ఏప్రిల్ 26 ఆదివారం రోజు అక్షయ తృతీయ. మామూలుగా అయితే వారం రోజుల ముందు నుంచే నగల దుకాణాల్లో హడావుడి మొదలవుతుంది. ఆఫర్స్, డిస్కౌంట్స్, సేల్ పేరుతో జ్యువెలరీ షాపులు సందడి చేస్తుంటాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి అనేక ఆఫర్స్ ప్రకటిస్తుంటాయి. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా నగల షాపులు తెరుచుకునే పరిస్థితి లేదు. అయితే బడాబడా నగల దుకాణాలు ఆన్‌లైన్‌లో బంగారాన్ని అమ్ముతున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా సేల్స్ ప్రకటించాయి. మరి ఆన్‌లైన్‌లో బంగారంపై అక్షయ తృతీయ ఆఫర్స్ ఎలా ఉన్నాయో, ఏఏ సంస్థ ఎలాంటి సేల్ ప్రకటించాయో తెలుసుకోండి.
Sovereign Gold Bond: ప్రస్తుతం సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ 1 సబ్‌స్క్రిప్షన్ కొనసాగుతోంది. ఫిజికల్ గోల్డ్ వద్దు అనుకునేవారు బాండ్ రూపంలో బంగారాన్ని కొనొచ్చు. ఏప్రిల్ 24న సబ్‌స్క్రిప్షన్ క్లోజ్ అవుతుంది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Kalyan Jewellers: కళ్యాణ్ జ్యువెలర్స్ గోల్డ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్స్‌ని ఆన్‌లైన్‌లో అమ్ముతోంది. కస్టమర్లు ఆన్‌లైన్‌లో బంగారం కొంటే అక్షయ తృతీయ రోజున గోల్డ్ ఓనర్‌షిప్ సర్టిఫికెట్ ఇస్తుంది. అంటే ఎంత బంగారం కొంటే అంత వ్యాల్యూతో ఈ సర్టిఫికెట్ వస్తుంది. కాబట్టి కస్టమర్లు ఇంట్లో ఉన్నా బంగారం కొనొచ్చు.
Tanishq: తనిష్క్ జ్యువెలర్స్ కూడా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు ఉంటుంది. తనిష్క్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై బంగారం కొన్నవాళ్లు లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత స్టోర్‌కు వెళ్లి నగలు తీసుకోవచ్చు. లేదా డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంటుంది. వీడియో కాలింగ్, లైవ్ అసిస్టెడ్ ఛాట్ ద్వారా తనిష్క్ సిబ్బందిని కాంటాక్ట్ కావొచ్చు.
PNG Jewellers: పీఎన్‌జీ జ్యువెలర్స్ రెండు ఆన్‌లైన్ ఫెసిలిటీస్‌ని ప్రారంభించింది. వేధని ఇ-వోచర్స్ కొనొచ్చు. 1, 2, 5, 10 గ్రాముల ఇ-వోచర్స్ ఉంటాయి. లేదా ప్యూర్ ప్రైస్ ఆఫర్‌లో భాగంగా గోల్డ్ బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత డెలివరీ చేస్తారు.
PhonePe: ఫోన్‌పేలో సర్టిఫైడ్ 24 క్యారట్ గోల్డ్‌ని కొనొచ్చు. కస్టమర్లకు రూ.200 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఇందుకోసం MMTC-PAMP, సేఫ్ గోల్డ్‌తో ఒప్పందం చేసుకుంది ఫోన్‌పే.
Paytm Gold: పేటీఎం కూడా డిజిటల్ గోల్డ్‌ను అమ్ముతోంది. 24 క్యారట్ బంగారాన్ని డిజిటల్ ఫార్మాట్‌లో కొనొచ్చు. డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి. రూ.1 నుంచి రూ.1.5 లక్షల వరకు బంగారాన్ని కొనొచ్చు.
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
Online Gold: ఆన్‌లైన్‌లో బంగారు నగలు కొనొచ్చా? తెలుసుకోండి
EPF: రూ.15,000 లోపు జీతం ఉన్నవారికి త్వరలో గుడ్ న్యూస్?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.