ఆధార్ కార్డ్ హోల్డర్లు 10 ఏళ్లకోసారి తమ ఆధార్ వివరాలు అప్డేట్ (Aadhaar Update) చేయడం తప్పనిసరా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనా? దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆధార్ కార్డ్ అప్డేట్ (Aadhaar Card Update) విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతుండటంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. 10 ఏళ్లకోసారి ఆధార్ వివరాలు తప్పనిసరిగా అప్డేట్ చేయాలని వస్తున్న వార్తలు అవాస్తవని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ తెలిపింది. ఈ వార్తల్ని, సోషల్ మీడియా పోస్టుల్ని పట్టించుకోవద్దని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.
అయితే ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ వివరాలను అప్డేట్ చేయాలని ప్రోత్సహిస్తూ ఇటీవల యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) గతంలో ఓ పత్రికా ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్లు పూర్తైన తర్వాత తమ వివరాలను అప్డేట్ చేస్తే మంచిది అన్నట్టుగా గెజిట్ నోటిఫికేషన్లో ఉంది. అంతే తప్ప, తప్పనిసరిగా ఆధార్ వివరాలను అప్డేట్ చేయాలన్న షరతు ఏమీ లేదు.
SBI Alert: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్... మీకు ఆ మెసేజ్ వస్తే జాగ్రత్త
Attention: #Aadhaar holders are encouraged to get their documents updated which helps in ease of living, better service delivery & also enables accurate authentication. Residents “may” do so on completion of every 10 years & is not #mandatory. Release: https://t.co/gvL2tyzMUu
— Aadhaar (@UIDAI) November 10, 2022
ఆధార్ కార్డ్ ఉన్నవారు తమ వివరాలను అప్డేట్ చేయాలా వద్దా అన్నది వాళ్ల ఇష్టం. ఇది స్వచ్ఛందం. తప్పనిసరి అన్న నిబంధన ఏమీ లేదు. కానీ ఆధార్ తప్పనిసరిగా అప్డేట్ చేయాలని ప్రచారం జరుగుతుండటంతో గందరగోళం నెలకొంది. అయితే ఆధార్ కార్డు తీసుకొని 10 ఏళ్లు పూర్తైనవాళ్లు, ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా వివరాలు అప్డేట్ చేయకపోతే, డీటెయిల్స్ అప్డేట్ చేయమని మాత్రమే UIDAI ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం అనేక ప్రభుత్వ పథకాలకు, సేవలకు ఆధార్ నెంబర్ తప్పనిసరి కాబట్టి ఆధార్ కార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం మంచిది. మరి ఆధార్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకోండి.
Step 1- ముందుగా https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 3- Online Update Services పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.
Step 5- Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
Step 6- పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- మీ వివరాలు అప్డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
Step 8- పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి.
Business Loan: బిజినెస్ చేస్తారా? రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్న ఎస్బీఐ
ఎంఆధార్ యాప్‌లో కూడా దాదాపు ఇవే స్టెప్స్‌తో పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ అప్డేట్ చేయొచ్చు. ఈ నాలుగు కాకుండా మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, ఫింగర్‌ప్రింట్, ఫోటో లాంటి వివరాలు అప్డేట్ చేయాలంటే ఆధార్ సెంటర్‌కు వెళ్లాలి. మీరు ఆధార్ కార్డ్ తీసుకొని 10 ఏళ్లు పూర్తై, మధ్యలో ఒక్కసారి కూడా ఈ వివరాలు అప్డేట్ చేయనట్టైతే ఆధార్ అప్డేట్ చేయాలి.
ఇక పిల్లల విషయానికి వస్తే మీ పిల్లలకు ఐదేళ్ల లోపు వయస్సు ఉన్నప్పుడు ఆధార్ ఎన్రోల్ చేయించినట్టైతే రెండుసార్లు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేయాలి. పిల్లల వయస్సు 5 ఏళ్లు పూర్తైనప్పుడు ఓసారి, 15 ఏళ్లు పూర్తైనప్పుడు మరోసారి ఆధార్ అప్డేట్ చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, UIDAI