Home /News /business /

ALERT FOR AADHAAR CARD HOLDERS UIDAI STOPS ADDRESS VALIDATION LETTER AND AADHAAR REPRINT SERVICES SS

Aadhaar Card Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... ఆ రెండు సేవల్ని నిలిపేసిన UIDAI

Aadhaar Card Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... ఆ రెండు సేవల్ని నిలిపేసిన UIDAI
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... ఆ రెండు సేవల్ని నిలిపేసిన UIDAI (ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Card Services | ఆధార్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఇటీవల రెండు సేవల్ని నిలిపివేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

    ప్రస్తుత పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ ప్రతీ ఒక్కరికీ అవసరమైన డాక్యుమెంట్. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్‌గా వాడుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు పొందడానికి ఈ డాక్యుమెంట్ చాలా ముఖ్యమైపోయింది. అయితే ఇటీవల ఆధార్ కార్డుకు సంబంధించిన రెండు సేవల్ని యూఐడీఏఐ నిలిపివేయడం ఆధార్ కార్డ్ హోల్డర్లకు ఇబ్బందిగా మారింది. ఆధార్ కార్డులో అడ్రస్ మార్చాలన్నా, అప్‌డేట్ చేయాలన్నా అడ్రస్ ప్రూఫ్ అవసరం. అడ్రస్ ప్రూఫ్ లేకపోతే అడ్రస్ వేలిడేషన్ లెటర్ ద్వారా అడ్రస్ అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉండేది. సొంతూరు నుంచి ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి అద్దెకు ఉన్నవారు, అక్కడ స్థానికంగా ఉన్నట్టు అడ్రస్ ప్రూఫ్ ఉండదు. వాళ్లు తమ ఆధార్ కార్డులో అడ్రస్ అప్‌డేట్ చేయడానికి అడ్రస్ వేలిడేషన్ లెటర్ ఉపయోగపడేది. ఇటీవల ఈ సదుపాయాన్ని తొలగించింది యూఐడీఏఐ. ఆధార్ వెబ్‌సైట్ నుంచి అడ్రస్ వేలిడేషన్ లెటర్ జారీని నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు అడ్రస్ వేలిడేషన్ లెటర్ జారీని నిలిపివేసినట్టు యూఐడీఏఐ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

    Aadhaar Bank Link: మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందా? తెలుసుకోండి ఇలా

    PAN Aadhaar Link Status: గతంలో పాన్, ఆధార్ లింక్ చేశారా? ఓసారి స్టేటస్ చెక్ చేయండి ఇలా


    అడ్రస్ వేలిడేషన్ లెటర్‌తో పాటు ఆధార్ కార్డ్ రీప్రింట్ సర్వీస్‌ను కూడా యూఐడీఏఐ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇందుకు బదులుగా యూఐడీఏఐ పీవీసీ ఆధార్ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. పీవీసీ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ సైజులో ఉంటుంది. ఆధార్ కార్డు హోల్డర్లు సులువుగా ఈ కార్డ్ ప్రింట్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Aadhaar Verification: ఆధార్ వెరిఫికేషన్ చేయాలా? ఈ కొత్త సర్వీస్ వాడుకోండి

    Aadhaar Card: ఇంటర్నెట్ లేకపోయినా ఈ ఆధార్ సేవలు పొందొచ్చు

    ఇక ఆధార్ కార్డు హోల్డర్స్ అడ్రస్ అప్‌డేట్ చేయాలంటే ప్రస్తుతం తప్పనిసరిగా అడ్రస్ ప్రూఫ్ కావాల్సిందే. ఇందుకోసం 45 రకాల డాక్యుమెంట్స్‌ని అడ్రస్ ప్రూఫ్‌గా స్వీకరిస్తుంది యూఐడీఏఐ. అడ్రస్ మార్పు కోసం ఇవ్వాల్సిన 45 రకాల డాక్యుమెంట్స్ వివరాలు ఇవే.

