హోమ్ /వార్తలు /బిజినెస్ /

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్‌ని ఈఎంఐగా మారుస్తున్నారా? ఈ విషయం తెలుసా?

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్‌ని ఈఎంఐగా మారుస్తున్నారా? ఈ విషయం తెలుసా?

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్‌ని ఈఎంఐగా మారుస్తున్నారా? ఈ విషయం తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్‌ని ఈఎంఐగా మారుస్తున్నారా? ఈ విషయం తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

Credit Card | క్రెడిట్ కార్డుతో జరిపే లావాదేవీలను ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలను (Credit Card Transactions) ఈఎంఐగా మార్చుకోలేరు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

జేబులో క్రెడిట్ కార్డ్ ఉంటే డబ్బులు ఉన్నంత ధీమా. క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉంటే అంత జేబులో ఉన్నట్టే. అత్యవసర సమయాల్లో క్రెడిట్ కార్డ్ (Credit Card) ఆదుకుంటుంది. తప్పనిసరిగా ఎక్కడైనా భారీగా ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు, భారీ మొత్తం ఉన్న వస్తువులు కొనాలనుకున్నప్పుడు క్రెడిట్ కార్డ్ బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ మొత్తంలో చేసిన ట్రాన్సాక్షన్‌ను క్రెడిట్ కార్డ్ ఈఎంఐగా (Credit Card EMI) మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్ యూజర్లు ఓ విషయం గుర్తుంచుకోవాలి. అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.క్రెడిట్ కార్డుతో భారీగా ఖర్చు చేసినప్పుడు ఒకేసారి బిల్ చెల్లించకుండా ఈఎంఐగా మార్చుకుంటారు యూజర్లు. వాయిదా పద్థతిలో అసలుతోపాటు వడ్డీ చెల్లిస్తుంటారు. మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్‌ను ఈఎంఐగా మార్చుకోవచ్చు. లేదా పెద్దమొత్తంలో ఉన్న ట్రాన్సాక్షన్‌ను ఈఎంఐగా కన్వర్ట్ చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ బిల్ జనరేట్ అయిన తర్వాత డ్యూ డేట్ కన్నా ముందు ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే చాలా మంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ట్రావెల్ ఖర్చులు, దుస్తులు, ఇన్స్యూరెన్స్ లాంటి పేమెంట్స్‌ని క్రెడిట్ కార్డ్ ద్వారా చేసి ఆ తర్వాత ఈఎంఐగా మారుస్తుంటారు.
Airtel 1.5 GB Plans: రోజూ 1.5జీబీ మొబైల్ డేటా అందించే ఎయిర్‌టెల్ ప్లాన్స్ ఇవే
కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం కొన్ని లావాదేవీలను ఈఎంఐగా మార్చుకోలేరు. క్రెడిట్ కార్డ్ ద్వారా బంగారం కొంటే ఆ ట్రాన్సాక్షన్‌ను ఈఎంఐగా మార్చుకునే అవకాశం ఉండదు. 2013లోనే ఈ నిబంధన వచ్చింది. అంతకన్నా ముందు బంగారు నగలు, వజ్రాల నగల్ని క్రెడిట్ కార్డ్ ద్వారా కొన్నా ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటు ఉండేది. 2018లో కూడా ఆర్‌బీఐ మరోసారి నిబంధనల్ని జారీ చేసింది. క్రెడిట్ కార్డుతో నగలు కొంటే ఆ లావాదేవీలను ఈఎంఐలుగా మార్చకూడదంటూ అన్ని బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశించింది.
ఇక క్రెడిట్ కార్డుతో పెట్రోల్, డీజిల్ ఎక్కువ మొత్తంలో కొన్నా ఈఎంఐగా మార్చుకోలేరు. క్రెడిట్ కార్డుతో నగదు విత్‌డ్రా చేస్తే ఆ మొత్తాన్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవడం కుదరదు. పాత క్రెడిట్ కార్డ్ లావాదేవీలను కూడా ఈఎంఐగా మార్చుకునే అవకాశం ఉండదు. ట్రాన్సాక్షన్ జరిపిన 60 రోజుల లోపే ఈఎంఐగా మార్చుకోవచ్చు. 60 రోజులు దాటిందంటే ఈఎంఐగా మార్చుకోలేరు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం పాత ట్రాన్సాక్షన్స్‌ని కూడా ఈఎంఐగా కన్వర్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తాయి.
SBI Account KYC: ఎస్‌బీఐ అకౌంట్ బ్లాక్ కాకుండా కేవైసీ చేయించండి ఇలా


ఇవి కాకుండా ఇతర క్రెడిట్ కార్డు లావాదేవీలను ఈఎంగా మార్చుకోవాలనుకునేవారు ఓ విషయం గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. 36 శాతం నుంచి 48 శాతం వరకు వడ్డీ ఉంటుంది. అందుకే క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌ని ఈఎంఐగా మార్చుకోకూడదు. అవసరమైతే పర్సనల్ లోన్ తీసుకొని క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించాలి. క్రెడిట్ కార్డ్ వడ్డీ రేటు కన్నా పర్సనల్ లోన్ వడ్డీ రేటు తక్కువ.

First published:

Tags: Credit cards, Personal Finance, Rbi, Reserve Bank of India

ఉత్తమ కథలు