హోమ్ /వార్తలు /బిజినెస్ /

Alert: కేవైసీ పూర్తి కాలేదా? మీ ఇ-వ్యాలెట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

Alert: కేవైసీ పూర్తి కాలేదా? మీ ఇ-వ్యాలెట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

Alert: కేవైసీ పూర్తి కాలేదా? మీ ఇ-వ్యాలెట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

Alert: కేవైసీ పూర్తి కాలేదా? మీ ఇ-వ్యాలెట్ బ్లాక్ అవుతుంది జాగ్రత్త

ఆర్‌బీఐ నియమనిబంధనలకు అనుగుణంగా కంపెనీలు నడుచుకోనందున లక్షలాది మొబైల్ వ్యాలెట్స్ ఆగిపోనున్నాయి. 80 శాతం మంది డిజిటల్ వ్యాలెట్ యూజర్లు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయలేదు.

    మీరు పేమెంట్స్, రీఛార్జుల కోసం ఇ-వ్యాలెట్స్ ఉపయోగిస్తుంటారా? అయితే ఫిబ్రవరిలో పలు ఇ-వ్యాలెట్లు నిలిచిపోనున్నాయి. యూజర్ డేటా వెరిఫికేషన్ విషయంలో ఆర్‌బీఐ నియమనిబంధనలకు అనుగుణంగా కంపెనీలు నడుచుకోనందున లక్షలాది మొబైల్ వ్యాలెట్స్ ఆగిపోనున్నాయి. 80 శాతం మంది డిజిటల్ వ్యాలెట్ యూజర్లు కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయలేదు. కేవలం ఓటీపీ వెరిఫికేషన్ మాత్రమే పూర్తి చేసి వ్యాలెట్ సేవలు ఉపయోగిస్తున్నారు. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేసి కేవైసీ పూర్తి చేయనందున ఇ-వ్యాలెట్ సేవలు ఆగిపోయే అవకాశముంది. కేవైసీ ప్రక్రియలో భాగంగా ఇ-వ్యాలెట్ సంస్థలు ఇప్పటికే యూజర్ల ఆధార్ నెంబర్లు తీసుకున్నాయి. కానీ ప్రైవేట్ సంస్థలు కేవైసీ కోసం ఆధార్‌ని ఉపయోగించకూడదంటూ సుప్రీం కోర్టు ఆధార్ తీర్పులో తేల్చి చెప్పింది.


    Read This: Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...


    పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇ-వ్యాలెట్ల వినియోగం బాగా పెరిగిపోయిందని ఆర్‌బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లోనే యూపీఐ ద్వారా 62 కోట్ల లావాదేవీలు జరిగాయని అంచనా. అయితే ఇప్పుడు కేవైసీ పూర్తి చేయని వ్యాలెట్లలో లావాదేవీలు ఫిబ్రవరి నెలాఖరులోగా నిలిచిపోతాయన్న వార్తలు ఇ-వ్యాలెట్ సంస్థల్ని కలవరపరుస్తున్నాయి. కేవైసీకి ప్రత్యామ్నాయ మార్గాలు, గడువు పొడిగింపుపై ఆర్‌బీఐతో పలుమార్లు చర్చించినా ఫలితం లేదన్నది ఆయా సంస్థల వాదన.


    Read This: గెలాక్సీ ఎం10, ఎం20 రిలీజ్ చేసిన సాంసంగ్


    కేవైసీ పూర్తి కాని యూజర్ల అకౌంట్లు నిలిచిపోతే తమ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని కోట్లల్లో యూజర్లు ఉన్న పేటీఎం, అమెజాన్ లాంటి సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. అందుకే అమెజాన్ అయితే తమ ఉద్యోగుల్ని యూజర్ల దగ్గరకు పంపి మరీ కేవైసీ పూర్తి చేయిస్తోంది. కేవలం యూపీఐపై దృష్టి పెట్టిన ఫోన్‌పే లాంటి వ్యాలెట్ సంస్థలకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదు.


    Photos: మహాత్మాగాంధీ వర్ధంతి... మీరు చూడని జాతిపిత అరుదైన 100 చిత్రాలు ఇవే...


    ఇవి కూడా చదవండి:


    మొబైల్ యాప్స్‌తో లోన్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు


    Discount on Gold: బంగారంపై 10% డిస్కౌంట్... కొనేందుకు మీరు రెడీనా?


    XIAOMI MI Days Sale: రెడ్‌మీ, పోకో ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించిన షావోమీ

    First published:

    Tags: AMAZON PAY, E-wallet, MI PAY, Paytm

    ఉత్తమ కథలు