Home /News /business /

ALERT FOR BANK CUSTOMERS BANKS WILL CLOSE FOR 7 DAYS FROM MARCH 26 TO APRIL 5 IN TELANGANA AND ANDHRA PRADESH SS

Bank Holidays: ఖాతాదారులకు గమనిక... 11 రోజుల్లో 7 రోజులు బ్యాంకులు బంద్

Bank Holidays: ఖాతాదారులకు గమనిక... 11 రోజుల్లో 7 రోజులు బ్యాంకులు బంద్
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays: ఖాతాదారులకు గమనిక... 11 రోజుల్లో 7 రోజులు బ్యాంకులు బంద్ (ప్రతీకాత్మక చిత్రం)

Bank Holidays | బ్యాంకు ఖాతాదారులకు గమనిక. రాబోయే రెండు వారాల్లో బ్యాంకులు ఏడు రోజులు తెరుచుకోవు. కాబట్టి ఈ సెలవుల్ని దృష్టిలో పెట్టుకొని మీ బ్యాంకింగ్ లావాదేవీలను ప్లాన్ చేసుకోండి.

    మీకు వచ్చే వారంలో ముఖ్యమైన బ్యాంకు పనులు (Banking Transactions) ఉన్నాయా? అయితే అలర్ట్. 9 రోజుల్లో 6 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 మధ్య బ్యాంకులు పనిచేసేది నాలుగు రోజులే. అందులో ఒక రోజు ఏప్రిల్ 1న ఇయర్లీ క్లోజింగ్ సందర్భంగా బ్యాంకు సేవలు (Banking Services) పూర్తిగా లభించవు. కాబట్టి 11 రోజుల్లో మూడు రోజులు మాత్రమే బ్యాంకు సేవలు లభిస్తాయి. సాధారణ సెలవులు, ఇతర సెలవులతో పాటు బ్యాంకుల సమ్మె ఉండటంతో వరుసగా బ్యాంకులు తెరుచుకోని పరిస్థితి ఉంది. మరి బ్యాంకులు ఏఏ రోజుల్లో పనిచేస్తాయి? ఏఏ రోజుల్లో తెరుచుకోవు? మీ ఆర్థిక లావాదేవీలు ఎలా ప్లాన్ చేసుకోవాలి? తెలుసుకోండి.

    బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవంటే...


    మార్చి 26- నాలుగో శనివారం
    మార్చి 27- ఆదివారం
    మార్చి 28- బ్యాంకుల సమ్మె
    మార్చి 29- బ్యాంకుల సమ్మె
    ఏప్రిల్ 1- ఇయర్లీ క్లోజింగ్
    ఏప్రిల్ 2- ఉగాది
    ఏప్రిల్ 3- ఆదివారం
    ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి

    PAN Aadhaar Link: పాన్ ఆధార్ లింక్ చేయలేకపోతున్నారా? వివరాలు ఇలా సరిదిద్దుకోండి

    బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె, అంతకన్నా ముందు రెండు రోజులు సెలవులు ఉండటంతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకు సేవలు లభించే అవకాశం లేదు. ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులంతా ఆల్ ఇండియా స్ట్రైక్‌లో పాల్గొననున్నారు. బ్యాంకింగ్ రంగంలో ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీల విషయంలో అసంతృప్తిగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మె చేపడుతున్నారు.

    ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల సంఘం అయిన ఆల్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AICBEF), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) దేశవ్యాప్త సమ్మె ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23, 24 తేదీల్లో జరగాల్సిన సమ్మె కరోనా వైరస్ మహమ్మారి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమ్మెను వాయిదా పడింది. దీంతో మార్చి 28, 29 తేదీల్లో సమ్మెకు సిద్ధమయ్యారు బ్యాంకు ఉద్యోగులు.

    Post Office Scheme: ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.16 లక్షల రిటర్న్స్

    బ్యాంకు ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగుతున్నారు. బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021 ని వెనక్కి తీసుకోవడం, ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరణను ఆపడం, మొండి బకాయిల్ని రికవరీ చేయడం, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచడం, కస్టమర్లపై భారీ సర్వీస్ ఛార్జీలు తొలగించడం, ఐదు రోజుల పనిదినాలు, చైల్డ్ కేర్ లీవ్స్, నేషనల్ పెన్షన్ సిస్టమ్‌ను తొలగించడం, పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయడం, డియర్‌నెస్ అలవెన్స్‌లో క్రమరాహిత్యాన్ని తొలగించడం లాంటి డిమాండ్స్ ఉన్నాయి.

    బ్యాంకులు సమ్మెలో ఉన్నప్పుడు ఖాతాదారులకు బ్యాంకు బ్రాంచ్‌లో లభించే సేవలకు అంతరాయం కలుగుతుంది. అయితే డిజిటల్ పద్ధతిలో బ్యాంకింగ్ లావాదేవీలు చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాకింగ్, యూపీఐ, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Bank, Bank Holidays, Bank news, Banking, Banks strike, Personal Finance

    తదుపరి వార్తలు