అటల్ పెన్షన్ యోజన... అసంఘటిత రంగాలకు చెందిన కార్మికుల కోసం 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ పథకం. అటల్ పెన్షన్ యోజన అకౌంట్ ఉన్నవాళ్లంతా ప్రభుత్వం వాటా జమ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలని నేషనల్ పెన్షన్ సిస్టమ్స్-NPS కోరుతోంది. 2015 నుంచి 2015-16, 2016-17 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు చెందిన ప్రభుత్వ వాటాకు సంబంధించిన వివరాలను పరిశీలించాలని ఎన్పీఎస్ సూచిస్తోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ-PFRDA పలు దఫాలుగా ప్రభుత్వ వాటాను అటల్ పెన్షన్ యోజన అకౌంట్లకు జమ చేసిందని, ఈ స్కీమ్ సబ్స్క్రైబర్లు అందరూ తమతమ అకౌంట్లలో ప్రభుత్వ వాటా జమ అయిందో లేదో చూసుకోవాలని నేషనల్ పెన్షన్ సిస్టమ్స్ ట్రస్ట్ కోరింది. ఒకవేళ అర్హుల అకౌంట్లోకి ప్రభుత్వ వాటా జమ కాకపోతే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్-PRAN, ఇతర వివరాలతో grievances@npstrust.org.in ఇమెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయొచ్చు.
అటల్ పెన్షన్ యోజన 2015లో ప్రారంభమైంది. ఈ పథకంలో ఎవరైనా చేరొచ్చు. నెలనెలా పెన్షన్ పథకంలో జమ చేయొచ్చు. అటల్ పెన్షన్ యోజన కింద సబ్స్క్రైబర్లు ఏటా రూ.1000 జమ చేస్తే ప్రభుత్వం కూడా తమ వాటాను రూ.1000 అకౌంట్లో జమ చేస్తుంది. కానీ అర్హులకు మాత్రమే ప్రభుత్వం సమాన వాటాను చెల్లిస్తుంది. ఈపీఎఫ్, ఇతర పెన్షన్ స్కీమ్ లాంటి చట్టబద్ధమైన సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి రానివారికే ఇది వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వ వాటా లభించదు. 2015 జూన్ 1 నుంచి 2016 మార్చి 31 మధ్య అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారిలో అర్హులకు ఐదేళ్లు ప్రభుత్వ వాటా జమ అవుతుంది.
అదిరిపోయే ఫీచర్లతో రిలీజైన వివో జెడ్1ఎక్స్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Post Office Scheme: ప్రతీ నెలా ఆదాయం కావాలా? ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి
JioFiber: రూ.699 నుంచి జియోఫైబర్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.