కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2023లోకి ప్రవేశిస్తున్నాం. ఈ క్రమంలో బ్యాంకులు తమ లాకర్ కస్టమర్‌లకు 2022 డిసెంబర్ 31లోపు తమ అగ్రిమెంట్లను రెన్యూవల్ (Bank Locker Agreement Renewal) చేసుకోవాలని మెసేజ్‌లు పంపుతున్నాయి. ఇప్పటికే లాకర్ ఉన్న కస్టమర్‌లు బ్యాంక్ మెసేజ్‌ను రిసీవ్ చేసుకుని ఉంటారు. వాస్తవానికి కొత్త బ్యాంక్ లాకర్ నియమాలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సవరించిన నిబంధనల ప్రకారం, బ్యాంకులు తమ ప్రస్తుత కస్టమర్‌లతో 2023 జనవరి 1 నాటికి లాకర్ అగ్రిమెంట్‌లు రెన్యూవల్ చేయాలి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త బ్యాంక్ లాకర్ నియమాలను 2022 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ సవరించిన నిబంధనల ప్రకారం.. బ్యాంకులు తమ ప్రస్తుత కస్టమర్‌లతో 2023 జనవరి 1 నాటికి లాకర్ ఒప్పందాలను పునరుద్ధరించుకోవాలి. దీంతో బ్యాంకులు ఇప్పుడు తమ కస్టమర్లకు మెసేజ్ చేస్తున్నాయి.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు రూ.10 లక్షల బీమా... ప్రీమియం రూపాయి లోపే
ఆర్బీఐ సవరించిన నిబంధనల ప్రకారం.. లాకర్ అగ్రిమెంట్లను పునరుద్ధరించడానికి చివరి తేదీ 2023 జనవరి 1. దీంతో బ్యాంకులు తమ లాకర్ అగ్రిమెంట్లను ఇప్పటికే ఉన్న లాకర్ కస్టమర్లతో రెన్యూవల్ చేసుకోవాలి. ఇందుకు సమయం మరో రెండు రోజులు మాత్రమే ఉంది.
కస్టమర్‌కు లాకర్‌ను కేటాయించే ముందు, బ్యాంకులు కస్టమర్‌తో సక్రమంగా స్టాంప్ చేసిన కాగితంపై అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. అతను/ఆమె హక్కులు, బాధ్యతలను తెలుసుకోవడానికి రెండు వర్గాలు సంతకం చేసిన లాకర్ అగ్రిమెంట్ కాపీని లాక్-హైరర్ (కస్టమర్)కు అందించాలి. ఒరిజినల్ లాకర్ అగ్రిమెంట్ లాకర్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో ఉంచనున్నారు.
మూడు సంవత్సరాల అద్దె, కేటాయింపు సమయంలో ఛార్జీలను కవర్ చేసే టర్మ్ డిపాజిట్ (ఫిక్స్‌డ్ డిపాజిట్) పొందేందుకు బ్యాంకులను RBI అనుమతించింది. అంటే లాకర్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే, లాకర్ మూడు సంవత్సరాల అద్దె, ఛార్జీలను కవర్ చేసే టర్మ్ డిపాజిట్‌ను చేయమని బ్యాంక్‌లు కోరుతాయి. లాకర్-హైరర్ ఆపరేటింగ్స్ లేదా లాకర్ అద్దెను చెల్లించని సందర్భాలు గతంలో చాలా చోటుచేసుకున్నాయి. దీంతో లాకర్ అద్దెను వెంటనే చెల్లించేలా ఈ నిబంధనను తీసుకొచ్చారు. అయితే మూడేళ్ల కంటే ఎక్కువ కాల వ్యవధి టర్మ్ డిపాజిట్ల డిమాండ్‌ను ఆర్‌బీఐ నిర్బంధంగా భావిస్తుంది.
Savings Scheme: గుడ్ న్యూస్... పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకున్నవారికి భారీగా వడ్డీ పెంపు
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్‌లు ఇప్పటికే ఉన్న లాకర్ హోల్డర్స్ లేదా సంతృప్తికరమైన ఆపరేటివ్ అకౌంట్‌లను కలిగి ఉన్న కస్టమర్లను టర్మ్ డిపాజిట్స్ ఓపెన్ చేయమని అడగకూడదు. కస్టమర్లు ముందుగానే లాకర్‌ని సరెండర్ చేస్తే, బ్యాంకులు వారి నుంచి సేకరించిన అడ్వాన్స్ అద్దె మొత్తాన్ని తిరిగి తప్పనిసరిగా చెల్లించాలి.
రెండు వార్తాపత్రికల్లో పబ్లిక్ నోటీసు
బ్యాంక్ మూసివేత, బ్రాంచ్ మార్చడం లేదా మరొక బ్యాంక్‌తో విలీనం వంటి సందర్భాల్లో.. బ్యాంక్ రెండు వార్తాపత్రికల్లో పబ్లిక్ నోటీసు ఇవ్వాలి. బ్యాంక్‌లు కూడా కనీసం రెండు నెలల ముందుగానే కస్టమర్‌లకు ఈ విషయం తెలియజేయాలి. అలాగే వారు సదుపాయాన్ని మార్చుకోవడానికి లేదా మూసివేయడానికి ఆప్షన్లు కూడా అందించాలి. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఏదైనా అత్యవసర పరిస్థితుల కారణంగా ప్రణాళిక లేకుండా బ్యాంక్ షిఫ్ట్ అయితే బ్యాంక్‌లు తమ కస్టమర్లను వీలైనంత త్వరగా తెలియజేయడానికి ప్రయత్నించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banking, Banking news