భారతీయులకు, బంగారానికి విడదీయరాని బంధం ఉంటుంది. చిన్నచిన్న ఫంక్షన్ల నుంచి పెళ్లిళ్ల వరకు... ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే. భారతీయులకు బంగారం ఓ సెంటిమెంట్. అందుకే ఏ శుభకార్యమైనా ఎంతో కొంత గోల్డ్ కొంటూ ఉంటారు. 2 గ్రాముల బంగారం కొన్నా సరే శుభసూచకంగా భావిస్తుంటారు. అందుకే ధంతేరాస్, అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రత్యేక రోజుల్లో బంగారం కొంటే లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడమేనని విశ్వసిస్తుంటారు. ఏప్రిల్ 22న అక్షయ తృతీయ ఉంది. ఆ రోజున కూడా బంగారం అమ్మకాలు జోరుగా ఉండటం ఖాయం. అయితే గతేడాదితో పోలిస్తే బంగారం ధరలు (Gold Prices) భారీగా పెరిగాయి.
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు చూస్తే స్వచ్ఛమైన బంగారం ధర రూ.60,000 ధరకు, ఆభరణాల తయారీకి ఉపయోగించే గోల్డ్ ధర రూ.55,000 ధరకు లభిస్తోంది. 2022 నవంబర్ 4 నుంచి బంగారం ధరలు భారీగా పెరిగాయి. నవంబర్ 4న 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.46,100 ఉండగా ప్రస్తుతం రూ.55,000 ధరకు చేరుకుంది. ఇప్పటి వరకు 22 క్యారెట్ బంగారం ధర రూ.8,900 పెరిగింది. ఇక అదే రోజున 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.50,290 ఉండగా ప్రస్తుతం రూ.60,000 ధరకు చేరుకుంది. ఇప్పటి వరకు 22 క్యారెట్ బంగారం ధర రూ.9,710 పెరిగింది.
PAN Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ అయిందో లేదో సింపుల్‌గా చెక్ చేయండిలా
ప్రస్తుతం బంగారం ధరలు రూ.60,000 మార్క్‌ను టచ్ చేశాయి. గత వారం కూడా ఈ మార్క్ దాటిన బంగారం ధర కాస్త తగ్గింది. అయినా గత నాలుగైదు నెలలతో పోలిస్తే బంగారం ధరలు ఇప్పుడు భారీగా పెరిగాయి. బంగారం ధరలు ఇటీవల భారీగా పెరిగాయి. ఓవైపు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సహా ఇతర బ్యాంకుల్లో సంక్షోభం, మరోవైపు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతుండటంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. డిమాండ్ పెరగడంతో గోల్డ్ రేట్ భారీగా పెరుగుతోంది. ఏప్రిల్ 22న అక్షయ తృతీయ నాటికి బంగారం ధరలు ఎలా ఉంటాయన్న సందేహం పసిడిప్రేమికుల్లో ఉంది.
బంగారం ధరలు పెరగడానికి దేశీయ మార్కెట్లో డిమాండ్ ఒక్కటే కారణం కాదు. అంతర్జాతీయ పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తుంటాయి. కాబట్టి నెల రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అంచనాకు రావడం కష్టం. బంగారం ధరలు ఈ ఏడాది చివరిలోగా రూ.60,000 మార్క్‌ను దాటుతాయని గతంలో వార్తలొచ్చాయి. కానీ అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా ఇప్పుడే ఆ మార్క్‌ను గోల్డ్ రేట్ టచ్ చేసింది. కాబట్టి బంగారం ధరలు పెరుగుతాయా లేదా? ఎంత పెరుగుతాయి? అని అంచనా వేయడం కష్టమే.
LIC Policy: గుడ్ న్యూస్... ఎల్ఐసీ నుంచి రూ.3,500 వరకు డిస్కౌంట్ పొందండి ఇలా
బంగారం కొనాలనుకునేవారు ఒకేసారి పెద్దమొత్తంలో కొనకుండా విడతలవారీగా కొంటే బంగారం ధర, పెరిగినా, తగ్గినా ధర యావరేజ్ అవుతుంది. కాబట్టి అక్షయ తృతీయకు భారీ మొత్తంలో గోల్డ్ కొనే ఆలోచనలో ఉంటే మాత్రం ఇప్పుడే కొంత గోల్డ్ బుక్ చేసుకొని, అక్షయ తృతీయ రోజున డెలివరీ తీసుకోవచ్చు. మిగతా బంగారాన్ని అక్షయ తృతీయ రోజు కొనొచ్చు. అప్పట్లోగా ధర తగ్గితే మిగతా బంగారాన్ని తక్కువ ధరకే కొనొచ్చు. ఒకవేళ గోల్డ్ రేట్ పెరిగినట్టైతే ముందే కొంత బుక్ చేసుకుంటారు కాబట్టి కొంత ధర కలిసివస్తుంది. ధర యావరేజ్ అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshaya Tritiya, Gold Price Today, Gold Prices, Gold rates