    1. పాస్‌పోర్ట్
    2. బ్యాంక్ స్టేట్‌మెంట్ / పాస్‌బుక్
    3. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ స్టేట్‌మెంట్ / పాస్‌బుక్
    4. రేషన్ కార్డ్
    5. ఓటర్ ఐడీ
    6. డ్రైవింగ్ లైసెన్స్
    7. ప్రభుత్వ ఫోటో ఐడీ / ప్రభుత్వ రంగ సంస్థ ఐడెంటిటీ కార్డ్
    8. ఎలక్ట్రిసిటీ బిల్ (గత మూడు నెలల లోపు)
    9. వాటర్ బిల్ (గత మూడు నెలల లోపు)
    10. టెలిఫోన్ ల్యాండ్‌లైన్ బిల్ (గత మూడు నెలల లోపు)
    11. ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ (గత ఏడాది లోపు)
    12. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ (గత మూడు నెలల లోపు)
    13. ఇన్స్యూరెన్స్ పాలసీ
    14. ఫోటోతో బ్యాంక్ లెటర్‌హెడ్‌
    15. ఫోటోతో రిజిస్టర్డ్ కంపెనీ లెటర్‌హెడ్
    16. ఫోటోతో గుర్తింపు పొందిన విద్యాసంస్థ లెటర్‌హెడ్ లేదా గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన ఫోటో ఐడీ అడ్రస్‌తో ఉండాలి.
    17. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్
    18. ఆయుధాల లైసెన్స్
    19. పెన్షనర్ కార్డ్
    20. ఫ్రీడమ్ ఫైటర్ కార్డ్
    21. కిసాన్ పాస్ బుక్
    22. CGHS/ ECHS కార్డ్
    23. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గెజిటెడ్ ఆఫీసర్, తహసీల్దార్ యూఐడీఏఐ ఫార్మాట్‌లో జారీ చేసిన సర్టిఫికెట్ ఆఫ్ అడ్రస్ ఫోటోతో ఉండాలి.
    24. విలేజ్ పంచాయతీ అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్ ఆఫ్ అడ్రస్.
    25. ఇన్‌కమ్ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆర్డర్.
    26. వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
    27. రిజిస్టర్డ్ సేల్, లీజ్, రెంట్ అగ్రిమెంట్.
    28. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ జారీ చేసిన అడ్రస్ కార్డ్ (పేరు, ఫోటో ఉండాలి)
    29. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన క్యాస్ట్ లేదా స్థిర నివాస ధృవీకరణ పత్రం.
    30. వికలాంగుల ఐడీ కార్డ్, హ్యాండీక్యాప్డ్ మెడికల్ సర్టిఫికెట్.
    31. గ్యాస్ కనెక్షన్ బిల్ (గత మూడు నెలల లోపు)
    32. జీవిత భాగస్వామి పాస్‌పోర్ట్
    33. మైనర్ అయితే తల్లిదండ్రుల పాస్‌పోర్ట్
    34. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అకామడేషన్ అలాట్‌మెంట్ లెటర్. (గత మూడేళ్ల లోపు)
    35. ప్రభుత్వం జారీ చేసిన మ్యారేజ్ సర్టిఫికెట్ అడ్రస్‌తో ఉండాలి.
    36. భామాషా కార్డ్
    37. గుర్తింపు పొందిన షెల్టర్ హోమ్స్, అనాథాశ్రమాల అధికారి, సూపరింటెండెంట్, వార్డన్, మేట్రన్ జారీ చేసిన సర్టిఫికెట్. యూఐడీఏఐ ఫార్మాట్‌లో ఉండాలి
    38. యూఐడీఏఐ ఫార్మాట్‌లో మున్సిపల్ కౌన్సిలర్ జారీ చేసిన అడ్రస్ సర్టిఫికెట్.
    39. గుర్తింపు పొందిన విద్యాసంస్థల ఐడీ కార్డ్.
    40. ఫోటోతో ఉన్న ఎస్ఎస్ఎల్‌సీ బుక్.
    41. స్కూల్ ఐడీ కార్డ్.
    42. స్కూల్ టీసీ పేరు అడ్రస్‌తో ఉండాలి.
    43. స్కూల్ హెడ్ మాస్టర్ జారీ చేసిన స్కూల్ రికార్డులు. పేరు, ఫోటో ఉండాలి.
    44. యూఐడీఏఐ ఫార్మాట్‌లో గుర్తింపు పొందిన విద్యాసంస్థ జారీ చేసిన ఫోటో ఐడెంటిటీ కార్డు. విద్యాసంస్థ అధినేత సంతకం ఉండాలి.
    45. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO యూఐడీఏఐ స్టాండర్డ్ సర్టిఫికెట్ ఫార్మాట్‌లో పేరు, పుట్టిన తేదీ, ఫోటోగ్రాఫ్‌తో జారీ చేసిన ఐడెంటిటీ కార్డ్.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, AADHAR, UIDAI

    తదుపరి వార్తలు