హోమ్ /వార్తలు /బిజినెస్ /

New Rules: క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి నాలుగు కొత్త రూల్స్

New Rules: క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి నాలుగు కొత్త రూల్స్

New Rules: క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి నాలుగు కొత్త రూల్స్
(ప్రతీకాత్మక చిత్రం)

New Rules: క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... అక్టోబర్ 1 నుంచి నాలుగు కొత్త రూల్స్ (ప్రతీకాత్మక చిత్రం)

New Rules | అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డుకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏప్రిల్‌లోనే ఈ రూల్స్ ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మీరు క్రెడిట్ కార్డ్ (Credit Card) వాడుతున్నారా? ఎక్కువగా క్రెడిట్ కార్డ్ లావాదేవీలు జరుపుతుంటారా? అయితే అలర్ట్. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్ విషయంలో కొత్త రూల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. లక్షలాది మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లను ప్రభావితం చేసే నియమనిబంధనలు ఇవి. ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్, ఇన్ యాప్ ట్రాన్సాక్షన్స్ ఇలా ప్రతీ ట్రాన్సాక్షన్‌ను కొత్త రూల్స్ ప్రభావితం చేస్తాయి. మరి ఆ రూల్స్ ఏంటీ? మీరేం చేయాలి? తెలుసుకోండి.

OTP: క్రెడిట్ కార్డ్ సంస్థలు క్రెడిట్ కార్డ్ జారీ చేస్తే సరిపోదు. కార్డ్ యాక్టివేట్ చేయడానికి వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా కార్డ్ హోల్డర్ల సమ్మతి తీసుకోవాలి. అయితే కార్డ్ జారీ చేసిన 30 రోజుల్లో కస్టమర్ కార్డ్ యాక్టివేట్ చేయకపోతే ఈ రూల్ వర్తిస్తుంది. ఒకవేళ కస్టమర్ నుంచి సమ్మతి రాకపోతే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా క్రెడిట్ కార్డును క్లోజ్ చేయాలి. కస్టమర్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత 7 వర్కింగ్ డేస్‌లో కార్డ్ క్లోజ్ చేయడం తప్పనిసరి.

Online Shopping: ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్ డెలివరీ తీసుకుంటున్నారా? ఇలా చేయకపోతే చిక్కులే

Credit Limit: మీ ప్రమేయం లేకుండా క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచేశారా? మీకు తెలియకుండా క్రెడిట్ లిమిట్ మారిందా? ఇకపై ఇలా జరగదు. మీ క్రెడిట్ లిమిట్ పెంచాలంటే క్రెడిట్ కార్డ్ జారీ చేసిన సంస్థ మీ నుంచి సమ్మతి తీసుకోవాలి. అంటే కస్టమర్ సమ్మతి లేకుండా క్రెడిట్ లిమిట్ పెంచకూడదు. క్రెడిట్ లిమిట్ పెంచే అవకాశం ఉందని కార్డ్ హోల్డర్‌కు తెలియజేసి, కస్టమర్ సమ్మతి తీసుకొని లిమిట్ పెంచాలి.

Rate of Interest: క్రెడిట్ కార్డ్ ఛార్జీలు, పన్నులు, చక్రవడ్డీ, మినిమమ్ అమౌంట్ డ్యూ లాంటి వివరాలన్నీ కస్టమర్‌కు సక్రమంగా వివరించాలి. ఇందుకు సంబంధించిన ఉదాహరణల్ని నియమనిబంధనలకు సంబంధించిన పత్రాల్లో తెలపాలి.

Aadhaar Card: ఈ 5 టిప్స్‌తో ఆధార్ మోసాలకు చెక్... గుర్తుంచుకోండి

Tokenisation: కార్డ్ టోకెనైజేషన్ రూల్స్ క్రెడిట్ కార్డులతో పాటు డెబిట్ కార్డులకు కూడా వర్తిస్తాయి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నెంబర్లు, సీవీవీ లాంటి వివరాలు ఇ-కామర్స్ సైట్లలో సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా టోకెనైజ్ చేస్తే చాలు. అంటే మీ కార్డ్ నెంబర్ బదులు టోకెన్ క్రియేట్ అవుతుంది. మీ కార్డ్ నెంబర్ ఇ-కామర్స్ సైట్లలో ఉండదు. అక్టోబర్ 1 నుంచి కార్డ్ టోకెనైజేషన్ తప్పనిసరి. లేకపోతే ప్రతీసారి మీ కార్డ్ వివరాలు, సీవీవీ లావాదేవీల సమయంలో ఎంటర్ చేయాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Credit cards, Debit cards, Personal Finance, Rbi, Reserve Bank of India