Home /News /business /

ALERT FOR ATM USERS RESERVE BANK OF INDIA RAISES ATM TRANSACTION CHARGES KNOW NEW FEES SS

ATM Charges: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే మీకు షాకే

ATM Charges: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే మీకు షాకే
(ప్రతీకాత్మక చిత్రం)

ATM Charges: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే మీకు షాకే (ప్రతీకాత్మక చిత్రం)

ATM Charges | ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవారికి అలర్ట్. ఏటీఎంలో క్యాష్, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు పెరిగాయి.

    ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI షాక్ ఇచ్చింది. ఏటీఎం ఛార్జీలను పెంచి కస్టమర్ల జేబుకు చిల్లు పెట్టింది ఆర్‌బీఐ. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసినా, ఇతర సేవలు ఉపయోగించినా కొన్నిసార్లే ఉచితం. అంటే ఫ్రీ లిమిట్ దాటిన తర్వాత ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు కేటాయించిన లిమిట్ కన్నా ఎక్కువ సార్లు డబ్బులు డ్రా చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని తెలుసు. ఈ ఛార్జీలను పెంచుతున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఏటీఎంలో క్యాష్ ట్రాన్సక్షన్స్ మాత్రమే కాదు... నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్‌ ఛార్జీలు కూడా పెరిగాయి. ఒక నెలలో ఉచిత లావాదేవీల కన్నా ఎక్కువ సార్లు ఏటీఎంలో ట్రాన్సాక్షన్ చేస్తే ప్రతీ లావాదేవీకి ప్రస్తుతం రూ.20 చెల్లిస్తున్నారు కస్టమర్లు. ఈ ఛార్జీలను రూ.21 కి పెంచింది ఆర్‌బీఐ. పెరిగిన ఛార్జీలు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తాయి. దీంతో పాటు ఏటీఎం లావాదేవీల ఇంటర్‌చేంజ్ ఫీజు కూడా పెంచింది ఆర్‌బీఐ. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఛార్జీని రూ.15 నుంచి రూ.17 కి, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఛార్జీని రూ.5 నుంచి రూ.6 కి పెంచింది. ఈ ఛార్జీలు 2021 ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తాయి.

    Aadhaar Charges: ఆధార్ సెంటర్‌లో ఎక్కువ డబ్బులు అడిగారా? ఫిర్యాదు చేయండి ఇలా

    SBI Mobile Number Change: ఎస్‌బీఐ అకౌంట్‌లో మొబైల్ నెంబర్ ఇలా మార్చండి

    ఏటీఎంలో ఇంటర్‌ఛేంజ్ ఫీజ్ చివరిసారిగా 2012 ఆగస్టులో మారాయి. కస్టమర్లు చెల్లించే ఛార్జీలు 2014 ఆగస్టులో అమలులోకి వచ్చాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. చాలాకాలం అయింది కాబట్టి ఛార్జీలు పెంచుతున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఏటీఎంల ఏర్పాటు, మెయింటనెన్స్ కోసం ఛార్జీలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఆర్‌బీఐ. ఈ ఛార్జీలు పెంచడం కోసం ఆర్‌బీఐ 2019 జూన్‌లోనే కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2020 జూలైలో సిఫార్సులు ఇచ్చింది. కమిటీ సిఫార్సులను పరిశీలించిన తర్వాత ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

    SBI Salary Account: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? ఈ బెనిఫిట్స్ మీకోసమే

    EPF Withdrawal: ఈపీఎఫ్ ఖాతాలో రెండోసారి కోవిడ్ అడ్వాన్స్ తీసుకోండి ఇలా

    ప్రస్తుతం కస్టమర్లకు సొంత బ్యాంకు ఏటీఎంలల్లో మొత్తం 5 ట్రాన్సాక్షన్స్ ఉచితం. మెట్రోల్లో అయితే ఇతర బ్యాంకు ఏటీఎంలల్లో మూడు ట్రాన్సాక్షన్స్ ఉచితం. నాన్ మెట్రోల్లో ఐదు లావాదేవీలు ఉచితం. ఇందులో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే డబ్బులు డ్రా చేయడం మాత్రమే కాదు బ్యాలెన్స్ చెక్ చేయడం లాంటి ఇతర సేవలు కూడా కలిపే ఉంటాయి. ఈ ఉచిత ట్రాన్సాక్షన్స్‌లో ఎలాంటి మార్పు లేదని ఆర్‌బీఐ ప్రకటించింది. అంతకన్నా ఎక్కువ సార్లు లావాదేవీలు జరిపితే ఛార్జీలు చెల్లించకతప్పదు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: ATM, Atm Card, Atm centre, Atm withdrawal, Personal Finance, Rbi, Reserve Bank of India

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు