Akshaya Tritiya: ఆన్‌లైన్‌లో నగలు కొంటున్నారా? అయితే ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Akshaya Tritiya: ఆన్‌లైన్‌లో నగలు కొంటున్నారా? అయితే ఈ టిప్స్ గుర్తుంచుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Akshaya Tritiya 2021 | ఈ అక్షయ తృతీయ రోజున మీరు ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ గుర్తుంచుకోండి.

  • Share this:
    కరోనా వైరస్ మహమ్మారి కొనసాగుతోంది. దాదాపు దేశమంతా లాక్‌డౌన్ ఉంది. అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో వ్యాపారాలన్నీ మూతపడ్డట్టే. మే 14 శుక్రవారం అక్షయ తృతీయ పర్వదినం వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే ఇంటికి మహాలక్ష్మిని తీసుకొచ్చినట్టేనన్న నమ్మకం చాలామందిలో ఉంది. కానీ ఈసారి అక్షయ తృతీయ రోజు లాక్‌డౌన్ కారణంగా నగల దుకాణాలు తెరుచుకునే పరిస్థితి లేదు. అందుకే ప్రముఖ నగల వ్యాపారులు అందరూ ఆన్‌లైన్‌లో బంగారు నగలను అమ్ముతున్నారు. అక్షయ తృతీయ రోజు నగలు నేరుగా కొన్నా, ఆన్‌లైన్‌లో కొన్నా బంగారం కొన్నట్టే. అందుకే ఆన్‌లైన్‌లో అయినా అక్షయ తృతీయ రోజున ఎంతోకొంత బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నవాళ్లు ఉన్నారు. మరి ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనొచ్చా? ఆన్‌లైన్‌లో నగలు కొంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? తెలుసుకోండి.

    వర్క్ ఫ్రమ్ హోమ్ బోర్ కొట్టిందా? Work From Hotel ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

    EPF Withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డ్రా చేయొచ్చో తెలుసుకోండి

    మీకు బంగారు నగలు, క్వాలిటీ, హాల్‌మార్క్ లాంటివాటిపై పూర్తిగా అవగాహన ఉందా? అయితే మీరు ఏమాత్రం సందేహం లేకుండా ఆన్‌లైన్‌లో నగలు కొనొచ్చు. ఆన్‌లైన్‌లో నగలు ఆర్డర్ చేసేముందు ఓసారి వివరాలన్నీ సరిగ్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఫోటో చూసి ఆర్డర్ చేయకుండా డిస్క్రిప్షన్‌లోని వివరాలన్నీ పూర్తిగా చదవాలి. నగల క్వాలిటీ హాల్‌మార్క్, మేకింగ్ ఛార్జీల వివరాలు తెలుసుకోవాలి. నగలు డెలివరీ అయిన తర్వాత అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో నగలు కొనాలనుకుంటే చాలా రకాల వెరైటీలు ఉంటాయి. షాపులో అయితే కొన్ని డిజైన్‌లు మాత్రమే చూపిస్తారు. కానీ ఆన్‌లైన్‌లో వందల సంఖ్యలో డిజైన్‌లు ఉంటాయి. వాటిలో మీకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన నగల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎంతైనా సమయం తీసుకోవచ్చు.

    Personal Loan: ఉద్యోగులకు రూ.4,00,000 వరకు లోన్... ఎలా తీసుకోవాలంటే

    Money Transfer: వేరే అకౌంట్‌లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇలా చేయండి

    ఆన్‌లైన్‌లో నగలు ఆర్డర్ చేసేముందు రిటర్న్, రీప్లేస్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి. రిటర్న్, రీప్లేస్ పాలసీ నియమనిబంధనలు పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలి. మీకు ఒకవేళ నగలు నచ్చకపోతే వెనక్కి పంపే అవకాశం ఉన్న నగల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం మంచిది. షాపులో అంటే మీరు నగల్ని స్వయంగా పరిశీలించే అవకాశం ఉంటుంది. కానీ ఆన్‌లైన్‌లో కేవలం ఫోటో చూసి మాత్రమే ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. అందుకే నగలు నచ్చకోతే రిటర్న్ చేసే వీలుందా లేదా అన్న విషయం చెక్ చేయాలి. డిస్కౌంట్స్, ఆఫర్స్ వివరాలు కూడా చెక్ చేయాలి. అక్షయ తృతీయ కాబట్టి నగల షాపులన్నీ ఆఫర్స్ అందిస్తాయి.

    ఆన్‌లైన్‌లో నగలు కొనడానికి ఏ వెబ్‌సైట్ కనిపిస్తే ఆ వెబ్‌సైట్ ఓపెన్ చేయొద్దు. నకిలీ సైట్లతో మోసపోయే అవకాశం ఉంటుంది. ప్రముఖ సంస్థలకు చెందిన వెబ్‌సైట్స్ మాత్రమే చెక్ చేయాలి. అవసరమైతే వారికి ఫోన్ చేసి సరైన వెబ్‌సైట్ అడ్రస్ కనుక్కోవాలి. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి సంస్థలు కూడా ఆన్‌లైన్‌లో నగల్ని అమ్ముతున్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published: