ఏదైనా మాల్‍కు వెళ్లి షాపింగ్ చేసి బిల్ చెల్లించే సమయంలో అక్కడ కౌంటర్ దగ్గర ఉన్న వ్యక్తి కస్టమర్ మొబైల్ నెంబర్ (Mobile Number) అడుగుతాడు. సూపర్ మార్కెట్‌కు (Super Market) వెళ్లినా ఇదే పరిస్థితి. ఏవైనా వస్తువులు కొని బిల్ చెల్లించడానికి మొబైల్ నెంబర్‌తో అవసరం ఏం ఉంటుందన్న సందేహం కూడా కస్టమర్లకు రాదు. మొబైల్ నెంబర్ చెప్పేసి, బిల్ పేమెంట్ చేసి వెళ్లిపోతుంటారు. మాల్స్, సూపర్ మార్కెట్లోలనే కాదు వాటి బయట కూడా లక్కీ డ్రా పేరుతో ప్రజల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలు తెలుసుకునేవారు కనిపిస్తుంటారు. వీరి చేతుల్లోకి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ వెళ్తే మోసాలకు దారితీయొచ్చు. ఫోన్ కాల్స్, టెక్స్ట్ సందేశాల ద్వారా మోసాలు జరుగుతున్న ఘటనలు పెరుగుతుండటంతో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
షాపుల్లో లేదా బయట కస్టమర్ల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించకూడదని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. వ్యక్తిగత వివరాలు అందించే వరకు తాము బిల్ ప్రాసెస్ పూర్తి చేయలేమని చెబుతుంటారని, ఇది వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం అన్యాయమైన, నిర్బంధ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని, ఫోన్ నెంబర్లు, ఇతర సమాచారాన్ని సేకరించడం వెనుక ఎటువంటి హేతుబద్ధత లేదని ఆయన అన్నారు.
Google Pay: క్రెడిట్ కార్డ్ ఉందా? గూగుల్ పే నుంచి యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు ఇలా
కస్టమర్ల ప్రైవసీకి సంబంధించిన ఆందోళనలు కూడా ఉన్నాయని రోహిత్ కుమార్ సింగ్ అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం కస్టమర్ల వివరాలు సేకరించకూడదని, వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా రిటైల్ పరిశ్రమ, ఇండస్ట్రీ ఛాంబర్స్‌కు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) లాంటివాటికి అడ్వైజరీ జారీ చేసినట్లు చెప్పారు.
ఏదైనా డెలివరీ చేయడానికి లేదా బిల్లును రూపొందించడానికి రిటైలర్లకు ఫోన్ నంబర్‌లను అందించడం భారతదేశంలో అవసరం లేదని సింగ్ తెలిపారు. అయినప్పటికీ, రిటైలర్లు లావాదేవీని ముగించడానికి మొబైల్ నెంబర్‌లను కోరితే కస్టమర్లు ఇబ్బందికరమైన పరిస్థితిలో పడతారని ఆయన అన్నారు.
Pension Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.5,000 పెన్షన్... మీరూ చేరండి ఇలా
కాబట్టి మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సూపర్ మార్కెట్, మాల్ లేదా ఇతర షాపింగ్ సెంటర్‌లో మీరు ఏదైనా కొని, బిల్లు చెల్లించే సమయంలో మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడి సిబ్బంది ఫోన్ నెంబర్ ఇవ్వాలని పట్టుబడితే వారికి రూల్స్ గుర్తుచేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: DATA BREACH, Mobile News, Privacy