGRADATION SS

RTGS Services: అలర్ట్... 14 గంటలపాటు ఆ‌ర్‌టీజీఎస్ సేవలు బంద్... ఎప్పుడో తెలుసుకోండి

RTGS Services: అలర్ట్... 14 గంటలపాటు ఆ‌ర్‌టీజీఎస్ సేవలు బంద్... ఎప్పుడో తెలుసుకోండి

RTGS Services: అలర్ట్... 14 గంటలపాటు ఆ‌ర్‌టీజీఎస్ సేవలు బంద్... ఎప్పుడో తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

RTGS Services | మీరు ఎక్కువగా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంటారా? ఆర్‌టీజీఎస్ సేవల్ని ఉపయోగిస్తుంటారా? ఈ ఆదివారం 14 గంటల పాటు ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవు.

  • Share this:
    దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఆర్‌టీజీఎస్ సేవలు 14 గంటలపాటు నిలిచిపోనున్నాయి. దేశవ్యాప్తంగా రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS సేవలు14 గంటల పాటు నిలిచిపోనున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ప్రకటించింది. ఆర్‌టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆర్‌టీజీఎస్ సేవల్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 18 ఆదివారం అర్థరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవని ఆర్‌బీఐ ప్రకటించింది. సుమారు 14 గంటల పాటు ఆర్‌టీజీఎస్ సేవల్ని వేస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఆ సమయంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడానికి కస్టమర్లు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్-NEFT సేవల్ని ఉపయోగించుకోవచ్చు. నెఫ్ట్ సేవలు యథావిథిగా అందుబాటులో ఉంటాయి. నెఫ్ట్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు.

    Money Transfer: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇలా చేయండి

    LIC Bima Jyoti: చెల్లించే ప్రీమియంకు డబుల్ బెనిఫిట్ అందించే ఎల్ఐసీ పాలసీ


    ఏప్రిల్ 18న 14 గంటల పాటు ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవని, పేమెంట్స్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఉపయోగించాలన్న విషయాన్ని కస్టమర్లకు తెలియజేయాలని బ్యాంకుల్ని కోరింది ఆర్‌బీఐ. దీంతో బ్యాంకులు కూడా కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. ఆదివారం నాడు 14 గంటలపాటు ఆర్‌టీజీఎస్ సేవలు అందుబాటులో ఉండవని, కస్టమర్లు మనీ ట్రాన్స్‌ఫర్ కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని బ్యాంకులు కోరుతున్నాయి. రూ.2,00,000 కన్నా ఎక్కువ మొత్తంలో భారీగా డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్ చేయడానికి లావాదేవీలు జరపడానికి ఆర్‌టీజీఎస్ ఉపయోగపడుతుంది. రూ.2,00,000 కన్నా ఎక్కువ ఎంతైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. గతేడాది డిసెంబర్ నుంచి ఆర్‌టీజీఎస్ సేవలు 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చాయి. అంటే కస్టమర్లు ఎప్పుడైనా ఆర్‌టీజీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. గతంలో ఆర్‌టీజీఎస్ వేళలు పరిమితంగా ఉండేవి.

    ATM Cash Withdrawal: ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలా? కార్డు అవసరం లేదు

    SBI Insurance: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్... రూ.40 లక్షల ఇన్స్యూరెన్స్ తీసుకోండి ఇలా

    భారతదేశంలో ఆర్‌టీజీఎస్ సేవలు 2004 మార్చి 26న ప్రారంభమయ్యాయి. భారతదేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు 2019 జూలైలో ఆర్‌టీజీఎస్‌తో పాటు నెఫ్ట్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తేసింది ఆర్‌బీఐ.
    Published by:Santhosh Kumar S
    First published: