Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఇలా మోసపోవద్దు

Akshaya Tritiya 2019 | నగల షాపుల యజమానులు మేకింగ్ ఛార్జీలు లేకుండా నగలను అమ్మడం ఏలా సాధ్యం? ఇది అస్సలు సాధ్యం కాదు. అయితే మీరు నగలకు చెల్లించే రేటులోనే మేకింగ్ ఛార్జీలు కూడా కలిపే ఉంటాయి. కాకపోతే కస్టమర్లను ఆకర్షించేందుకు మేకింగ్ ఛార్జీలు లేవు అని ప్రకటనలు ఇస్తుంటారు నగల షాపుల యజమానులు.

Santhosh Kumar S | news18-telugu
Updated: May 7, 2019, 9:05 AM IST
Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఇలా మోసపోవద్దు
Akshaya Tritiya: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఇలా మోసపోవద్దు (ప్రతీకాత్మక చిత్రం)
Santhosh Kumar S | news18-telugu
Updated: May 7, 2019, 9:05 AM IST
బంగారం... భారతీయులకు ఆభరణం మాత్రమే కాదు. లక్ష్మీదేవితో సమానం. బంగారాన్ని వస్తువుగా కాకుండా సెంటిమెంట్‌తో చూడటం అలవాటు. బంగారం భారతీయులకు అలంకరణప్రాయం మాత్రమే కాదు... పెట్టుబడి సాధనం కూడా. భారతదేశంలోని విభిన్న మతాల సంప్రదాయాలకు, బంగారానికి విడదీయరాని బంధం ఉంటుంది. ఏ చిన్న వేడుకైనా బంగారం కొనడం, బహుమతిగా ఇవ్వడం సంప్రదాయం. ఇక బంగారం కొనకుండా, కానుకగా ఇవ్వకుండా పెళ్లిళ్లు జరిగే ప్రసక్తే లేదు. బంగారాన్ని సెంటిమెంట్‌గా భావించే భారతీయులు... అక్షయ తృతీయ లాంటి శుభదినాల్లో పసిడిని సొంతం చేసుకునేందుకు పోటీపడుతుంటారు. ధర ఎక్కువైనా సరే కొంటూ ఉంటారు. అయితే బంగారం విషయంలో అనేక మోసాలు జరుగుతుంటాయన్నది వాస్తవం. 'బంగారం కొన్నా మోసపోతారు, అమ్మినా మోసపోతారు' అని అంటూ ఉంటారు. ఇది అక్షరాలా నిజం. బంగారం కొనేప్పుడైనా, అమ్మేటప్పుడైనా అప్రమత్తంగా లేకపోతే మోసపోక తప్పదు. అందుకే బంగారం కొనేముందు కాస్త అవగాహన పెంచుకోవడం మంచిది.

Read this: Sovereign Gold Bond: గోల్డ్ బాండ్ స్కీమ్‌లో పెట్టుబడి లాభమా? నష్టమా?

Akshaya Tritiya 2019, akshaya tritiya 2019 gold, akshaya tritiya 2019 gold offers, gold offers in hyderabad, gold offers 2019, gold offers today in hyderabad, gold shops offers in hyderabad, gold making charges, gold rate, gold price, అక్షయ తృతీయ 2019, అక్షయ తృతీయ ఆఫర్స్, బంగారు నగలు, బంగారు ఆభరణాలు, బంగారం రేట్, బంగారం ధర, హైదరాబాద్ బంగారం ఆఫర్, హైదరాబాద్ నగలపై ఆఫర్, నగలు మోసాలు, ఆభరణాల మోసాలు, మజూరీ అంటే, తరుగు అంటే
(ప్రతీకాత్మక చిత్రం)


బంగారంలో రకాలు




బంగారం రేటెంత అని ఎవరినైనా అడగ్గానే క్యారెట్ ఎంత అని ప్రశ్నిస్తారు. బంగారం 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ ఇలా వేర్వేరు నాణ్యతతో లభిస్తుంటాయి. 24 క్యారెట్ గోల్డ్ బిస్కెట్ల రూపంలో ఉంటుంది. ఈ బంగారంతో నగలు తయారు చేయడం సాధ్యం కాదు. అందుకే 24 క్యారెట్ బంగారంలో వెండి లేదా రాగి కలిపి నగలు తయారు చేస్తుంటారు. 24 క్యారెట్ గోల్డ్‌లో 2 క్యారెట్లు తగ్గించి వెండి లేదా రాగి కలిపి నగలు తయారు చేస్తారు. రెండు క్యారెట్లు తగ్గిస్తారు కాబట్టి దాన్ని 22 క్యారెట్ గోల్డ్ అంటారు. బంగారం షాపుల్లో అమ్మే నగల్లో ఎక్కువగా 22 క్యారెట్ గోల్డ్‌తో తయారైనవే. దాంతో పాటు ఇటీవల కాలంలో 18 క్యారెట్ బంగారు ఆభరణాలను కూడా అమ్ముతున్నారు. 22 క్యారెట్ ఆభరణాల కన్నా 18 క్యారెట్ ఆభరణాలు కాస్త ధర తక్కువగా ఉంటాయి. అయితే మీరు కొనే బంగారం నిజంగా 22 క్యారెట్ ఉంటుందా? లేదా అంతకన్నా తక్కువ ఉంటుందా? అని తెలుసుకోకపోతే మోసపోతారు. 18 క్యారెట్ నగలనే 22 క్యారెట్ నగలని చెప్పి మోసం చేయొచ్చు. 22 క్యారెట్ బంగారాన్నే 916 లేదా 91.6 బంగారం అని అంటారు.

Read this: SBI Gold Scheme: మీ బంగారం డిపాజిట్ చేస్తే వడ్డీ ఇవ్వనున్న ఎస్‌బీఐ

Akshaya Tritiya 2019, akshaya tritiya 2019 gold, akshaya tritiya 2019 gold offers, gold offers in hyderabad, gold offers 2019, gold offers today in hyderabad, gold shops offers in hyderabad, gold making charges, gold rate, gold price, అక్షయ తృతీయ 2019, అక్షయ తృతీయ ఆఫర్స్, బంగారు నగలు, బంగారు ఆభరణాలు, బంగారం రేట్, బంగారం ధర, హైదరాబాద్ బంగారం ఆఫర్, హైదరాబాద్ నగలపై ఆఫర్, నగలు మోసాలు, ఆభరణాల మోసాలు, మజూరీ అంటే, తరుగు అంటే
(ప్రతీకాత్మక చిత్రం)
Loading...

మజూరీ లేదా? ఇందులో నిజమెంత?


24 క్యారెట్ బంగారం బిస్కెట్ల రూపంలో ఉంటుంది. ఆ బంగారాన్ని కొంటే మేకింగ్ ఛార్జీలంటూ ఏవీ ఉండవు. కానీ... 22 క్యారెట్ నగలు కొంటే మేకింగ్ ఛార్జీలు చెల్లించాలి. ఎందుకంటే బంగారం తూకాన్ని ఆ రోజు ధరకు లెక్కించి రేటు నిర్ణయిస్తారు. నగల తయారీకి అయ్యే ఖర్చును మేకింగ్ ఛార్జీల పేరుతో బిల్లులో వేస్తారు. మేకింగ్ ఛార్జీలనే మజూరీ అంటారు. మజూరీ అంటే కూలీ అని అర్థం. ముడి బంగారంతో నగలు తయారు చేసిన వర్క్‌షాప్‌లో కూలీలకు ఇచ్చే ఛార్జీలన్నమాట. మేకింగ్ ఛార్జీలు ఎంత శాతం అన్నది నగల షాపుల యజమానులు నిర్ణయిస్తుంటారు. అయితే అక్షయ తృతీయ లాంటి సందర్భాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు మజూరీ లేదు. మేకింగ్ ఛార్జీలు 0% అనే ప్రకటనలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇక్కడే తిరకాసేంటో గమనించాలి. ముడి బంగారంతో నగలు తయారు చేయడానికి ఎంతో కొంత మేకింగ్ ఛార్జీలు చెల్లించక తప్పదు. ఊరికే డబ్బులు తీసుకోకుండా ఎవరూ నగలు తయారు చేసి ఇవ్వరు. మరి అలాంటప్పుడు నగల షాపుల యజమానులు మేకింగ్ ఛార్జీలు లేకుండా నగలను అమ్మడం ఏలా సాధ్యం? ఇది అస్సలు సాధ్యం కాదు. అయితే మీరు నగలకు చెల్లించే రేటులోనే మేకింగ్ ఛార్జీలు కూడా కలిపే ఉంటాయి. కాకపోతే కస్టమర్లను ఆకర్షించేందుకు మేకింగ్ ఛార్జీలు లేవు అని ప్రకటనలు ఇస్తుంటారు నగల షాపుల యజమానులు.

Read this: Aadhaar Alert: ప్లాస్టిక్ ఆధార్ కార్డ్ చెల్లదు... ఏం చేయాలో తెలుసుకోండి

Akshaya Tritiya 2019, akshaya tritiya 2019 gold, akshaya tritiya 2019 gold offers, gold offers in hyderabad, gold offers 2019, gold offers today in hyderabad, gold shops offers in hyderabad, gold making charges, gold rate, gold price, అక్షయ తృతీయ 2019, అక్షయ తృతీయ ఆఫర్స్, బంగారు నగలు, బంగారు ఆభరణాలు, బంగారం రేట్, బంగారం ధర, హైదరాబాద్ బంగారం ఆఫర్, హైదరాబాద్ నగలపై ఆఫర్, నగలు మోసాలు, ఆభరణాల మోసాలు, మజూరీ అంటే, తరుగు అంటే
(ప్రతీకాత్మక చిత్రం)

తరుగులో మతలబేంటీ?


మీరు కొన్న నగలు కొంతకాలం వాడిన తర్వాత పాతబడిపోతాయి. వాటిని తిరిగి అమ్మితే ఆ నగల్లోని బంగారం స్వచ్ఛంగా మార్చినప్పుడు కొంత వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్‌నే తరుగు అంటారు. నగల షాపులు 5 నుంచి 12 శాతం వరకు తరుగు తీస్తుంటాయి. అంటే మీరు 100 గ్రాముల బంగారాన్ని అమ్మితే అందులో మీకు వచ్చేది 88 గ్రాములే. 12 గ్రాములు తరుగు కింద వెళ్తుంది. అయితే ఇందులోనూ మతలబు ఉంటుంది. తరుగు లేదు అని ప్రచారం చేస్తుంటాయి నగల షాపులు. అయితే వాళ్ల షాపులో కొన్న బంగారాన్ని అమ్మితేనే తరుగు ఉండదంటారు. మీరు బంగారం కొనేప్పుడే ఈ తరుగును కలిపి రేటు వేస్తారు. ముందే అదనంగా వసూలు చేస్తారు. ఆ తర్వాత మీరు అమ్మేప్పుడు తరుగు లేదని అంటారు. మీరు ఒక షాపులో కొన్న నగల్ని మరో షాపులో అమ్మేందుకు వెళ్తే తీసుకోరు.

Read this: LIC Policy: మీ జీతం తక్కువా? ఈ ఎల్‌ఐసీ పాలసీ మీ కోసమే...

Akshaya Tritiya 2019, akshaya tritiya 2019 gold, akshaya tritiya 2019 gold offers, gold offers in hyderabad, gold offers 2019, gold offers today in hyderabad, gold shops offers in hyderabad, gold making charges, gold rate, gold price, అక్షయ తృతీయ 2019, అక్షయ తృతీయ ఆఫర్స్, బంగారు నగలు, బంగారు ఆభరణాలు, బంగారం రేట్, బంగారం ధర, హైదరాబాద్ బంగారం ఆఫర్, హైదరాబాద్ నగలపై ఆఫర్, నగలు మోసాలు, ఆభరణాల మోసాలు, మజూరీ అంటే, తరుగు అంటే
(ప్రతీకాత్మక చిత్రం)

బంగారం కొంటారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి


హాల్‌మార్క్ బంగారు నగలు అనే పేరును మీరు వినే ఉంటారు. బంగారు ఆభరణాల షాపులు ఈ పేరుతో ప్రకటనలు కూడా ఇస్తుంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS సంస్థకు చెందిన గుర్తే హాల్‌మార్క్. ఈ గుర్తు ఉన్న నగలు నాణ్యమైనవి. వాస్తవానికి ప్రతీ నగల షాపు హాల్‌మార్క్ గుర్తు ఉన్న బంగారు నగలనే అమ్మాలి. మీరు నగలు కొనేప్పుడు హాల్‌మార్క్ గుర్తు ఉందో లేదో చూడాలి. హాల్‌మార్క్ గుర్తు ఉన్న ఆభరణాలే కొనాలి. అయితే కొన్ని నగల షాపులు సొంతగా హాల్‌మార్క్ ముద్ర వేసి నగల్ని అమ్ముతుంటాయి. అదే జరిగితే మీరు మోసపోయినట్టే. అందుకే మీరు ఏ షాపులో కొంటున్నారో ఆ షాపు నుంచి బిల్లు తీసుకోవాలి. ట్యాక్స్ కట్టాల్సి వస్తుందని చెప్పినా సరే బిల్లు తప్పనిసరిగా తీసుకోండి. మీరు కొన్న బంగారం తూకం విషయంలో అనుమానం ఉంటే మరో చోట తూకం చూడండి. తూకం సరిగ్గా లేదంటే కంప్లైంట్ చేయొచ్చు. నగలు కొనేప్పుడు రాళ్లను కలిపి తూకం వేసి మోసం చేస్తుంటాయి షాపులు. రాళ్ల బరువు తీసేసి తూకం చేయమని గట్టిగా అడగండి. అవసరమైతే రాళ్లకు వేరుగా బిల్లు వేయమని అడగండి. మీరు కొన్న బంగారంలో తేడా ఉందని భవిష్యత్తులో అనిపిస్తే మీరు ఆ షాపుపైన కంప్లైంట్ కూడా చేయొచ్చు. లేదో కన్స్యూమర్స్ ఫోరమ్‌లో ఫిర్యాదు చేయొచ్చు.

Photos: హీరో నుంచి 3 కొత్త ప్రీమియం బైక్స్... అదిరిపోయే ఫీచర్స్

ఇవి కూడా చదవండి:

EPFO: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ లింక్... ఉమాంగ్ యాప్‌లో చేయండిలా

Credit Card: మీకు ఉపయోగపడే క్రెడిట్ కార్డ్ ఏదో తెలుసుకోండి ఇలా
First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...