హోమ్ /వార్తలు /బిజినెస్ /

Akshaya Tritiya 2021: కరోనా కారణంగా ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోతున్నారా? అయితే, ఇంట్లో నుంచే ఒక్క క్లిక్ తో కొనండిలా..

Akshaya Tritiya 2021: కరోనా కారణంగా ఈ అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోతున్నారా? అయితే, ఇంట్లో నుంచే ఒక్క క్లిక్ తో కొనండిలా..

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్ తో ఈ ఏడాది అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే.. ఇంట్లో నుంచే బంగారం కొనొచ్చు. తెలుసుకోండి.

అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం మన దేశంలో సంప్రదాయం గా వస్తుంది. ఈ రోజు బంగారం కొంటే శుభం కలుగుతుందని అనేక మంది భావిస్తూ ఉంటారు. అయితే.. కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ సారి బంగారం షాపులకు వెళ్లి కొనే పరిస్థితి లేదు. దీంతో ఈ సమయంలో అనేక మంది డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. వివిధ ప్లాట్ ఫామ్ ల ద్వారా డిజిటల్ గోల్డ్ ను మనం కొనుగోలు చేయవచ్చు. మన దేశంలో అనేక కంపెనీలు డిజిటల్ గోల్డ్ ను విక్రయిస్తున్నాయి. వీటితో పాటు ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థలు పేటిఎం, అమెజాన్ పే, గూగుల్ పే, ఫోన్ పే సంస్థలు కూడా డిజిట్ గోల్డ్ ను విక్రయిస్తున్నాయి. షాప్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఈ మొబైల్ యాప్ ల ద్వారా సులువుగా డిజిటల్ గోల్డ్ ను కొనుగోలు చేయొచ్చు. ఈ సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లపై అనేక ఆఫర్లను అందించడంతో వినియోగదారులు ఎగబడుతున్నారు.

పేటీఎం ద్వారా బంగారం ఎలా కొనాలంటే..

-ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం సులువుగా బంగారాన్ని కొనే అవకాశాన్ని కల్పిస్తోంది.

-99.99 శాతం ప్యూర్ గోల్డ్ ను మనం ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయొచ్చు.

-కనీసం రూ. 1 నుంచి రూ. 1,99,000 విలువగల గోల్డ్ ను పేటీఎం ద్వారా మనం బంగారం కొనుగోలు చేయొచ్చు.

-మీరు పేటీఎం ద్వారా కొనుగోలు చేసిన బంగారాన్ని పేటీఎం ప్లాట్ ఫాంలో ఐదేళ్ల వరకు భద్రపరుచుకోవచ్చు. స్టోరేజ్ ఛార్జీ ఏడాదికి రూ.0.04 శాతం ఉంటుంది.

-ఐదేళ్ల అనంతరం కూడా మీరు బంగారాన్ని అలానే కొనసాగించాలంటే అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

-అక్షయ తృతియ సందర్భంగా మీరు ఈ రోజు పేటియంలో బంగారం కొనుగోలు చేయాలంటే వెంటనే యాప్ ఓపెన్ చేసి Buy Gold ఆప్షన్ ను ఎంచుకోండి. అనంతరం మీకు కావాల్సినంత బంగారాన్ని ఎంచుకుని సింపుల్ గా కొనుగోలు చేయండి.

-ఈ రోజు కొనుగోలు చేసిన వారికి 3 శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందే ఆఫర్ కూడా ఉంది.

బంగారం ఎలా రిడీమ్ చేసుకోవాలంటే..

మీరు మీ బంగారాన్ని రిడీమ్ చేసుకోవాలంటే బ్యాంక్ ఖాతా, ఐఎఫ్ఎస్సీ వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. 72 గంటల్లో మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.

-ఒక వేళ మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని ఇంటికి డెలివరీ చేయాలంటే దాని పరిమాణం నిర్ధేశించినంతగా ఉండాలి.

-1,2,5,10 gm పరిమాణం ఉన్న కాయిన్స్ ను పేటీఎం మనకు డెలివరీ చేస్తుంది.

First published:

Tags: Akshaya Tritiya, AMAZON PAY, Digital Platform, Gold price, Google pay, Paytm

ఉత్తమ కథలు