సాధారణంగానే భారతదేశ ప్రజలు బంగారం(Gold) ఎక్కువగా ఇష్టపడతారు. అయితే భారతదేశంలో అక్షయ తృతీయ రోజును బంగారం కొనుగోలు చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి పవిత్రదినంగా భావిస్తారు. ఆ రోజు ఎక్కువ మంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సాంప్రదాయ భారతీయ గృహాలలో, బంగారం ఇప్పటికీ ఉత్తమమైన, సురక్షితమైన పెట్టుబడిగా ఉంది. గోల్డ్‌ను ఆభరణాలు, నాణేల రూపంలో కొనేందుకు చాలామంది మొగ్గు చూపుతారు. అయితే ఈ అక్షయ తృతీయ(Akshaya Tritiya) సమయంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, లేదా డిజిటల్ బంగారం(Digital Gold). ఫిజికల్ గోల్డ్(Physical Gold), గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు(Gold ETF) లేదా డిజిటల్ గోల్డ్‌పై(Digital Gold) వేర్వేరుగా పన్ను ఉంటుందని గమనించాలి. అసెట్‌ను కొనుగోలు చేస్తే బంగారంపై ఎంత పన్ను చెల్లించాలో తెలుసుకోండి.
* ఫిజికల్ గోల్డ్ ట్యాక్స్
అక్షయ తృతీయకు బంగారం కొనాలనుకునే భారతీయులకు ఇది గొప్ప రోజు. అత్యంత సాధారణ రూపమైన ఫిజికల్ గోల్డ్ కొనుగోలు సమయంలో 3 శాతం GST (వస్తువులు, సేవా పన్ను) చెల్లించాలి. ఇది కాకుండా ఫిజికల్ గోల్డ్ విక్రయించేటప్పుడు కూడా పన్నులు ఉంటాయి. క్లియర్ వ్యవస్థాపకుడు, CEO అర్చిత్ గుప్తా మాట్లాడుతూ.. ‘బంగారం (బులియన్, నాణేలు, ఆభరణాలు), డిజిటల్ బంగారం (ఇ-వాలెట్లు, బ్రోకర్ల ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం) వంటి ఫిజికల్ గోల్డ్‌పై పన్ను విధించడం అనేది పెట్టుబడి హోల్డింగ్ వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. కొనుగోలు చేసిన మూడు సంవత్సరాలలోపు బంగారాన్ని విక్రయిస్తే, స్వల్పకాలిక మూలధన లాభాలు (STCG) వస్తాయి. ఆదాయ పన్ను స్లాబ్ రేట్ల ప్రకారం పన్ను విధిస్తారు. మూడేళ్ల పెట్టుబడి తర్వాత అటువంటి బంగారాన్ని విక్రయించడంపై ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20.8 శాతం (సెస్‌తో సహా) పన్ను విధిస్తారు.’ అని చెప్పారు.
* డిజిటల్ గోల్డ్ ట్యాక్స్
ట్రేడ్‌స్మార్ట్ చైర్మన్ విజయ్ సింఘానియా మాట్లాడుతూ..‘డిజిటల్ బంగారం విషయంలో, 3 సంవత్సరాల కంటే తక్కువ హోల్డింగ్‌కు పన్నులు లేవు. డిజిటల్ బంగారంపై స్వల్పకాలిక పన్ను లేదు. డిజిటల్ గోల్డ్‌ను పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్‌పే తో సహా ఇతర డిజిటల్ వాలెట్లలో కొనుగోలు చేయవచ్చు. ధర రూ. 1 నుండి ప్రారంభమవుతుంది. డిజిటల్ గోల్డ్‌ను ఎక్కువ కాలం హోల్డ్ చేస్తే ఫిజికల్ గోల్డ్‌కు సమానమైన పన్ను విధిస్తారు. అంటే పన్ను 20 శాతం, దాని పైన 4 శాతం సెస్ ఉంటుంది’ అని తెలిపారు.
* గోల్డ్ ఈటీఎఫ్, సావరిన్ గోల్డ్ బాండ్‌లపై పన్ను
బంగారానికి పేపర్ గోల్డ్ అని మరో రూపం ఉందని అర్చిత్ గుప్తా చెప్పారు. పేపర్ గోల్డ్‌లో గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లు, సావరిన్ గోల్డ్ బాండ్‌లు ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా వీటిపై కూడా ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతున్నారు. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లపై ఫిజికల్ గోల్డ్ తరహాలోనే పన్నులు విధిస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్‌లు పన్ను నియమాలను కలిగి ఉన్నాయి. అర్ధ వార్షిక వడ్డీ తరహాలో ఏడాదికి 2.5 శాతం ఉంటుంది. సంవత్సరంలో ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయంగా గోల్డ్‌బాండ్లపై పన్ను విధిస్తారు.
సావరిన్ గోల్డ్ బాండ్‌లకు ఎనిమిదేళ్ల మెచ్యూరిటీ వ్యవధి ఉంటుంది. మెచ్యూరిటీలో రీడీమ్ చేసుకొంటే మూలధన లాభాలపై పన్ను ఉండదు. అయితే ఇన్వెస్టర్లు ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య రీడీమ్ చేస్తే, 20.8 శాతం (సెస్‌తో సహా) పన్ను విధిస్తారు. అంతేకాకుండా పెట్టుబడిదారులు స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా గోల్డ్‌బాండ్‌లను కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. అటువంటి సందర్భాలలో స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మూడేళ్ల ముందు విక్రయిస్తే పెట్టుబడిదారుల ఆదాయానికి మూలధన లాభాలు ఉంటాయి. ఆదాయపు పన్ను స్లాబ్ రేట్ల ఆధారంగా పన్ను విధిస్తారు.
మూడు సంవత్సరాల తర్వాత స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో విక్రయిస్తే, అది దీర్ఘకాలిక మూలధన లాభం, ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం పన్ను విధిస్తారు. మార్కెట్ నిపుణులు గుప్తా మాట్లాడుతూ.. పెట్టుబడిదారులు పోర్ట్‌ఫోలియోలో 5-10 శాతాన్ని బంగారం పెట్టుబడుల వైపు మళ్లించాలి.. అక్షయ తృతీయ 2022 సందర్భంగా ఈ ప్రయాణం ప్రారంభించడానికి మంచి సమయం’అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshaya Tritiya, Gold, Gold tax, Income tax, Sovereign Gold Bond Scheme