ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవారికి (Cash Withdrawal) అలర్ట్. కొత్త ఏటీఎం ఛార్జీలు అమలులోకి రాబోతున్నాయి. సాధారణంగా బ్యాంకులు బ్యాంక్ అకౌంట్‌ను బట్టి ఏటీఎంలో ఫ్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ ఇస్తుంటాయి. బ్యాంకు ఖాతాను బట్టి ఈ లిమిట్ మారుతుంది. ఈ లిమిట్ దాటి కస్టమర్లు జరిపే ప్రతీ లావాదేవీపై (ATM Transaction) ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు అన్ని బ్యాంకుల్లో ఒకేలా ఉంటాయి. కస్టమర్ల సేవింగ్స్ అకౌంట్ (Savings Account) బ్యాలెన్స్ నుంచి ఈ ఛార్జీలను డెబిట్ చేస్తాయి బ్యాంకులు. ప్రస్తుతం ఈ ఛార్జీల వివరాలు చూస్తే ట్రాన్సాక్షన్ లిమిట్ దాటి ఏటీఎంలో జరిపే ప్రతీ లావాదేవీకి రూ.20 + జీఎస్‌టీ చొప్పున కస్టమర్లు చెల్లించాలి. కానీ జనవరి 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. 2022 జనవరి 1 నుంచి రూ.21 + జీఎస్‌టీ చొప్పున ఛార్జీలు చెల్లించాలి.
ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జీలు పెంచుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. 2022 జనవరి 1 నుంచి ఛార్జీలు పెంచుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. దీంతో జనవరి 1 నుంచి కొత్త ఛార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే పలు బ్యాంకులు ఈ ఛార్జీల గురించి కస్టమర్లకు సమాచారం ఇస్తున్నాయి. మంత్లీ లిమిట్ దాటేవారికే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. క్యాష్, నాన్ క్యాష్ ఏటీఎం లావాదేవీలకు ఈ ఛార్జీలు ఉంటాయి.
Business Idea: వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ ఐడియా మీకోసమే
ఇప్పటికే 2021 ఆగస్ట్ 1 నుంచి ఇంటర్‌ఛేంజ్ ఫీజును ఆర్‌బీఐ పెంచిన సంగతి తెలిసిందే. అంతకుముందు రూ.15 గా ఉన్న ఇంటర్‌ఛేంజ్ ఫీజు రూ.17 కి పెరిగింది. 2012 ఆగస్టు తర్వాత 2021 ఆగస్టులోనే ఇంటర్‌ఛేంజ్ ఫీజు పెరగడం విశేషం. ఉదాహరణకు మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్ అయితే మీరు ఎస్‌బీఐ కార్డుతో ఇతర బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే ఎస్‌బీఐ సదరు బ్యాంకుకు చెల్లించే ఛార్జీనే ఇంటర్‌ఛేంజ్ ఫీజు అంటారు.
LIC Alert: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి అలర్ట్... వెంటనే ఈ వివరాలు అప్‌డేట్ చేయండి
అంటే ఒక బ్యాంకు ఏటీఎంలో మరో బ్యాంకు కస్టమర్ లావాదేవీలు జరిపితేనే ఇంటర్‌ఛేంజ్ ఫీజు వర్తిస్తుంది. ఈ ఫీజు రూ.15 నుంచి రూ.17 కి పెరిగింది. ఇంటర్ ఛేంజ్ ఫీజు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.15 నుంచి రూ.17 కి, నాన్ ఫైనన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.5 నుంచి రూ.6 కి పెరిగింది. 2022 జనవరి 1 నుంచి కస్టమర్లు చెల్లించే ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫీజు పెరగనుంది. ఇంటర్ ఛేంజ్ ఫీజు పెరగడంతో పాటు నిర్వహణ ఖర్చులు పెరగడంతో బ్యాంకులు ఏటీఎం ఛార్జీలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
సాధారణంగా బ్యాంకులు కస్టమర్ తీసుకున్న అకౌంట్‌ను బట్టి ప్రతీ నెలా ఏటీఎంలో నాలుగు లేదా ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ లిమిట్‌ను ఇస్తాయి. ఇందులోనే ఫైనాన్షియల్ అంటే నగదు విత్‌డ్రా చేయడం, నాన్ ఫైనాన్షియల్ అంటే బ్యాలెన్స్ చెక్ చేయడం, ఇతర సేవల్ని ఉపయోగించడం లాంటివి కవర్ అవుతాయి. ఇచ్చిన లిమిట్ దాటి ఏటీఎంలో ట్రాన్సాక్షన్ జరిపితే ప్రతీ లావాదేవీకి జనవరి 1 నుంచి రూ.21 చొప్పున ఛార్జీ చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ATM, Atm centre, Atm withdrawal, Banking, Personal Finance