హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Timings: కస్టమర్లకు అలర్ట్... బ్యాంక్ టైమింగ్స్ మారాయి

Bank Timings: కస్టమర్లకు అలర్ట్... బ్యాంక్ టైమింగ్స్ మారాయి

Bank Timings: కస్టమర్లకు అలర్ట్... బ్యాంక్ టైమింగ్స్ మారాయి
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Timings: కస్టమర్లకు అలర్ట్... బ్యాంక్ టైమింగ్స్ మారాయి (ప్రతీకాత్మక చిత్రం)

New Bank Timings | ఇకపై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల మధ్య పనిచేస్తాయి.

మీరు తరచూ బ్యాంకు లావాదేవీలు జరుపుతుంటారా? బ్యాంకులకు వెళ్లి ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారా? బ్యాంక్ టైమింగ్స్ మారాయి. అక్టోబర్ 1 నుంచే కొత్త వేళలు అమలులోకి వచ్చాయి. కస్టమర్లకు సేవల్ని మరింత సమర్థవంతంగా అందించేలా బ్యాంకు వేళల్ని మార్చాలన్న డిమాండ్లు ఎప్పట్నుంచో ఉన్నాయి. పలు వర్గాల నుంచి ఈ డిమాండ్లు రావడంతో ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన బ్యాంకింగ్ డివిజన్ బ్యాంకు వేళల్ని సమీక్షించే అంశంపై దృష్టిపెట్టింది. కస్టమర్లకు అనుకూలంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల వేళల్ని మార్చాలని నిర్ణయించింది. ఇదే విషయమై ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్‌లో ఓ సమావేశం నిర్వహించింది. కస్టమర్ల సౌలభ్యాన్ని బట్టి బ్యాంకు వేళలు ఉండాలని సూచించింది. అందుకు తగ్గట్టుగా వేళల్ని మార్చేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.

గతంలో ఇండియన్ బ్యాంక్ అసోసియేన్-IBA సమావేశమై మూడు వేళల్ని నిర్ణయించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లేదా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు లేదా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాంకు వేళల్ని సూచించింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశమై ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కస్టమర్లకు సేవలు అందించాలని నిర్ణయించాయి. ఇకపై అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి 4 గంటల మధ్య పనిచేస్తాయి. అక్టోబర్ 1 నుంచే కొత్త పనివేళలు అమలులోకి వచ్చాయి. కొత్త వేళలపై కస్టమర్లకు అవగాహన కల్పించనున్నాయి బ్యాంకులు.

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Best TVs: ఆన్‌లైన్‌లో టీవీ కొంటున్నారా? ఫెస్టివల్ సేల్‌లో 12 బెస్ట్ టీవీలు ఇవే...

Dussehra Sale: మీకు సెల్ఫీలు ఇష్టమా? దసరా సేల్‌లో ఈ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌పై ఆఫర్స్

SBI offer: ఎస్‌బీఐ కార్డు ఉందా? అమెజాన్ సేల్‌లో రూ.10,000 బెనిఫిట్స్ పొందండి ఇలా

First published:

Tags: Allahabad Bank, Andhra bank, Bank, Bank of Baroda, Banking, Canara Bank, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు